కంటెంట్‌కు వెళ్లండి

The Canaanites గురించి బైబిల్ వచనాలు

62 వచనాలు · 30 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఆషేరీయులు వారిని వెళ్లగొట్టలేదు కాబట్టి వారు కనానీయ నివాసుల మధ్యలో నివసించారు.

  2. నఫ్తాలి గోత్రం వారు కూడా బేత్-షెమెషును బేత్-అనాతులో ఉన్నవారిని వెళ్లగొట్టలేదు; నఫ్తాలీయులు కూడా కనానీయ నివాసుల మధ్యలో నివసించారు, బేత్-షెమెషులో, బేత్-అనాతులో ఉన్నవారు వారికి వెట్టిపనులు చేశారు.

  3. అమోరీయులు దాను గోత్రం వారిని మైదానం దిగువకు రాకుండ కొండసీమ ప్రాంతానికి పరిమితం చేశారు.

  4. అమోరీయులు హెరెసు పర్వతంలో, అయ్యాలోనులో, షయల్బీములో నివసించడానికి నిశ్చయించుకున్నారు, కానీ యోసేపు గోత్రాల బలం ఎక్కువైనప్పుడు, వారు అమోరీయులతో వెట్టిపనులు చేయించుకొన్నారు.

  5. అమోరీయుల సరిహద్దు అక్రబ్బీం నుండి సెల వరకు విస్తరించింది.

  6. కనానులో యుద్ధాలను అనుభవించని ఆ ఇశ్రాయేలీయులందరిని పరీక్షించడానికి యెహోవా విడిచిపెట్టిన దేశాలు ఇవి

  7. ఆయన యుద్ధం చేసే పూర్వ అనుభవంలేని ఇశ్రాయేలీయుల సంతానానికి యుద్ధం నేర్పించడానికి మాత్రమే ఇలా చేశారు:

  8. ఫిలిష్తీయుల అయిదుగురు పరిపాలకులు, కనానీయులందరూ, సీదోనీయులు, బయల్-హెర్మోను నుండి లెబో హమాతు వరకు ఉన్న లెబానోను పర్వతాల్లో ఉండే హివ్వీయులు.

  9. యెహోవా మోషే ద్వారా వారి పూర్వికులకు ఇచ్చిన ఆజ్ఞలు వారు అనుసరిస్తారో లేదో చూడడానికి ఇశ్రాయేలీయులను పరీక్షించడానికి వారు అక్కడ ఉంచబడ్డారు.

  10. వారి విగ్రహాలను పూజించారు. అవే వారికి ఉరి అయ్యాయి.

  11. తమ కుమారులను, కుమార్తెలను దయ్యానికి బలి ఇచ్చారు.

  12. నిరపరాధుల రక్తం, తమ కుమారుల రక్తం, కుమార్తెల రక్తం వారు చిందించారు. కనాను దేశపు విగ్రహాలకు తమ సొంత పిల్లల్ని బలి ఇచ్చారు. ఈ రక్తపాతం చేత దేశమంతా అపవిత్రమైనది.