Skip to content

Moon గురించి బైబిల్ వచనాలు

44 వచనాలు · 12 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహోవా ఇలా చెప్తున్నారు, పగలు ప్రకాశించడానికి సూర్యుని నియమించినవాడు, రాత్రి ప్రకాశించడానికి, చంద్రుని, నక్షత్రాలను శాసించేవాడు, కెరటాలు గర్జించేలా, సముద్రాన్ని కదిలించేవాడు ఆయనే, ఆయన పేరు సైన్యాల యెహోవా:

  2. ఖచ్చితంగా మాకు ఇష్టం వచ్చినట్లే మేము చేస్తాము: మేము, మా పూర్వికులు, మా రాజులు మా అధికారులు యూదా పట్టణాల్లో, యెరూషలేము వీధుల్లో చేసినట్లుగా మేము కూడా ఆకాశ రాణికి ధూపం వేస్తాము ఆమెకు పానార్పణలు అర్పిస్తాము. ఆ సమయంలో మాకు పుష్కలంగా ఆహారం ఉండింది, మేము బాగున్నాం, ఎలాంటి హాని జరగలేదు.

  3. ఆకాశ రాణికి ధూపం వేయడం ఆమెకు పానార్పణలు అర్పించడం మానివేసినప్పటి నుండి మా దగ్గర ఏమి లేకుండా పోయింది, మేము ఖడ్గం చేత కరువుచేత నాశనమవుతున్నాము.”

  4. ఆ స్త్రీలు ఇంకా ఇలా అన్నారు: “మేము ఆకాశ రాణికి ధూపం వేసి, ఆమెకు పానార్పణలు అర్పించినప్పుడు, మేము ఆమె ప్రతిమకు నచ్చిన రొట్టెలు చేసి, ఆమెకు పానార్పణలు అర్పిస్తున్నామని మా భర్తలకు తెలియదా?” అని అన్నారు.

  5. ఇశ్రాయేలు దేవుడైన సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘ఆకాశ రాణికి ధూపం వేస్తాం, ఆమెకు పానార్పణలు అర్పిస్తాం, మేము మ్రొక్కుకున్న మ్రొక్కుబడులను నిశ్చయంగా నెరవేరుస్తాం’ అని మీరు మీ భార్యలు ప్రమాణం చేసినట్టే మీరు చేశారు. “అయితే సరే అలాగే కానివ్వండి, మీరు వాగ్దానం చేసినట్లు చేయండి! మీ మ్రొక్కుబడులను చెల్లించుకోండి!

  6. నేను నిన్ను ఆర్పివేసి ఆకాశాన్ని మూసివేస్తాను. నక్షత్రాలను చీకటిగా చేస్తాను; సూర్యుని మబ్బుతో కప్పుతాను చంద్రుడు ప్రకాశించడు.

  7. వాటికి ముందు భూమి కంపిస్తుంది, ఆకాశాలు వణకుతాయి, సూర్యచంద్రులకు చీకటి కమ్ముతుంది. నక్షత్రాలు ఇక ప్రకాశించవు.

  8. యెహోవా భయంకరమైన మహాదినం రాకముందు, సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంగా మారుతాడు.

  9. సూర్యచంద్రులు చీకటిగా మారుతాయి, నక్షత్రాలు ఇక ప్రకాశించవు.

  10. ఎగిరే నీ బాణాల కాంతికి నీ ఈటె తళతళ మెరుపుకు సూర్యచంద్రులు తమ ఆకాశంలో స్థానాల్లో నిలిచిపోతాయి.

  11. “ఆ శ్రమకాలం ముగిసిన వెంటనే, “ ‘సూర్యుడు నల్లగా మారుతాడు, చంద్రుడు తన కాంతిని కోల్పోతాడు. ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయి, ఆకాశ సంబంధమైనవి చెదిరిపోతాయి.’

  12. “కాని ఆ దినాల్లో, ఆ శ్రమకాలం తర్వాత, “ ‘సూర్యుడు నల్లగా మారుతాడు, చంద్రుడు తన కాంతిని కోల్పోతాడు.

  13. “ఇంకా సూర్య, చంద్ర, నక్షత్రాలలో సూచనలు, సముద్ర తరంగాల గర్జనలతో భూమి మీద ఉన్న దేశాలు వేదనతో కలవరంతో సతమతం అవుతాయి.

  14. మహా మహిమగల ప్రభువు దినం రాకముందు సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంగా మారుతాడు.

  15. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. ఒక నక్షత్రానికి మరొక నక్షత్రానికి మహిమలో భేదం ఉంటుంది.

  16. ఆ వధించబడిన గొర్రెపిల్ల ఆరో ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగింది. అప్పుడు సూర్యుడు మేక బొచ్చుతో చేసిన గోనెపట్టలా నల్లగా మారాడు, చంద్రుడు రక్తంలా ఎర్రగా మారాడు.

  17. నాలుగవ దూత తన బూరను ఊదినప్పుడు సూర్యుని మూడవ భాగం, చంద్రుని మూడవ భాగం, నక్షత్రాల మూడవ భాగం దెబ్బతిన్నాయి. కాబట్టి అవన్నీ మూడవ భాగం వెలుగును కోల్పోయాయి. పగటి వెలుగులో మూడవ భాగం ప్రకాశం ఇవ్వలేదు అలాగే రాత్రి మూడవ భాగం వెలుగు లేకుండా పోయింది.

  18. అప్పుడు పరలోకంలో ఒక గొప్ప సూచన కనిపించింది: ఒక స్త్రీ సూర్యుని ధరించుకొని, కాళ్లక్రింద చంద్రుని, తన తలమీద పన్నెండు నక్షత్రాల కిరీటాన్ని పెట్టుకొని ఉంది.

  19. ఆ పట్టణంపై సూర్యుడు గాని చంద్రుడు గాని ప్రకాశించాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుని మహిమ దానికి వెలుగు ఇస్తుంది గొర్రెపిల్ల దానికి దీపము.