Skip to content

Sanitation గురించి బైబిల్ వచనాలు

289 వచనాలు · 10 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పండి: ‘భూమి మీద జీవించే జంతువులన్నిటిలో మీరు తినదగిన జంతువులు:

  2. చీలిన డెక్కలు కలిగి నెమరువేసే ఏ జంతువునైనా మీరు తినవచ్చు.

  3. “ ‘కొన్ని కేవలం నెమరువేస్తాయి కొన్ని చీలిన డెక్కలు మాత్రమే కలిగి ఉంటాయి, వాటిని మీరు తినకూడదు. ఒంటెలు నెమరువేస్తాయి కానీ వాటికి చీలిన డెక్కలు లేవు; ఇవి మీకు ఆచారరీత్య అపవిత్రమైనవి.

  4. అలాగే పొట్టి కుందేలు కూడా నెమరువేస్తుంది కాని దానికి చీలిన డెక్కలు లేవు; ఇది మీకు అపవిత్రమైనది.

  5. అలాగే కుందేలు నెమరువేస్తుంది గాని దానికి చీలిన డెక్కలు లేవు; ఇది మీకు అపవిత్రమైనది.

  6. పందికి చీలిన డెక్కలు ఉంటాయి కాని అది నెమరువేయదు; ఇది మీకు అపవిత్రమైనది.

  7. వాటి మాంసం తినవద్దు వాటి కళేబరాలు ముట్టుకోవద్దు; అవి మీకు అపవిత్రమైనవి.

  8. “ ‘సముద్రాల్లో నదులలో నివసించే జీవులన్నిటిలో రెక్కలు పొలుసులు గలవాటిని మీరు తినవచ్చు.

  9. సముద్రంలో గాని, నదిలో గాని నీటిలో కదిలే అన్ని రకాల జీవుల్లోను, నీటి ప్రాణుల్లోను రెక్కలు, పొలుసులు లేనివాటిని మీరు అపవిత్రమైనవిగా చూడాలి.

  10. అవి అపవిత్రమైనవి కాబట్టి వాటి మాంసం మీరు తినకూడదు; వాటి కళేబరాలను మీరు అసహ్యించుకోవాలి.

  11. రెక్కలు, పొలుసులు లేని జలచరాలేవైనా అపవిత్రమైనవిగా చూడాలి.

  12. “ ‘మీకు అపవిత్రమైనవిగా భావించి మీరు తినకూడని పక్షులు ఇవే: గ్రద్ద, రాబందు, నల్ల రాబందు,

  13. ఎర్ర గ్రద్ద, ప్రతి రకమైన నల్ల గ్రద్ద,

  14. ప్రతి రకమైన కాకి,

  15. కొమ్ముల గుడ్లగూబ, జీరగపిట్ట, కోకిల, ప్రతి రకమైన డేగ,

  16. పైడికంటే, చెరువు కాకి, గుడ్లగూబ,

  17. హంస, గూడబాతు, నల్లబోరువ,

  18. సంకు బుడ్డి కొంగ, ప్రతి రకమైన కొంగ, కూకుడు గువ్వ, గబ్బిలము.

  19. “ ‘నాలుగు కాళ్లతో నడిచే ఎగిరే పురుగులన్నీ మీకు అపవిత్రమైనవిగా మీరు భావించాలి.

  20. అయితే, నాలుగు కాళ్లతో నడుస్తూ నేలమీద గెంతడానికి కాళ్లకు కీళ్ళున్న ఎగిరే కీటకాలను మీరు తినవచ్చు.

  21. వీటిలో నేత మిడత గాని చిన్న మిడత గాని ఆకు మిడత గాని ప్రతి రకమైన మిడతను తినవచ్చు.

  22. కాని నాలుగు కాళ్లు ఉండి ఎగిరే ఇతర పురుగులన్నీ మీకు అపవిత్రమైనవి.

  23. “ ‘వీటి ద్వార మీరు అపవిత్రులవుతారు; వాటి కళేబరాలను ఎవరైనా తాకితే వారు సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటారు.

  24. వీటి కళేబరాలలో దేనినైన ఎవరైనా మోస్తే వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, సాయంత్రం వరకు వారు అపవిత్రంగా ఉంటారు.

  25. “ ‘చీలిన డెక్కలు లేని నెమరువేయని ప్రతి జంతువు మీకు అపవిత్రం; వాటిలో దేని కళేబరాన్నైనా ఎవరైనా తాకితే వారు అపవిత్రులవుతారు.