Steadfastness గురించి బైబిల్ వచనాలు: Even under affliction
Even under affliction గురించి వచనాలు
ఇదంతా మా మీదికి వచ్చిపడినా, మేము మిమ్మల్ని మరవలేదు; మీ నిబంధన విషయం నమ్మకద్రోహులం కాలేదు.
మా హృదయం వెనుదీయలేదు; మా పాదాలు మీ మార్గం నుండి తొలగిపోలేదు.
నక్కలు తిరిగే చోట మీరు మమ్మల్ని నలగ్గొట్టి పడేశారు; చావు నీడ మమ్మల్ని ఆవరించి ఉన్నది.
క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరు చేయగలవారు ఎవరు? ఇబ్బందులు గాని, కష్టాలు గాని, కరువు గాని, వస్త్రహీనత గాని, ఆపద గాని, ఖడ్గం గాని మనల్ని వేరు చేయగలదా?
లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉన్నది: “రోజంతా మీ కోసమే మరణ బాధ పడుతున్నాం; వధించ దగిన గొర్రెలమని మమ్మల్ని ఎంచుతున్నారు.”
అయినా మనల్ని ప్రేమించినవాని ద్వారా మనం అన్ని విషయాల్లో జయించినవారి కన్నా అధికంగా ఉన్నాము.
ఎందుకంటే, అప్పుడు మీలో ఎవరు ఏ శ్రమల వలన కలవరం చెందకుండా ఉండాలని. అయినా మనం శ్రమలను ఎదుర్కోవలసి ఉందని మీకు బాగా తెలుసు.