Preciousness of Christ గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
మీరు మనుష్యుల్లో అత్యంత అద్భుతమైనవారు మీ పెదవులపై దయ నిండి ఉంది, దేవుడు మిమ్మల్ని నిత్యం ఆశీర్వదిస్తారు.
మీ పరిమళ ద్రవ్యాల సువాసన హృదయానికి ఆనందాన్నిస్తుంది; మీ పేరు పోయబడిన పరిమళం లాంటిది. కాబట్టి యువతులు నిన్ను ప్రేమిస్తున్నారంటే ఆశ్చర్యం లేదు!
అడవి చెట్ల మధ్య ఆపిల్ వృక్షంలా నా ప్రియుడు యువకుల మధ్య ఉన్నాడు, ఆయన నీడలో ఆనందమయినై కూర్చుండిపోయాను, ఆయన ఫలం నా రుచికి మధురము.
నా ప్రియుడు ప్రకాశమానమైన వాడు ఎర్రని వాడు, పదివేలమంది కన్న గొప్పవాడు.
ఆయన తల మేలిమి బంగారం; ఆయనది ఉంగరాల జుట్టు, కాకి నలుపంత నల్లగా ఉన్నాయి.
ఆయన నేత్రాలు నదీ తీరాన ఎగిరే గువ్వల్లాంటివి, అవి పాలలో స్నానమాడినట్లున్నాయి, ఆభరణాల్లా చెక్కబడ్డాయి.
ఆయన చెక్కిళ్ళు సువాసన ఇచ్చే పరిమళ పడకల్లాంటివి, ఆయన పెదవులు తామరలాంటివి వాటిలో నుండి బోళం స్రవిస్తుంది.
ఆయన చేతులు గోమేధికం పొదిగిన బంగారు కడ్డీలు, ఆయన ఉదరం నీలమణి, వైడూర్యం పొదిగిన దంత కళాఖండము.
ఆయన కాళ్లు మేలిమి బంగారు దిమ్మల మీద నిలిపిన పాలరాతి స్తంభాలు. ఆయన రూపం లెబానోనులా, దాని దేవదారు వృక్షాలలా ఉంది.
ఆయన నోరు అతిమధురం; ఆయన మనోహరము. యెరూషలేము కుమార్తెలారా! ఈయనే నా ప్రియుడు, నా స్నేహితుడు.
కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “చూడండి, నేను సీయోనులో ఒక రాయిని, పరీక్షించబడిన రాయిని వేశాను, అది స్థిరమైన పునాదికి అమూల్యమైన మూలరాయి; దానిపై నమ్మకముంచేవారు ఎప్పుడూ భయాందోళనలకు గురికారు.
గొర్రెల కాపరిలా ఆయన తన మందను మేపుతారు; తన చేతితో గొర్రెపిల్లలను చేర్చుకుని తన హృదయానికి ఆనించి వాటిని మోస్తారు; పాలిచ్చే గొర్రెలను ఆయన నెమ్మదిగా నడిపిస్తారు.
ధాన్యంతో యువకులు క్రొత్త ద్రాక్షరసంతో యువతులు వర్ధిల్లుతారు. వారు ఎంతో ఆకర్షణీయంగా అందంగా ఉంటారు!
పరలోకం నుండి ఒక స్వరం ఇలా చెప్పడం వినపడింది: “ఈయన నా ప్రియ కుమారుడు; ఈయనయందు నేను ఎంతో ఆనందిస్తున్నాను.”
పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధనం వంటిది. ఒకడు దానిని కనుగొనగానే దానిని మరల దాచిపెట్టి, సంతోషంతో వెళ్లి తనకు ఉన్నదంతా అమ్మివేసి ఆ పొలాన్ని కొన్నాడు.
ఇంకా, పరలోక రాజ్యం అమూల్యమైన ముత్యాల కోసం వెదకే ఒక వ్యాపారిని పోలి ఉంది.
వానికి చాలా విలువైన ఒక ముత్యం కనబడగానే అతడు వెళ్లి తన దగ్గర ఉన్నదంతా అమ్మివేసి ఆ ముత్యాన్ని కొంటాడు.
ఆ వాక్యం శరీరాన్ని ధరించుకొని మన మధ్య నివసించింది. మనం ఆయన మహిమను చూశాం, కృపాసత్య సంపూర్ణుడై, తండ్రి దగ్గర నుండి వచ్చిన, ఏకైక కుమారుని మహిమను చూశాము.
అందుకు సీమోను పేతురు ఆయనతో, “ప్రభువా, మేము ఎవరి దగ్గరకు వెళ్లాలి? నిత్యజీవపు మాటలను నీ దగ్గరే ఉన్నాయి.
పరిశుద్ధులలో నేను అత్యంత అల్పున్ని కానీ లెక్కించలేని ఆశీర్వాదాలు క్రీస్తు యేసులో ఉన్నాయని యూదేతరులకు ప్రకటించడానికి దేవుడు తన దయతో నన్ను ఏర్పరచుకున్నారు.
నిశ్చయంగా నా ప్రభువైన క్రీస్తు యేసును తెలుసుకోవడం విలువైనది కాబట్టి నేను ప్రతిదీ నష్టంగా భావిస్తున్నాను. నేను క్రీస్తును సంపాదించుకోడానికి సమస్తాన్ని వ్యర్థంగా భావిస్తున్నాను.
ఆయనలో దేవుని సంపూర్ణత నివసించాలని తండ్రి యొక్క దేవుని ఉద్దేశం.
కాబట్టి ఆయన దేవదూతల కంటే ఉన్నతమైన నామాన్ని వారసత్వంగా పొందినట్లే ఆయన దేవదూతల కంటే ఉన్నతమైన స్థానాన్ని పొందారు.
క్రొత్త నిబంధనకు మధ్యవర్తియైన యేసు దగ్గరకు, హేబెలు రక్తంకంటే ఉత్తమంగా మాట్లాడే చిందించబడిన రక్తం దగ్గరకు మీరు వచ్చారు.
అయితే నిష్కళంకమైన లోపం లేని గొర్రెపిల్ల వంటి క్రీస్తు అమూల్యమైన రక్తం చేత మీరు విమోచించబడ్డారు.