Steadfastness గురించి బైబిల్ వచనాలు: Want of-Illustrated
Want of-Illustrated గురించి వచనాలు
మరికొన్ని రాతి నేలలో పడ్డాయి, అవి మొలిచినప్పుడు, వాటికి తడి లేదు కాబట్టి మొక్కలు ఎండిపోయాయి.
రాతి నేలలో పడిన విత్తనాలు అంటే, వారు వాక్యాన్ని విన్నప్పుడు దానిని సంతోషంతో అంగీకరిస్తారు, కానీ వారిలో వేరు ఉండదు. వారు కొంతకాలమే నమ్ముతారు, శోధన సమయంలో త్వరగా పడిపోతారు.
మీరు నాలో ఉండకపోతే, బయట పారవేయబడిన కొమ్మలా ఎండిపోతారు; అలాంటి కొమ్మలను పోగు చేసి అగ్నిలో వేసి కాల్చివేస్తారు.
వీరు నీళ్లు లేని ఊటల వంటివారు. తుఫాను తీవ్రతకు కొట్టుకొని పోవు మేఘాల వంటివారు. కటిక చీకటి వారి కోసం సిద్ధపరచబడింది.
వీరు మీ ప్రేమ విందుల్లో, వినోదాలలో సిగ్గువిడిచి తింటూ, త్రాగుతూ మాయని మచ్చలుగా ఉన్నారు, వారు కేవలం తమను తాము పోషించుకునే కాపరుల్లా ఉన్నారు. వారు గాలికి కొట్టుకుపోయే, వాన కురవని మబ్బుల వంటివారు. ఆకురాలు కాలంలో, ఫలాలులేకుండా పెల్లగింపబడి రెండు సార్లు చనిపోయిన చెట్లవంటివారు.