కంటెంట్‌కు వెళ్లండి

The Afflictions of the Wicked గురించి బైబిల్ వచనాలు: Impenitence is a cause of

14 వచనాలు · 20 కోణాలు

Impenitence is a cause of గురించి వచనాలు

  1. వారు నా సలహాను అంగీకరించలేదు నా గద్దింపును కూడా త్రోసివేశారు కాబట్టి,

  2. వారు తమ క్రియలకు తగిన ఫలాన్ని అనుభవిస్తారు వారి ఆలోచనల ఫలితాలకు వారే విసుగుచెందుతారు.

  3. “ ‘నీ అతి కామాతురతయే నీకున్న అపవిత్రత. నిన్ను పవిత్రపరచడానికి నేను ప్రయత్నించాను కాని నీవు శుద్ధి కాలేదు కాబట్టి నా ఉగ్రత నీమీద తీర్చుకునే వరకు నీవు పవిత్రం కావు.

  4. “మీ ప్రతి పట్టణానికి తినడానికి ఏమీ దొరక్కుండా చేశాను, ప్రతి పట్టణంలో ఆహారం లేకుండ చేశాను, అయినా మీరు నా వైపు తిరగలేదు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  5. “కోతకాలానికి మూడు నెలలు ముందు వర్షం కురవకుండా చేశాను, నేను ఒక పట్టణం మీద వర్షం కురిపించి, మరో పట్టణం మీద కురిపించలేదు. ఒక పొలం మీద వర్షం కురిసింది; వర్షం లేనిచోటు ఎండిపోయింది.

  6. ప్రజలు నీళ్ల కోసం పట్టణం నుండి పట్టణానికి తడబడుతూ వెళ్లారు కాని వారికి త్రాగడానికి సరిపడా నీళ్లు దొరకలేదు. అయినా మీరు నా వైపు తిరగలేదు” అని యెహోవా అంటున్నారు.

  7. “ఎన్నోసార్లు నేను మీ తోటలను, ద్రాక్షతోటలను వడగాలి వల్ల కాటుక తెగుళ్ళ వల్ల పాడు చేశాను. మిడతలు మీ అంజూర చెట్లను ఒలీవ చెట్లను మ్రింగివేశాయి. అయినా మీరు నా వైపు తిరగలేదు” అని యెహోవా అంటున్నారు.

  8. “నేను ఈజిప్టు మీదికి రప్పించినట్లు మీ మీదికి తెగుళ్ళు రప్పించాను. మీరు కొల్లగొట్టిన గుర్రాలతో పాటు మీ యువకులను కత్తితో చంపాను. మీ శిబిరాల పుట్టిన దుర్వాసన మీ ముక్కు పుటలను చేరింది. అయినా మీరు నా వైపుకు తిరగలేదు” అని యెహోవా అంటున్నారు.

  9. “నేను సొదొమ గొమొర్రా పట్టణాలను పడగొట్టినట్టు మీలో కొంతమందిని పడగొట్టాను. మీరు మంటలో నుండి లాగివేసిన కట్టెలా ఉన్నారు, అయినా మీరు నా వైపుకు తిరగలేదు, అని యెహోవా అంటున్నారు.

  10. “కాబట్టి ఇశ్రాయేలూ, నేను నీకు చేసేది ఇదే, ఇశ్రాయేలూ, నేను ఇలా చేస్తాను కాబట్టి నీ దేవుని కలుసుకోడానికి సిద్ధపడు.”

  11. “కానీ వారు నిర్లక్ష్యం చేసి మొండిగా వెనుదిరిగి తమ చెవులను మూసుకున్నారు.

  12. తమ హృదయాలను చెకుముకి రాయిలా గట్టిగా చేసుకున్నారు, సైన్యాల యెహోవా తన ఆత్మ ద్వారా పూర్వ ప్రవక్తలకు ఇచ్చిన ఉపదేశాన్ని, మాటలను వినలేదు. కాబట్టి సైన్యాల యెహోవా చాలా కోప్పడ్డారు.

  13. ఆమె లైంగిక దుర్నీతి గురించి పశ్చాత్తాపపడడానికి నేను సమయం ఇచ్చాను కాని ఆమె దానికి ఇష్టపడలేదు.

  14. కాబట్టి నేను ఆమెను శ్రమల పడకపై పడవేస్తాను. అలాగే ఆమెతో వ్యభిచరించిన వారు పశ్చాత్తాపపడకపోతే వారిని కూడా తీవ్రమైన బాధలకు గురిచేస్తాను.