Polygamy గురించి బైబిల్ వచనాలు: Forbidden
Forbidden గురించి వచనాలు
“ ‘నీ భార్య బ్రతికి ఉండగా నీ భార్యను బాధపెట్టడానికి ఆమె సోదరిని భార్యగా చేసుకుని ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు.
అతడు చాలామంది భార్యలను చేసుకోకూడదు, లేదా అతని హృదయం దారి తప్పుతుంది. అతడు పెద్ద మొత్తంలో వెండి, బంగారాన్ని కూడబెట్టుకోకూడదు.
“ఎందుకు?” అని మీరడుగుతారు. ఎందుకంటే నీకు నీ యవ్వనకాలంలో నీవు పెండ్లాడిన భార్యకు మధ్య యెహోవా సాక్షిగా ఉన్నారు. ఆమె నీ భాగస్వామి, నీ చేసిన వివాహ నిబంధన వలన నీ భార్య అయినప్పటికీ నీవు ఆమెకు ద్రోహం చేశావు.
ఆయన మీ ఇద్దరిని ఒకటి చేయలేదా? శరీరం, ఆత్మ రెండూ ఆయనకే చెందుతాయి గదా! అలా ఒకటిగా చేయడం ఎందుకు? దేవుని మూలంగా వారికి సంతానం కలగాలని కదా! అందుచేత మీ హృదయాన్ని మీరు కాపాడుకోండి, యవ్వనంలో పెండ్లాడిన మీ భార్యకు ద్రోహం చేయకండి.
అందుకు యేసు, “ఆదిలో సృష్టికర్త వారిని ‘పురుషునిగాను స్త్రీగాను సృజించారు’ అని మీరు చదువలేదా?
‘ఈ కారణంచేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు. అలా వారిద్దరు ఏకశరీరం అవుతారు.’
కొందరు పరిసయ్యులు ఆయనను పరీక్షించడానికి ఆయన దగ్గరకు వచ్చి, “ఒక పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వడం చట్టప్రకారం న్యాయమేనా?” అని అడిగారు.
అందుకు యేసు, “మోషే మీకు ఏమి ఆజ్ఞాపించాడు?” అని అడిగారు.
వారు, “విడాకుల ధృవీకరణ పత్రం వ్రాసి ఆమెను పంపించడానికి మోషే పురుషునికి అనుమతించాడు” అన్నారు.
అందుకు యేసు, “మీ హృదయ కాఠిన్యాన్ని బట్టే మోషే ఈ ఆజ్ఞను మీ కోసం వ్రాశాడు.
సృష్టి ఆరంభం నుండే దేవుడు వారిని ‘పురుషునిగాను స్త్రీగాను’ సృజించారు.
‘ఈ కారణంచేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు,
అలా వారిద్దరు ఏకశరీరం అవుతారు.’ కాబట్టి వారు ఇక ఇద్దరు కారు, కాని ఒక శరీరమే అవుతారు.
సంఘపెద్ద నిందలేనివానిగా, ఒకే భార్యకు నమ్మకమైన భర్తగా, కోరికలను అదుపులో ఉంచుకునేవానిగా, స్వీయ నియంత్రణ గలవానిగా, మర్యాదస్థునిగా, ఆతిథ్య ప్రియునిగా, సత్యాన్ని బోధించగల సామర్థ్యం గలవానిగా ఉండాలి.
సంఘ పరిచారకుడు తన భార్యకు నమ్మకంగా ఉంటూ, తన పిల్లలను, కుటుంబాన్ని సరిగా నడిపించేవాడై ఉండాలి.
ఒక సంఘపెద్ద నిందారహితునిగా, తన భార్యకు నమ్మకమైనవానిగా ఉండాలి, అతని పిల్లలు విశ్వాసం కలవారిగా ఉండి, దుష్టమైన పనులు చేశారని అవిధేయులు అనే నిందలేనివారిగా ఉండాలి.