Skip to content

The Olive Tree గురించి బైబిల్ వచనాలు

40 వచనాలు · 35 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సాయంకాలం ఆ పావురం అతని దగ్గరకు వచ్చినప్పుడు, దాని ముక్కుకు పచ్చని ఒలీవ ఆకు ఉంది. అప్పుడు భూమి మీద నీరు తగ్గిందని నోవహు గ్రహించాడు.

  2. ఏడవ సంవత్సరం ఆ భూమిని దున్నకుండా ఉపయోగించకుండా వదిలేయాలి. అప్పుడు మీ ప్రజల్లో పేదవారు దాని నుండి ఆహారం తీసుకోగా మిగిలింది అడవి జంతువులు తినవచ్చు. మీ ద్రాక్షతోటకు ఒలీవతోటకు ఇలాగే చేయాలి.

  3. “వెలుగు కోసం దీపాలు వెలుగుతూ ఉండేలా దంచి తీసిన ఒలీవ నూనెను మీ దగ్గరకు తీసుకురావాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు.

  4. మీరు సమకూర్చని అన్ని రకాల మంచి వస్తువులతో నిండిన ఇళ్ళను, మీరు తవ్వని బావులను, మీరు నాటని ద్రాక్షతోటలు, ఒలీవల తోటలను మీకు ఇస్తారు; మీరు తిని తృప్తిపొందిన తర్వాత,

  5. అంతేకాదు గోధుమలు యవలు ద్రాక్షచెట్లు అంజూర చెట్లు దానిమ్మపండ్లు ఒలీవనూనె తేనె దొరికే దేశం;

  6. మీరు మీ చెట్ల నుండి ఒలీవలను కొట్టినప్పుడు, రెండవసారి కొమ్మలపైకి వెళ్లవద్దు. విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్ర కోసం మిగిలి ఉన్నవాటిని వదిలేయండి.

  7. మీకు ఒలీవచెట్లు ఉంటాయి గాని మీరు నూనె వాడరు, ఎందుకంటే ఒలీవలు రాలిపోతాయి.

  8. ఆయన అతన్ని ఎత్తైన స్థలాలపైకి ఎక్కించారు పొలాల పంటను అతనికి తినిపించారు. బండ నుండి తీసిన తేనెతో, రాళ్లమయమైన పర్వత శిఖరం నుండి తీసిన నూనెతో అతన్ని పోషించారు,

  9. “అయితే ఒలీవచెట్టు, ‘చెట్లపై రాజుగా ఉండి అటు ఇటూ ఊగడం కోసం దేవుడిని మానవులను గౌరవించడానికి వాడే నా తైలాన్ని నేను వదిలేయాలా?’ అన్నది.

  10. అతడు మీ ద్రాక్షతోటల నుండి ఒలీవతోటల నుండి శ్రేష్ఠమైన వాటిని తీసుకుని తన సహాయకులకు ఇస్తాడు.

  11. గర్భాలయం కోసం అతడు ఒలీవ కర్రతో పది మూరల ఎత్తున్న కెరూబుల జతను చేయించాడు, ఒక్కొక్కటి పది మూరల ఎత్తు గలవి.

  12. గర్భాలయం ప్రవేశ ద్వారానికి అతడు ఒలీవ చెక్కతో చేయించిన తలుపులు చేయించాడు. ద్వారబంధం మీది కమ్మి నిలువు కమ్మిల వెడల్పు పరిశుద్ధాలయం వెడల్పులో అయిదవ వంతు ఉన్నాయి.

  13. ఒలీవ కర్రతో చేసిన ఆ రెండు తలుపుల మీద అతడు కెరూబులు, ఖర్జూర చెట్లు, విచ్చుకున్న పువ్వులను చెక్కించాడు, ఆ కెరూబుల మీద, చెట్లమీద బంగారంతో పొదిగించాడు.

  14. అదే రీతిలో ప్రధాన మందిర ప్రవేశ ద్వారానికి ఒలీవ కర్రతో రెండు నిలువు కమ్ములు చేయించాడు. వీటి వెడల్పు గోడ వెడల్పులో నాలుగో వంతు ఉంది.

  15. తర్వాత నేను వచ్చి మిమ్మల్ని మీ సొంత దేశం లాంటి దేశానికి తీసుకెళ్తాను. అది ధాన్యాలు, క్రొత్త ద్రాక్షరసం ఉన్న దేశం, రొట్టె, ద్రాక్షతోటలు ఉన్న దేశము. ఒలీవచెట్లు, తేనె ఉన్న దేశము. మరణాన్ని కాదు, జీవాన్ని ఎంచుకోండి. “హిజ్కియా, ‘యెహోవా మనలను విడిపిస్తారు’ అంటూ మిమ్మల్ని నమ్మిస్తున్నాడు, అతని మాటలు వినకండి.

  16. పశ్చిమ దిగువ ప్రాంతంలో ఉన్న ఒలీవచెట్లు, మేడిచెట్ల మీద గెదేరీయుడైన బయల్-హనాను అధికారి. ఒలీవనూనె గిడ్డంగులకు యోవాషు అధికారి.

  17. ఈ రోజే మీరు వారి దగ్గర నుండి తీసుకున్న పొలాలు, ద్రాక్షతోటలు, ఒలీవతోటలు, ఇల్లు వారికి తిరిగి ఇచ్చేయండి. అలాగే వారి నుండి వసూలు చేసిన వడ్డీ డబ్బులు ధాన్యంలో, క్రొత్త ద్రాక్షరసంలో నూనెలో ఒక శాతం వారికి అప్పగించండి” చెప్పాను.

  18. వెంటనే వారు తమ పట్టణాల్లో యెరూషలేములో ఈ విధంగా ప్రకటించారు: “మీరు పర్వత ప్రాంతానికి వెళ్లి ఒలీవ చెట్ల కొమ్మలు, అడవి ఒలీవ చెట్ల కొమ్మలు, గొంజి చెట్టు కొమ్మలు, ఈత చెట్టు కొమ్మలు, గుబురుగా ఉండే చెట్టు కొమ్మలు తీసుకువచ్చి వ్రాయబడిన విధంగా తాత్కాలిక నివాసాలు నిర్మించాలి.”

  19. పిందెలు రాలిపోయే ద్రాక్ష చెట్టులా, పువ్వులు రాలిపోయే ఒలీవ చెట్టులా అతడు ఉంటాడు.

  20. కానీ నేను దేవుని నివాసంలో పచ్చని ఒలీవ చెట్టులా ఉన్నాను; నేను ఎల్లప్పుడు, మారని దేవుని ప్రేమను నమ్ముతాను.

  21. మీ ఇంట్లో మీ భార్య ఫలించే ద్రాక్షతీగెలా ఉంటుంది; మీ భోజనపు బల్లచుట్టూ మీ పిల్లలు ఒలీవ మొక్కల్లా ఉంటారు.

  22. అయినా ఒలీవచెట్టు కొమ్మలు దులపగా పై కొమ్మ చివర రెండు మూడు పండ్లు మిగిలినట్లు, ఫలించు చెట్టు కొమ్మల్లో మూడు, నాలుగు పండ్లు మిగిలినట్లు, కొంత పరిగె మిగిలి ఉంటుంది” అని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తెలియజేస్తున్నారు.

  23. ఒలీవ చెట్టుని దులిపినప్పుడు, ద్రాక్షపండ్ల కోత తర్వాత పరిగె పళ్ళు ఏరుకుంటున్నప్పుడు జరిగినట్లుగా భూమి మీద భూమి మీద ప్రజలందరి మధ్యలో ఇది జరుగుతుంది.

  24. అందమైన పండ్లతో అభివృద్ధి చెందుతున్న ఒలీవచెట్టు అని యెహోవా నిన్ను పిలిచాడు. అయితే పెను తుఫాను గర్జనతో దానికి నిప్పు పెడతాడు, దాని కొమ్మలు విరిగిపోతాయి.

  25. అతని చిగురు పెరుగుతుంది. అతని వైభవం ఒలీవ చెట్టులా, అతని సువాసన లెబానోను దేవదారులా ఉంటుంది.