Skip to content

Vanity గురించి బైబిల్ వచనాలు

88 వచనాలు · 60 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహోవాయే దేవుడని ఆయన తప్ప మరి ఎవరు లేరని మీరు తెలుసుకునేలా ఇవన్నీ మీకు చూపబడ్డాయి.

  2. ఆయన శాసనాలను, ఆయన తమ పూర్వికులతో చేసిన నిబంధనను, ఆయన పాటించమని హెచ్చరించిన ధర్మశాస్త్రాన్ని వారు నిరాకరించారు. అయోగ్యమైన విగ్రహాలను అనుసరించి అయోగ్యులయ్యారు. యెహోవా వారికి, “వారు చేసినట్లు మీరు చేయకూడదు” అని చెప్పినప్పటికి తమ చుట్టూ ఉన్న ప్రజల విధానాలను వారు అనుసరించారు.

  3. నా జీవితాన్ని తృణీకరిస్తున్నాను; నేను ఎల్లకాలం బ్రతకను. నన్ను ఒంటరిగా విడిచిపెట్టండి; నా దినాలు అర్థం లేకుండా ఉన్నాయి.

  4. మోసగాళ్లు ఎవరో ఆయనకు తెలుసు; చెడుతనాన్ని చూసిప్పుడు, ఆయన దానిని గమనించడా?

  5. అడవి గాడిదపిల్ల మనిషిగా పుడుతుందేమో కాని, తెలివిలేనివాడు తెలివైనవానిగా మారడం కష్టము.

  6. అతడు వ్యర్థమైన దానిని నమ్మి తనను తాను మోసగించుకోవద్దు ఎందుకంటే అతనికి ప్రతిఫలం ఏమి ఉండదు.

  7. మేము ఆయనను సేవించడానికి సర్వశక్తిమంతుడు ఎవరు? మేము ఆయనకు ప్రార్థిస్తే మాకే లాభం కలుగుతుంది?’ అంటారు.

  8. దేశాలు ఎందుకు కుట్ర చేస్తున్నాయి? ప్రజలు ఎందుకు వ్యర్థంగా పన్నాగం వేస్తున్నారు?

  9. ఓ ప్రజలారా, మీరు ఎంతకాలం నా కీర్తిని అవమానంగా మారుస్తారు? మీరు ఎంతకాలం భ్రమలను ప్రేమిస్తూ అబద్ధాలను అనుసరిస్తారు? సెలా

  10. వారి నోటి నిండా శాపాలు, మోసాలు, బెదిరింపులు ఉన్నాయి; ఇబ్బంది, కీడు వారి నాలుక క్రింద ఉంటాయి.

  11. ప్రతి ఒక్కరు తమ పొరుగువారితో అబద్ధమాడుతున్నారు; వారు తమ హృదయాల్లో మోసం పెట్టుకుని తమ పెదవులతో పొగడుతారు.

  12. ఎవరి చేతులు నిర్దోషమైనవో ఎవరి హృదయం శుద్ధమైనదో, ఎవరు విగ్రహాల మీద నమ్మిక ఉంచరో, ఎవరు మోసపూరితంగా ప్రమాణాలు చేయరో, వారే కదా!

  13. నేను మోసగాళ్ళతో కూర్చోను, వేషధారులతో నేను సహవాసం చేయను.

  14. విగ్రహాలను వెంబడించే వారిని నేను అసహ్యించుకుంటాను; నేనైతే యెహోవాలో నమ్మకముంచాను.

  15. వారి పడకలపై ఉండగానే చెడుకు కుట్ర చేస్తారు; వారు తమ పాప మార్గాల్లో వెళ్తారు తప్పును తిరస్కరించరు.

  16. మీరు నా దినాలను కేవలం బెత్తెడంత చేశారు; నా జీవితకాలం మీ ఎదుట శూన్యము. భద్రత గలవారిగా అనిపించినా, మనుష్యులంతా కేవలం ఊపిరి వంటివారు. సెలా

  17. “నిశ్చయంగా మనుష్యులు కేవలం నీడలా తిరుగుతున్నారు; వారి ధనం ఎవరికి దక్కుతుందో తెలియకుండానే వారు వ్యర్థంగా ధనం సమకూర్చుకుంటారు.

  18. మీరు మనుష్యులను వారి పాపం విషయంలో మందలించినప్పుడు, చిమ్మెటలా మీరు వారి సంపదను హరించివేస్తారు. మనుష్యులంతా కేవలం ఊపిరి వంటివారు. సెలా

  19. నన్ను చూడటానికి వచ్చి అబద్ధాలాడతారు, వారు తమ హృదయంలో దుష్టత్వం నింపుకొని వస్తారు; వారు బయటకు వెళ్లినప్పుడు దానిని చెప్తారు.

  20. శత్రువుకు వ్యతిరేకంగా మాకు సహాయం చేయండి, ఎందుకంటే మనుష్యుల సహాయం పనికిరానిది.

  21. సామాన్య మనుష్యులు ఊపిరిలాంటివారు, ఉన్నత గోత్రం కేవలం మాయ త్రాసులో పెట్టి తూస్తే వారిద్దరు కలిసి ఊపిరి కంటే తేలికగా ఉంటారు.

  22. అందువల్ల ఆయన వారి రోజులను నిష్ఫలంగా వారి సంవత్సరాలు భయంలో ముగిసిపోయేలా చేశారు.

  23. మనుష్యుల ప్రణాళికలన్నీ యెహోవాకు తెలుసు; అవి వ్యర్థమైనవి అని ఆయనకు తెలుసు.

  24. పనికిరాని వాటినుండి నా కళ్లను త్రిప్పండి; మీ మార్గాల ద్వార నా జీవితాన్ని కాపాడండి.

  25. ద్విమనస్కులంటే నాకు అసహ్యం, కాని మీ ధర్మశాస్త్రం నాకు ఇష్టం.