కంటెంట్‌కు వెళ్లండి

Intercessory Prayer గురించి బైబిల్ వచనాలు: Paul

5 వచనాలు · 43 కోణాలు

"Intercessory Prayer" కోసం వెతకండి

Paul గురించి వచనాలు

  1. ఈ కారణంగా, మీ గురించి విన్న రోజు నుండి, మేము మీ కోసం మానక ప్రార్థిస్తున్నాము. మీరు ఆత్మ ఇచ్చే సంపూర్ణ జ్ఞానం, వివేకం ద్వారా ఆయన చిత్తాన్ని పరిపూర్ణంగా గ్రహించినవారై,

  2. ప్రతి మంచి పనిలో సఫలమవుతూ, దేవుని జ్ఞానంలో ఎదుగుతూ అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెడుతూ ఆయనకు తగినట్లుగా జీవించాలని,

  3. మీరు ఆనందంతో కూడిన పరిపూర్ణమైన ఓర్పును, సహనాన్ని కలిగి ఉండేలా, ఆయన మహిమ ప్రభావాలను బట్టి సంపూర్ణ శక్తితో మీరు బలపరచబడాలని దేవున్ని నిరంతరం వేడుకుంటున్నాము.

  4. వెలుగు రాజ్యంలో పరిశుద్ధ ప్రజల స్వాస్థ్యంలో పాలుపంచుకోవడానికి, మిమ్మల్ని ఎన్నికచేసిన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము.

  5. దీన్ని హృదయంలో ఉంచుకుని, మన దేవుడు మీకిచ్చిన పిలుపుకు మిమ్మల్ని ఆయన యోగ్యులుగా చేయాలని, ఆయన తన శక్తిచేత మీ ప్రతి ఉత్తమమైన కోరికను ఫలింపచేయాలని, మీ ప్రతి పని విశ్వాసం వలన జరగాలని మేము మీ కోసం ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాము.