Vanity గురించి బైబిల్ వచనాలు: Idolatry is
Idolatry is గురించి వచనాలు
ఆయన శాసనాలను, ఆయన తమ పూర్వికులతో చేసిన నిబంధనను, ఆయన పాటించమని హెచ్చరించిన ధర్మశాస్త్రాన్ని వారు నిరాకరించారు. అయోగ్యమైన విగ్రహాలను అనుసరించి అయోగ్యులయ్యారు. యెహోవా వారికి, “వారు చేసినట్లు మీరు చేయకూడదు” అని చెప్పినప్పటికి తమ చుట్టూ ఉన్న ప్రజల విధానాలను వారు అనుసరించారు.
విగ్రహాలను వెంబడించే వారిని నేను అసహ్యించుకుంటాను; నేనైతే యెహోవాలో నమ్మకముంచాను.
విగ్రహాలను చేసే వారందరు వట్టివారు. వారు నిధిగా ఉంచిన వస్తువులు పనికిరానివి. వారి కోసం మాట్లాడేవారు గ్రుడ్డివారు; వారు తెలివిలేనివారు, వారు సిగ్గుపరచబడతారు.
ఎందుకు పనికిరాని విగ్రహాన్ని పోతపోసిన దానినొక దేవునిగా రూపించేవాడు ఎవడు?
వారంతా తెలివిలేనివారు, మూర్ఖులు; వారు పనికిరాని చెక్క విగ్రహాల బోధను వింటున్నారు.
అయినా నా ప్రజలు నన్ను మరచిపోయారు; పనికిమాలిన విగ్రహాలకు ధూపం వేస్తున్నారు, వాటివలన వారు తమ జీవితాల్లో తడబడ్డారు పురాతనమైన మార్గాలను వదిలిపెట్టి, సరిగా లేని అడ్డదారుల్లో నడవాలి అనుకున్నారు.