కంటెంట్‌కు వెళ్లండి

Intercessory Prayer గురించి బైబిల్ వచనాలు: Abraham

10 వచనాలు · 43 కోణాలు

"Intercessory Prayer" కోసం వెతకండి

Abraham గురించి వచనాలు

  1. అప్పుడు అబ్రాహాము ఆయనను సమీపించి, “దుష్టులతో పాటు నీతిమంతులను నిర్మూలం చేస్తారా?

  2. ఒకవేళ ఆ పట్టణంలో యాభైమంది నీతిమంతులుంటే ఎలా? ఆ యాభైమంది కోసమన్నా ఆ పట్టణాన్ని కాపాడకుండా నిజంగా దానిని నాశనం చేస్తారా?

  3. అలా నాశనం చేయడం మీకు దూరమవును గాక! దుష్టులతో పాటు నీతిమంతులను చంపడం, దుష్టులను నీతిమంతులను ఒకేలా చూడడము. మీ నుండి ఆ తలంపు దూరమవును గాక! సర్వలోక న్యాయాధిపతి న్యాయం చేయరా?” అని అన్నాడు.

  4. యెహోవా జవాబిస్తూ, “సొదొమలో యాభైమంది నీతిమంతులను నేను కనుగొంటే, వారిని బట్టి ఆ స్థలం అంతటిని కాపాడతాను” అని అన్నారు.

  5. అబ్రాహాము మరలా మాట్లాడాడు: “నేను ధూళిని బూడిదను, అయినాసరే నేను ప్రారంభించాను కాబట్టి నేను ప్రభువుతో ఇంకా మాట్లాడతాను.

  6. ఒకవేళ యాభైమందిలో నీతిమంతులు అయిదుగురు తక్కువైతే అప్పుడు పట్టణం అంతటిని అయిదుగురు తక్కువ ఉన్నందుకు నాశనం చేస్తారా?” ఆయన, “నేను అక్కడ నలభై అయిదుగురు చూస్తే అప్పుడు దానిని నాశనం చేయను” అన్నారు.

  7. అబ్రాహాము, “ఒకవేళ నలభైమంది నీతిమంతులు ఉంటే?” అని మరలా అడిగాడు. “ఆ నలభైమంది కోసం దానిని నాశనం చేయను” అని దేవుడు అన్నారు.

  8. అప్పుడు అతడు, “ప్రభువు కోప్పడకండి, నన్ను మాట్లాడనివ్వండి. ఒకవేళ అక్కడ ముప్పైమంది నీతిమంతులు మాత్రమే ఉంటే?” అని అడిగాడు. ఆయన, “ముప్పైమందిని నేను కనుగొంటే నేను నాశనం చేయను” అని జవాబిచ్చారు.

  9. అబ్రాహాము, “నేను ప్రభువుతో మాట్లాడడానికి తెగించాను; ఒకవేళ అక్కడ ఇరవైమందే మాత్రమే ఉంటే?” అని అన్నాడు. ఆయన, “ఆ ఇరవైమంది కోసం దానిని నాశనం చేయను” అన్నారు.

  10. అప్పుడతడు, “ప్రభువా, కోప్పడకండి, నేను ఇంకొక్కసారి మాట్లాడతాను. ఒకవేళ అక్కడ పదిమందే ఉంటే?” అని అడిగాడు. ఆయన, “ఆ పదిమంది కోసం దానిని నాశనం చేయను” అని జవాబిచ్చారు.