Trees గురించి బైబిల్ వచనాలు: Fir
Fir గురించి వచనాలు
ఇలా హీరాము సొలొమోనుకు అతడు కోరిన దేవదారు, సరళవృక్షాల మ్రానులు అన్ని ఇచ్చాడు.
నీవు పంపిన దూతల ద్వారా ప్రభువును దూషించావు. నీవు అన్నావు, “నా అనేక రథాల చేత, పర్వత శిఖరాల మీదికి ఎక్కాను, లెబానోను ఎత్తైన స్థలాలను ఎక్కాను. దాని పొడువైన దేవదారులను నరికివేశాను, శ్రేష్ఠమైన సరళ వృక్షాలను నరికివేశాను. దాని చివరి సరిహద్దులను చేరుకున్నాను, దాని సారవంతమైన అడవులను చేరుకున్నాను.
అక్కడ పక్షులు వాటిలో గూళ్ళు కట్టుకుంటాయి; కొంగలు సరళ వృక్షాలపై నివాసముంటాయి.