Skip to content

Lending గురించి బైబిల్ వచనాలు

42 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “మీ మధ్య ఉన్న నా ప్రజల్లో ఎవరైనా అవసరంలో ఉంటే, మీరు వారికి డబ్బు అప్పు ఇస్తే, అప్పులు ఇచ్చేవారిలా ప్రవర్తించకూడదు; వడ్డీ తీసుకోకూడదు.

  2. నీ పొరుగువారి పైవస్త్రాన్ని తాకట్టుగా తీసుకుంటే, సూర్యాస్తమయానికి తిరిగి ఇచ్చేయాలి.

  3. ఎందుకంటే రాత్రివేళ కప్పుకోడానికి మీ పొరుగువారికి ఉన్నది అదొక్కటే. అది లేకుండా వారు ఎలా నిద్రపోగలరు? నేను కనికరం గలవాన్ని, కాబట్టి వారు నాకు మొరపెడితే నేను వింటాను.

  4. “ ‘మీ తోటి ఇశ్రాయేలీయులలో ఎవరైనా పేదలుగా మారి, మీలో తమను తాము ఆదరించుకోలేకపోతే, మీరు ఒక విదేశీయునికి, అపరిచితునికి చేసినట్టుగానే వారికి సహాయం చేయండి, కాబట్టి వారు మీ మధ్య జీవించడం కొనసాగించవచ్చు.

  5. వారి నుండి వడ్డీ లేదా లాభం తీసుకోకండి, అయితే మీ దేవునికి భయపడండి, తద్వారా వారు మీ మధ్యనే జీవించడం కొనసాగించవచ్చు.

  6. మీరు వారికి వడ్డీకి డబ్బు ఇవ్వకూడదు లేదా లాభం కోసం ఆహారాన్ని అమ్మకూడదు.

  7. ప్రతి ఏడు సంవత్సరాల చివర మీరు అప్పులు రద్దు చేయాలి.

  8. రద్దు చేయవలసిన విధానం ఇది: తన తోటి ఇశ్రాయేలీయునికి అప్పు ఇచ్చిన ప్రతి అప్పులవాడు దానిని రద్దు చేయాలి. ఆ సంవత్సరం అప్పు తీర్చమని అడగకూడదు, ఎందుకంటే అది అప్పులు రద్దు చేయడానికి యెహోవా సమయంగా ప్రకటించబడింది.

  9. మీరు విదేశీయులను అప్పు చెల్లించమని అడగవచ్చు కాని మీ తోటి ఇశ్రాయేలీయుని ప్రతి అప్పు రద్దు చేయాలి.

  10. అయితే, మీ మధ్యలో పేదవారు ఎవరు ఉండకూడదు, ఎందుకంటే మీ స్వాస్థ్యంగా మీరు స్వాధీనం చేసుకోవడానికి మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో ఆయన మిమ్మల్ని అధికంగా దీవిస్తారు.

  11. కాబట్టి ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఈ ఆజ్ఞలన్నిటిని జాగ్రత్తగా పాటించి మీ దేవుడైన యెహోవాకు మీరు పూర్తిగా లోబడి జీవించాలి.

  12. మీ దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసిన ప్రకారం ఆయన మిమ్మల్ని దీవిస్తారు. మీరు అనేకమంది ప్రజలకు అప్పు ఇస్తారు కాని అప్పు చేయరు. మీరు అనేక దేశాలను పరిపాలిస్తారు అయితే మిమ్మల్ని ఎవరు పరిపాలించరు.

  13. మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశపు పట్టణాల్లో ఎక్కడైనా మీ తోటి ఇశ్రాయేలీయులలో ఎవరైనా పేదవారు ఉంటే, వారి పట్ల మీ హృదయాలను కఠినంగా లేదా పిసినారిగా ఉంచకూడదు.

  14. కాని వారికి అవసరమైనంత దానిని వారికి గుప్పిలి విప్పి ధారాళంగా అప్పు ఇవ్వాలి.

  15. ఈ దుష్ట ఆలోచన మీ హృదయాల్లో పుట్టకుండా జాగ్రత్తపడండి: “ఏడవ సంవత్సరం, అప్పులు రద్దు చేసే సంవత్సరం సమీపించింది” తద్వార మీ తోటి ఇశ్రాయేలీయుల మధ్య ఉన్న పేదవారి పట్ల దయ చూపించకుండ మీరు వారికి ఏమి ఇవ్వకుండ ఉండకూడదు. మీరు అలా చేస్తే, వారు మీకు వ్యతిరేకంగా యెహోవాకు మొరపెడతారు; అప్పుడు మీరు పాపం చేసినవారిగా పరిగణించబడతారు.

  16. వారికి ధారాళంగా ఇవ్వండి, సణిగే హృదయం లేకుండా వారికి ఇవ్వండి; అప్పుడు మీ దేవుడైన యెహోవా మీ పనులన్నిటిలో మీరు చేసే ప్రతీ దానిలో మిమ్మల్ని దీవిస్తారు.

  17. దేశంలో ఎల్లప్పుడు పేదవారు ఉంటారు. కాబట్టి మీ దేశంలో తోటి ఇశ్రాయేలీయులలో పేదవారికి, అవసరంలో ఉన్నవారికి ధారాళంగా మీ గుప్పిలి విప్పాలని నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను.

  18. వడ్డీ సంపాదించగల డబ్బు గాని ఆహారమే గాని వేరే ఏదైనా గాని, తోటి ఇశ్రాయేలు దగ్గర వడ్డీ వసూలు చేయకూడదు.

  19. మీరు విదేశీయుల దగ్గర వడ్డీని వసూలు చేయవచ్చు, కానీ తోటి ఇశ్రాయేలు దగ్గర కాదు, తద్వారా మీరు స్వాధీనం చేసుకునే దేశంలో మీరు చేయి పెట్టిన ప్రతి దానిలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.

  20. మీరు మీ పొరుగువానికి ఏదైనా అప్పు ఇచ్చినప్పుడు, వారు తాకట్టుగా పెట్టిన దాన్ని తెచ్చుకోడానికి ఇంట్లో చొరబడకూడదు.

  21. బయటనే నిలవాలి, ఇంట్లోనుండి వచ్చి అతడే స్వయంగా ఆ వస్తువు తెచ్చి ఇవ్వాలి.

  22. పొరుగువాడు పేదవాడైతే, వాని తాకట్టును మీ దగ్గర పెట్టుకుని నిద్రపోవద్దు.

  23. సూర్యాస్తమయానికి వారి వస్త్రాన్ని తిరిగి ఇవ్వండి, తద్వారా మీ పొరుగువారు దానిపై నిద్రపోవచ్చు. అప్పుడు వారు మిమ్మల్ని దీవిస్తారు, అది మీ దేవుడైన యెహోవా దృష్టిలో నీతిగా లెక్కించబడుతుంది.

  24. తర్వాత ప్రజలు వారి భార్యలు తమ తోటి యూదుల మీద తీవ్రమైన ఆరోపణ చేశారు.

  25. కొందరు, “మేమూ, మా కుమారులు కుమార్తెలు కలిపి చాలామంది ఉన్నాము కాబట్టి మేము తిని బ్రతకడానికి మాకు ధాన్యం ఇవ్వండి” అన్నారు.