Skip to content

Sun గురించి బైబిల్ వచనాలు: Created

8 వచనాలు · 8 కోణాలు

Created గురించి వచనాలు

  1. దేవుడు, “పగలు రాత్రులను వేరు చేయడానికి ఆకాశ విశాలంలో జ్యోతులుండాలి, అవి రుతువులను రోజులను సంవత్సరాలను సూచించే అసాధారణ గుర్తులుగా ఉండాలి.

  2. ఆకాశ విశాలంలో భూమికి వెలుగునిచ్చే జ్యోతులుండును గాక” అని అన్నారు, అలాగే జరిగింది.

  3. దేవుడు పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని రాత్రిని ఏలడానికి చిన్న జ్యోతిని అలా రెండు గొప్ప జ్యోతులను అలాగే నక్షత్రాలను కూడా చేశారు.

  4. భూమికి వెలుగునివ్వడానికి, పగటిని రాత్రిని పాలించడానికి, చీకటిని వెలుగును వేరు చేయడానికి, దేవుడు వాటిని ఆకాశ విశాలంలో అమర్చారు. అది మంచిదని దేవుడు చూశారు.

  5. And to rule over the day and over the night, and to divide the light from the darkness: and God saw that it was good.

  6. పగలు మీదే. రాత్రి కూడా మీదే. వెలిగే నక్షత్రాలు మీవే! సూర్యున్ని మీరే చేశారు.

  7. మహాజ్యోతులను నిర్మించిన దేవునికి స్తుతులు, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  8. యెహోవా ఇలా చెప్తున్నారు, పగలు ప్రకాశించడానికి సూర్యుని నియమించినవాడు, రాత్రి ప్రకాశించడానికి, చంద్రుని, నక్షత్రాలను శాసించేవాడు, కెరటాలు గర్జించేలా, సముద్రాన్ని కదిలించేవాడు ఆయనే, ఆయన పేరు సైన్యాల యెహోవా: