కంటెంట్‌కు వెళ్లండి

Soldiers గురించి బైబిల్ వచనాలు

65 వచనాలు · 13 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అధికారులు సైనికులతో చెప్పవలసిన మాటలు: “మీలో ఎవరైనా క్రొత్తగా ఇల్లు కట్టుకుని ఇంకా గృహప్రవేశం చేయనట్లైతే, వెంటనే ఇంటికి వెళ్లిపోవాలి, లేకపోతే ఒకవేళ అతడు యుద్ధంలో చనిపోతే మరొకరు ఆ ఇంట్లో నివసిస్తారు.

  2. ఎవడైనా ద్రాక్షతోట వేసి దాని ఫలసాయం అనుభవించకుండా ఉన్నాడా? అలాగైతే అతడు ఇంటికి తిరిగి వెళ్లవచ్చు, లేదా అతడు యుద్ధంలో చనిపోతే అతని తోట ఫలసాయం మరొకరు అనుభవిస్తారు.

  3. ప్రధానం చేసుకుని ఇంకా పెండ్లి చేసుకోకుండా ఉన్నవాడు మీలో ఉంటే అతడు ఇంటికి వెళ్లిపోవచ్చు, అతడు ఒకవేళ యుద్ధంలో చనిపోతే మరొకడు ఆమెను పెళ్ళి చేసుకోవచ్చు.”

  4. అధిపతులు చేయవలసిన హెచ్చరికలు, “ఎవనికైనా భయాందోళనలున్నాయా? అలాగైతే ఇంటికి వెళ్లిపోవచ్చు, లేకపోతే ఆ పిరికితనం మిగతా సైనికులకు కూడా వ్యాపిస్తుంది.”

  5. అధిపతులు ప్రజలకు ఈ సందేశమిచ్చిన తర్వాత సేనాధిపతులు తమ బాధ్యతలను స్వీకరిస్తారు.

  6. ఒక వ్యక్తి క్రొత్తగా పెళ్ళి చేసుకున్నట్లయితే, అతన్ని యుద్ధానికి పంపకూడదు, ఏ ఇతర భారాన్ని మోపకూడదు. ఒక సంవత్సరం పాటు అతడు స్వేచ్ఛగా ఇంట్లో ఉండి పెళ్ళి చేసుకున్న భార్యను సంతోషపెట్టాలి.

  7. కాబట్టి నీవు, ‘ఎవరు భయంతో వణకుతున్నారో, వారు వెంటనే గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్లవచ్చు అని ప్రకటించు’ ” అని చెప్పారు. అప్పుడు ఇరవైరెండువేలమంది తిరిగి వెళ్లిపోగా పదివేలమంది మిగిలారు.

  8. ఆహారం తీసుకురావడానికి ఇశ్రాయేలు గోత్రాలన్నిటి నుండి వందమందికి పదిమందిని, వెయ్యిమందికి వందమందిని, పదివేలమందికి వెయ్యిమందిని ఎన్నుకుందాము. అప్పుడు సైన్యం బెన్యామీనులోని గెబాకు చేరుకుంటారు, ఇశ్రాయేలులో వారు చేసిన అవమానకరమైన పనిని బట్టి వారిని శిక్షిస్తారు” అని అన్నారు.

  9. సైనికుల డాళ్లు ఎర్రగా ఉన్నాయి; యోధులు ఎరుపు దుస్తులు ధరించారు. వారు సిద్ధపడిన రోజున రథాలపై ఉన్న లోహం మెరుస్తుంది; సరళవృక్షంతో చేసిన ఈటెలు ఆడుతున్నాయి.

  10. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధిపతి భవనం లోనికి తీసుకెళ్లి, సైనికులందరిని యేసు చుట్టూ సమకూర్చారు.

  11. వారు ఆయన బట్టలను తీసివేసి ఆయనకు ఎర్రని అంగీని తొడిగించారు.

  12. ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తలమీద పెట్టారు. ఒక కర్ర తన కుడిచేతిలో ఉంచారు. అప్పుడు ఆయన ఎదుట మోకరించి, “యూదుల రాజా, నీకు శుభం!” అని అంటూ ఆయనను ఎగతాళి చేశారు.

  13. వారు ఆయన మీద ఉమ్మివేసి, కర్ర తీసుకుని దానితో ఆయనను తలమీద పదే పదే కొట్టారు.

  14. వారు ఆయనను ఎగతాళి చేసిన తర్వాత, ఆయన మీదున్న అంగీని తీసివేసి ఆయన వస్త్రాలను ఆయనకే తొడిగించారు. ఆ తర్వాత ఆయనను సిలువ వేయడానికి తీసుకెళ్లారు.

  15. వారు వెళ్తుండగా, కురేనీయ పట్టణానికి చెందిన, సీమోను అనే ఒకడు కనిపించగానే, వారు అతన్ని సిలువ మోయడానికి బలవంతం చేశారు.

  16. వారు గొల్గొతా అనే స్థలానికి తీసుకుని వచ్చారు. గొల్గొతా అంటే “కపాల స్థలం” అని అర్థము.

  17. అక్కడ వారు చేదు కలిపిన, ద్రాక్షరసాన్ని ఆయనకు ఇచ్చారు; గాని ఆయన దాని రుచి చూసి, త్రాగడానికి ఒప్పుకోలేదు.

  18. వారు ఆయనను సిలువ వేసిన తర్వాత, చీట్లు వేసి ఆయన వస్త్రాలను పంచుకున్నారు.

  19. వారు అక్కడే కూర్చుని, ఆయనకు కాపలాగా ఉన్నారు.

  20. ఆయన మీద మోపబడిన నేరం వ్రాసి ఆయన తలపైన బిగించారు: ఇతడు యేసు, యూదుల రాజు.

  21. అందుకు పిలాతు, “కావలివారిని తీసుకోండి, మీరు వెళ్లి, మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేసుకోండి” అని వారితో చెప్పాడు.

  22. ఆ స్త్రీలు మార్గంలో ఉండగానే, సమాధి దగ్గర ఉన్న కావలివారిలో కొంతమంది పట్టణంలోనికి వెళ్లి, జరిగిన విషయాలన్నిటిని ముఖ్య యాజకులతో చెప్పారు.

  23. ముఖ్య యాజకులు యూదా పెద్దలతో కలసి ఆలోచించి, ఆ సైనికులకు చాలా డబ్బు లంచంగా ఇచ్చి,

  24. “మేము నిద్రపోతున్నప్పుడు, ‘రాత్రి సమయంలో యేసు శిష్యులు వచ్చి ఆయనను ఎత్తుకుపోయారు’ అని చెప్పండి.

  25. ఒకవేళ ఇది అధిపతికి తెలిసినా, మేము అతనికి చెప్పి మీకు ఏ ప్రమాదం కలుగకుండా చూస్తాము” అని వారికి మాట ఇచ్చారు.