Skip to content

Prisons గురించి బైబిల్ వచనాలు

63 వచనాలు · 44 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యిర్మీయా సొరంగంలో ఉన్న ఒక చెరసాలలో చాలా రోజులు ఉండిపోయాడు.

  2. అయితే నా ప్రభువా, రాజా, దయచేసి వినండి. నా విన్నపాన్ని మీ ముందుకు తేనివ్వండి: నన్ను కార్యదర్శియైన యోనాతాను ఇంటికి తిరిగి పంపవద్దు, నేను అక్కడే చనిపోతాను.”

  3. రాజైన సిద్కియా యిర్మీయాను కావలివారి ప్రాంగణంలో ఉంచి, పట్టణంలోని రొట్టెలన్నీ పూర్తిగా అయిపోయే వరకు ప్రతిరోజు రొట్టెలు చేసేవారి వీధి నుండి ఒక రొట్టె ఇవ్వమని ఆజ్ఞాపించాడు. కాబట్టి యిర్మీయా కావలివారి ప్రాంగణంలో ఉండిపోయాడు.

  4. కాబట్టి వారు యిర్మీయాను తీసుకెళ్లి, చెరసాల ప్రాంగణంలో ఉన్న రాజు కుమారుడైన మల్కీయా నీటి గోతిలోకి దింపినప్పుడు దాంట్లో వారు యిర్మీయాను త్రాళ్లతో నీటి గోతిలోకి దించారు; దాంట్లో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉంది, యిర్మీయా ఆ బురదలో మునిగిపోయాడు.

  5. అక్కడ బబులోను రాజు రిబ్లాలో సిద్కియా కుమారులను, అలాగే యూదా పెద్దలందరినీ అతని కళ్లముందే చంపేశాడు.

  6. అప్పుడు అతడు సిద్కియా రాజు కళ్లు ఊడదీసి, ఇత్తడి సంకెళ్ళతో బంధించి, అతన్ని బబులోనుకు తీసుకెళ్లాడు. అతడు చనిపోయే వరకు అక్కడే చెరసాలలో ఉంచాడు.

  7. దానికి గాలం తగిలించి బోనులో పెట్టి బబులోను రాజు దగ్గరకు దానిని తీసుకెళ్లారు. ఇశ్రాయేలీయుల పర్వతాలమీద దాని గర్జన ఎన్నటికీ వినబడకుండా వారు దానిని చెరసాలలో ఉంచారు.

  8. నేను మీతో చేసిన నిబంధన రక్తాన్ని బట్టి బందీలుగా ఉన్న మీ వారిని నీరులేని గోతిలో నుండి విడిపిస్తాను.

  9. “మీలో ఎవరైనా మీ విరోధితో నీకున్న వివాదం విషయంలో మీరిద్దరు న్యాయస్థానానికి వెళ్తున్నట్లయితే ఇంకా దారిలో ఉండగానే సమాధానపడడం మంచిది. లేకపోతే మీ విరోధి మిమ్మల్ని న్యాయాధిపతికి అప్పగించవచ్చు, ఆ న్యాయాధిపతి మిమ్మల్ని అధికారికి అప్పగించి చెరసాలలో వేయించవచ్చు.

  10. అప్పుడు జరిగేదేంటంటే చివరి పైసా చెల్లించే వరకు మీరు బయట పడలేరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.

  11. క్రీస్తు చేస్తున్న క్రియలను గురించి చెరసాలలో ఉన్న యోహాను విని, ఆయన దగ్గరకు తన శిష్యులను పంపించి,

  12. అలా తన రక్షకభటులను పంపి చెరసాలలో యోహాను తలను నరికించాడు.

  13. “అయితే అతడు దానికి ఒప్పుకోలేదు. బదులుగా, వాడు బాకీ తీర్చేవరకు వానిని జైలులో వేయించాడు.

  14. నాకు బట్టలు లేనప్పుడు మీరు నాకు బట్టలు ఇచ్చారు. నేను రోగిగా ఉన్నప్పుడు మీరు నన్ను చూసుకున్నారు. నేను చెరసాలలో ఉన్నప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి నన్ను పరామర్శించారు” అని చెప్తాడు.

  15. ఎందుకంటే, హేరోదు తన సోదరుడైన ఫిలిప్పు భార్య హేరోదియను పెళ్ళి చేసుకున్నప్పుడు, “నీ సహోదరుని భార్యను నీవు ఉంచుకోవడం న్యాయం కాదు” అని యోహాను హేరోదుతో అంటూ ఉండేవాడు.

  16. కానీ పేతురు, “ప్రభువా, నీతో కూడ చెరలోనికే కాదు చావటానికైనా నేను సిద్ధమే” అన్నాడు.

  17. ఈ బరబ్బ పట్టణంలో జరిగిన ఒక తిరుగుబాటు చేసినందుకు హత్య చేసినందుకు చెరసాలలో పెట్టబడ్డాడు.

  18. వారు పేతురు యోహానులను పట్టుకుని, సాయంకాలం కావడంతో, మరుసటిరోజు వరకు వారిని చెరసాలలో బంధించారు.

  19. కాబట్టి వారు అపొస్తలులను పట్టుకుని పట్టణపు చెరసాలలో వేయించారు.

  20. అయితే సౌలు ఇంటింటికి వెళ్లి, పురుషులను స్త్రీలను బయటకు ఈడ్చుకెళ్లి వారిని చెరసాలలో వేయిస్తూ, సంఘాన్ని నాశనం చేయడం మొదలుపెట్టాడు.

  21. హేరోదు పేతురును పట్టుకుని చెరసాలలో వేయించి, నలుగురేసి సైనికులుండే నాలుగు సైనిక దళాలను అతనికి కాపలాగా నియమించాడు. పస్కా పండుగ తర్వాత ప్రజల ముందు అతన్ని విచారణకు తీసుకురావాలని హేరోదు భావించాడు.

  22. కాబట్టి పేతురును చెరసాలలో పెట్టారు. కానీ సంఘం అతని కోసం దేవునికి ఎంతో ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు.

  23. హేరోదు అతన్ని విచారణకు తీసుకురావడానికి ముందు రాత్రి, పేతురు రెండు గొలుసులతో బంధించబడి, ఇద్దరు సైనికుల మధ్య నిద్రిస్తున్నాడు. అలాగే కావలివారు చెరసాల తలుపు ముందు కాపలా కాస్తున్నారు.

  24. హేరోదు పేతురు కోసం ఎంత వెదకినా కనబడలేదు, కాబట్టి అతడు కావలివారిని విచారించి, వారిని చంపమని ఆదేశించాడు. ఆ తర్వాత హేరోదు యూదయ ప్రాంతం నుండి కైసరయ పట్టణానికి వెళ్లి అక్కడ నివసించాడు.

  25. వారిని తీవ్రంగా దెబ్బలు కొట్టి, చెరసాలలో పడవేసి, భద్రంగా కాపలా కాయమని చెరసాల అధికారికి ఆజ్ఞాపించారు.