Jewels గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
ప్రజలు ఈ బాధ కలిగించే మాటలు విన్నప్పుడు, వారు దుఃఖించడం మొదలుపెట్టారు, ఎవరూ ఆభరణాలు ధరించలేదు.
యెహోవా మోషేతో ఇలా అన్నారు, “ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, ‘మీరు లోబడని ప్రజలు. ఒకవేళ నేను ఒక్క క్షణం మీతో కలిసి వెళ్లినా, మిమ్మల్ని అంతం చేయవచ్చు. కాబట్టి మీ ఆభరణాలను తీసివేయండి మిమ్మల్ని ఏం చేయాలో నేను నిర్ణయిస్తాను.’ ”
కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు పర్వతం దగ్గర నుండి తమ ఆభరణాలను ధరించలేదు.
కాబట్టి యెహోవా సన్నిధిలో మాకు ప్రాయశ్చిత్తం కలగాలని మేము భుజ కడియాలు, కడియాలు, ఉంగరాలు, చెవిపోగులు, మెడ హారాలు యెహోవాకు అర్పణగా తెచ్చాము” అని చెప్పారు.
మోషే, యాజకుడైన ఎలియాజరు వారి నుండి బంగారు ఆభరణాలు తీసుకున్నారు.
సహస్రాధిపతుల నుండి, శతాధిపతుల నుండి వారు తీసుకుని, యెహోవాకు అర్పణగా అర్పించిన బంగారం మొత్తం 16,750 షెకెళ్ళు.
ఆ రోజు ప్రభువు వారి సొగసును లాక్కుంటారు: గాజులు, శిరోభూషణాలు, నెలవంక హారాలు,
చెవిపోగులు, కడియాలు, మేలి ముసుగులు,
తలపాగాలు, కాళ్లపట్టీలు, ఒడ్డాణాలు, సుగంధద్రవ్య బుడ్డీలు, తాయెత్తులు,
ఉంగరాలు, ముక్కుపుడకలు,
నేను నిన్ను నగలతో అలంకరించాను: నీ చేతులకు కంకణాలు, మెడలో హారం వేసి,
ముక్కుకు ముక్కుపుడక, చెవులకు పోగులు తలపై కిరీటం పెట్టాను.
ఇలా నిన్ను బంగారం, వెండితో అలంకరించి, సన్నని నార కుట్టుపని ఉన్న ఖరీదైన పట్టు వస్త్రాలు నీకు ధరింపజేశాను. నీకు ఆహారంగా తేనె, ఒలీవనూనె నాణ్యమైన పిండి ఇవ్వగా నీవు చాలా అందంగా తయారయ్యావు, ఒక రాణిగా ఎదిగావు.