The Punishment of the Wicked గురించి బైబిల్ వచనాలు: Oppressing
Oppressing గురించి వచనాలు
నిన్ను బాధించేవారు తమ మాంసాన్ని తామే తినేలా చేస్తాను; ద్రాక్షరసంతో మత్తు ఎక్కినట్లు వారు తమ రక్తాన్ని త్రాగి మత్తులో ఉంటారు. అప్పుడు యెహోవానైన నేనే నీ రక్షకుడనని యాకోబు బలవంతుడైన నీ విమోచకుడని మానవులందరూ తెలుసుకుంటారు.”
“ ‘అయితే నిన్ను మ్రింగివేసేవాళ్లంతా మ్రింగివేయబడతారు; నీ శత్రువులందరూ బందీలుగా కొనిపోబడతారు. నిన్ను దోచుకునేవారు దోచుకోబడతారు; నిన్ను పాడుచేసే వారందరిని నేను పాడుచేస్తాను.
వారి పిల్లలు పూర్వకాలంలో ఉన్నట్లే ఉంటారు, వారి సంఘం నా ముందు స్థిరపడుతుంది; వారిని హింసించే వారందరినీ నేను శిక్షిస్తాను.