Skip to content

Pharaoh గురించి బైబిల్ వచనాలు

35 వచనాలు · 6 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఇదంతా జరిగిన తర్వాత, యోషీయా మందిరాన్ని చక్కబెట్టిన తర్వాత ఈజిప్టు రాజైన నెకో యూఫ్రటీసు నది ఒడ్డున ఉన్న కర్కెమీషు మీదికి యుద్ధానికి వెళ్తుండగా యోషీయా అతని మీదికి బయలుదేరాడు.

  2. కానీ నెకో అతని దగ్గరకు దూతలను పంపి, “యూదా రాజా, నీకు నాకూ మధ్య ఎలాంటి గొడవ ఉంది? ఈ సమయంలో నేను దాడి చేస్తున్నది మీపై కాదు, నేను యుద్ధం చేస్తున్న ఇంటిపై. దేవుడు నాకు త్వర పడమని చెప్పాడు; కాబట్టి నాతో ఉన్న దేవున్ని ఎదిరించడం మానేయండి, లేదంటే ఆయనే నిన్ను నాశనం చేస్తాడు” అని చెప్పాడు.

  3. అయితే యోషీయా అతని దగ్గర నుండి వెళ్లడానికి ఇష్టపడలేదు. అతనితో యుద్ధం చేయాలని మారువేషం వేసుకుని దేవుని ఆజ్ఞగా నెకో చెప్పిన దానిని వినక, మెగిద్దోను మైదానాల్లో యుద్ధం చేయడానికి వెళ్లాడు.

  4. విలుకాండ్రు రాజైన యోషీయా మీద బాణాలు వేశారు. రాజు తన అధికారులతో, “నేను తీవ్రంగా గాయపడ్డాను. ఇక్కడినుండి నన్ను తీసుకెళ్లండి” అని చెప్పాడు.

  5. అతని సేవకులు అతన్ని తన రథం మీద నుండి దించి అతనికున్న వేరే రథం మీద ఉంచి యెరూషలేముకు తీసుకువచ్చారు. అక్కడ అతడు చనిపోయాడు. అతని పూర్వికుల సమాధుల మధ్య యోషీయాను పాతిపెట్టారు. అతని మృతికి యూదా, యెరూషలేము ప్రజలంతా దుఃఖించారు.

  6. తర్వాత ఈజిప్టు రాజు యెరూషలేములో అతన్ని పదవి నుండి తొలగించి, యూదాపై వంద తలాంతుల వెండిని, ఒక తలాంతు బంగారాన్ని పన్నుగా విధించాడు.

  7. ఈజిప్టు రాజు యెహోయాహాజు సోదరుడైన ఎల్యాకీమును యూదా యెరూషలేము మీద రాజుగా చేసి, అతని పేరును యెహోయాకీముగా మార్చాడు. అయితే నెకో ఎల్యాకీము సోదరుడైన యెహోయాహాజును ఈజిప్టుకు తీసుకెళ్లాడు.

  8. ఆయన ఎవరినీ వారికి హాని చేయనివ్వలేదు; వారి కోసం ఆయన రాజులను మందలించారు:

  9. ఈజిప్టును గురించి: యూదా రాజైన యోషీయా కుమారుడు యెహోయాకీము పరిపాలనలోని నాల్గవ సంవత్సరంలో బబులోను రాజైన నెబుకద్నెజరు చేతిలో యూఫ్రటీసు నది దగ్గర కర్కెమీషులో ఓడిపోయిన ఈజిప్టు రాజైన ఫరో నెకో సైన్యానికి వ్యతిరేకంగా వచ్చిన సందేశం ఇది:

  10. ఫరో ఇంకా గాజా మీద దాడిచేయక ముందు ఫిలిష్తీయుల గురించి యిర్మీయా ప్రవక్తకు వచ్చిన యెహోవా వాక్కు: