Skip to content

Stars గురించి బైబిల్ వచనాలు

37 వచనాలు · 12 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అందుకు దేవుడు వారి నుండి దూరమై సూర్య, చంద్ర నక్షత్రాలను పూజించడానికి వారిని విడిచిపెట్టాడు. దీనిని గురించి ప్రవక్తల గ్రంథాల్లో: “ ‘ఇశ్రాయేలు ప్రజలారా, అరణ్యంలో నలభై సంవత్సరాలు మీరు నాకు బలులు అర్పణలు తెచ్చారా?

  2. మీరు తయారుచేసుకున్న విగ్రహాలను పూజించారు మొలొకును దైవమని దాని గుడారాన్ని ఊరేగించారు, రెఫాను అనే మీ దేవుని నక్షత్రాన్ని పూజించారు. అందుకే నేను మిమ్మల్ని బబులోను అవతలికి బందీలుగా పంపిస్తాను’ అని వ్రాయబడి ఉంది.

  3. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. ఒక నక్షత్రానికి మరొక నక్షత్రానికి మహిమలో భేదం ఉంటుంది.

  4. వారు తమ సిగ్గును నురుగులా కనబడేలా చేసే సముద్రపు భయంకరమైన అలల వంటివారు. వారు నిలకడలేని నక్షత్రాల వంటివారు. వారి కోసం కటిక చీకటి నిరంతరం భద్రం చేయబడి ఉంది.

  5. నేను వారికి వేకువ చుక్కను కూడా ఇస్తాను.

  6. బలమైన గాలికి అంజూర చెట్టు నుండి రాలిపడిన కాయల్లా ఆకాశం నుండి నక్షత్రాలు భూమి మీద రాలాయి.

  7. మూడవ దూత తన బూరను ఊదినప్పుడు దివిటీలా ప్రకాశిస్తున్న ఒక గొప్ప నక్షత్రం ఆకాశం నుండి రాలి నదుల మూడవ భాగం మీద, నీటి ఊటలలో పడింది.

  8. ఆ నక్షత్రం పేరు “చేదు” అది పడినప్పుడు నీటిలో మూడవ భాగం చేదుగా మారింది. ఆ చేదు నీటి వల్ల చాలామంది చనిపోయారు.

  9. నాలుగవ దూత తన బూరను ఊదినప్పుడు సూర్యుని మూడవ భాగం, చంద్రుని మూడవ భాగం, నక్షత్రాల మూడవ భాగం దెబ్బతిన్నాయి. కాబట్టి అవన్నీ మూడవ భాగం వెలుగును కోల్పోయాయి. పగటి వెలుగులో మూడవ భాగం ప్రకాశం ఇవ్వలేదు అలాగే రాత్రి మూడవ భాగం వెలుగు లేకుండా పోయింది.

  10. అయిదవ దూత తన బూరను ఊదినప్పుడు ఆకాశం నుండి రాలి భూమి మీద పడిన ఒక నక్షత్రాన్ని నేను చూశాను. అగాధానికి వెళ్లే గొయ్యి తాళపుచెవులు ఆ నక్షత్రానికి ఇవ్వబడ్డాయి.

  11. దాని తోక ఆకాశంలో ఉన్న నక్షత్రాలలో మూడవ భాగాన్ని ఈడ్చి భూమి మీదికి విసిరివేసింది. బిడ్డకు జన్మ ఇవ్వబోతున్న స్త్రీ బిడ్డకు జన్మ ఇవ్వగానే ఆ బిడ్డను మ్రింగివేయాలని ఆ ఘటసర్పం ఆ స్త్రీ ముందు నిలబడింది.

  12. “యేసు అనే నేను సంఘాల కోసమైన ఈ సాక్ష్యం మీకు ఇవ్వమని నా దూతను పంపాను. నేను దావీదు వేరును సంతానాన్ని, ప్రకాశవంతమైన వేకువ చుక్కను.”