Skip to content

Sun గురించి బైబిల్ వచనాలు: Figurative

10 వచనాలు · 8 కోణాలు

Figurative గురించి వచనాలు

  1. “యెహోవా, మీ శత్రువులందరూ అలాగే నశించాలి! అయితే మిమ్మల్ని ప్రేమించే వారందరు తన బలంతో ఉదయించే సూర్యునిలా ఉండాలి.” తర్వాత దేశం నలభై సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది.

  2. యెహోవా దేవుడు మాకు సూర్యుడు డాలు; యెహోవా దయను ఘనతను అనుగ్రహిస్తారు; నిందారహితులుగా నడుచుకునే వారికి ఆయన ఏ మేలు చేయకుండ మానరు.

  3. యెహోవా తన ప్రజల గాయాలను కట్టి, వారి దెబ్బలను బాగుచేసిన రోజున, చంద్రుడు సూర్యునిలా ప్రకాశిస్తాడు. సూర్యుని వెలుగు ఏడు రెట్లు, అంటే ఏడు రోజుల పూర్తి వెలుగులా ఉంటుంది.

  4. ఇకమీదట పగలు సూర్యుని వెలుగు నీకు ఉండదు, చంద్రుని వెన్నెల నీపై ప్రకాశించదు, యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉంటారు. నీ దేవుడు నీకు మహిమగా ఉంటారు.

  5. నీ సూర్యుడికపై అస్తమించడు. నీ చంద్రుడు క్షీణించడు. యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉంటారు, నీ దుఃఖ దినాలు అంతమవుతాయి.

  6. ఏడుగురు పిల్లల తల్లి మూర్ఛపోయి తుది శ్వాస విడుస్తుంది. పగలు ఉండగానే ఆమెకు ప్రొద్దు గ్రుంకుతుంది; ఆమె అవమానం పాలవుతుంది, కించపరచబడుతుంది. ప్రాణాలతో బయటపడిన వారిని వారి శత్రువుల ముందు ఖడ్గానికి అప్పగిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  7. అయితే నా పేరుకు భయపడే మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, అతని కిరణాలతో స్వస్థత కలుగుతుంది. మీరు శాలలోనుండి బయటకు వెళ్లిన క్రొవ్వినదూడల్లా ఉల్లాసంగా గంతులు వేస్తారు.

  8. ఆయన కుడిచేతిలో ఏడు నక్షత్రాలను పట్టుకున్నాడు; ఆయన నోటి నుండి పదును గల రెండు అంచుల ఖడ్గం బయటకు వస్తుంది; ఆయన ముఖం పూర్తి తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యునిలా ఉంది.

  9. అప్పుడు పరలోకంలో ఒక గొప్ప సూచన కనిపించింది: ఒక స్త్రీ సూర్యుని ధరించుకొని, కాళ్లక్రింద చంద్రుని, తన తలమీద పన్నెండు నక్షత్రాల కిరీటాన్ని పెట్టుకొని ఉంది.

  10. అప్పుడు సూర్యుని మీద నిలబడిన ఒక దూతను నేను చూశాను, అతడు బిగ్గరగా మధ్య ఆకాశంలో ఎగిరే పక్షులన్నిటినీ పిలుస్తూ వాటితో, “రండి! దేవుని గొప్ప విందుకు కలిసి రండి!