Trees గురించి బైబిల్ వచనాలు: Given as food to the animal creation
Given as food to the animal creation గురించి వచనాలు
అప్పుడు దేవుడు, “భూమిపై విత్తనాలు ఇచ్చే ప్రతి మొక్కను, విత్తనాలు గల ఫలమిచ్చే ప్రతి చెట్టును మీకు ఆహారంగా ఇస్తున్నాను.
భూమిపై ఉన్న మృగాలన్నిటికి, ఆకాశ పక్షులన్నిటికి, నేలపై ప్రాకే జీవులన్నిటికి, జీవం ఉన్న ప్రతీ దానికి ప్రతి పచ్చని మొక్కను ఆహారంగా ఇస్తున్నాను” అని అన్నారు. అలాగే జరిగింది.
మీరు ఒక పట్టణాన్ని ముట్టడి వేసి, దానిని స్వాధీనపరచుకోడానికి ఎక్కువసేపు దానితో పోరాడవలసి వస్తే, మీరు దాని చెట్లను గొడ్డలితో నరికివేయవద్దు, ఎందుకంటే వాటి ఫలాలు మీరు తినవచ్చు. చెట్లేమైనా మనుష్యులా మీరు వాటిని నరికివేయడానికి?