Skip to content

Vineyard గురించి బైబిల్ వచనాలు: Leased

10 వచనాలు · 9 కోణాలు

Leased గురించి వచనాలు

  1. బయల్-హామోను దగ్గర సొలొమోనుకు ద్రాక్షతోట ఉంది; అతడు తన ద్రాక్షతోటను కౌలుకిచ్చాడు. దాని ఫలానికి ఒక్కొక్కడు వెయ్యి వెండి షెకెళ్ళ శిస్తు చెల్లించాలి.

  2. కాని, నా ద్రాక్షవనం నా స్వాధీనంలోనే ఉంది; సొలొమోను రాజా, నీ వెయ్యి షెకెళ్ళు నీకే చెందుతాయి. వాటిని చూసుకునే వారికి రెండువందలు షెకెళ్ళు గిట్టుతాయి.

  3. ఆ రోజున వెయ్యి వెండి షెకెళ్ళు విలువ కలిగిన వెయ్యి ద్రాక్షతీగెలు ఉన్న ప్రతిచోట గచ్చపొదలు ముళ్ళచెట్లు ఉంటాయి.

  4. “మరొక ఉపమానం వినండి: ఒక యజమాని తన పొలంలో ద్రాక్షతోటను నాటాడు. అతడు దాని చుట్టూ కంచె వేయించి, అందులో ద్రాక్ష గానుగ తొట్టి తొలిపించి, కాపలా కాయడానికి ఎత్తైన గోపురం కట్టించాడు. తర్వాత ఆ ద్రాక్షతోటను కొందరు కౌలురైతులకు అద్దెకు ఇచ్చి దూర దేశానికి వెళ్లిపోయాడు.

  5. కోతకాలం సమీపించినప్పుడు పంటలో తన వంతును తీసుకుని రమ్మని ఆ రైతుల దగ్గరకు తన దాసులను పంపాడు.

  6. “ఆ రైతులు అతని దాసులను పట్టుకున్నారు; వారు ఒకని కొట్టారు, ఒకని చంపారు, మరొకని మీద రాళ్లు విసిరారు.

  7. ఆ యజమాని ఇతర దాసులను, మొదటిసారి కంటే ఎక్కువ మంది పంపాడు, ఆ కౌలు రైతులు వీరిని కూడా ముందు చేసినట్టే చేశారు.

  8. చివరికి ఆ యజమాని, ‘వారు నా కుమారున్ని గౌరవిస్తారు’ అనుకుని, తన కుమారుని వారి దగ్గరకు పంపాడు.

  9. “కాని ఆ కౌలు రైతులు కుమారుని చూసి ‘ఇతడే వారసుడు, రండి ఇతన్ని చంపి ఇతని వారసత్వాన్ని తీసుకుందాం’ అని తమలో తాము చెప్పుకొన్నారు.

  10. కాబట్టి వారు అతన్ని బయటకు తీసుకెళ్లి, చంపి, అతని శరీరాన్ని ద్రాక్షతోట బయట పడవేశారు.