The Sidonians గురించి బైబిల్ వచనాలు: Hostile and oppressive to God's people
Hostile and oppressive to God's people గురించి వచనాలు
సీదోనీయులు, అమాలేకీయులు, మయోనీయుల మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు, మీరు సహాయం కోసం మొరపెట్టినప్పుడు నేను మిమ్మల్ని వారి చేతుల్లో నుండి కాపాడలేదా?
‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: “ ‘సీదోను పట్టణమా, నేను నీకు విరోధిని, నీ మధ్య నేను ఘనత పొందుతాను. నేను నీకు శిక్ష విధించి నీలో నా పరిశుద్ధతను కనుపరిచినప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.
“ ‘ఇశ్రాయేలీయుల పొరుగువారు ఇకపై గుచ్చుకుని బాధించే కంపలుగా పదునైన ముళ్ళుగా ఉండరు. అప్పుడు వారు నేనే యెహోవానని తెలుసుకుంటారు.
ఎందుకంటే మీరు నా వెండి బంగారాలను తీసుకెళ్లారు, నా శ్రేష్ఠమైన వస్తువులను మీ గుళ్ళకు తీసుకెళ్లారు.
యూదా, యెరూషలేము ప్రజలు తమ ప్రాంతానికి దూరం ఉండాలని వారిని గ్రీకులకు అమ్మివేశారు.