Skip to content

Instability గురించి బైబిల్ వచనాలు: General references

46 వచనాలు · 1 కోణం

General references గురించి వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “రూబేనూ, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తి నా బలం యొక్క మొదటి గుర్తు, ఘనతలోను శక్తిలోను ఆధిక్యత గలవాడవు

  2. కానీ నీళ్లలా అస్థిరంగా ఉండే నీవు ఇకపై రాణించవు, ఎందుకంటే నీవు నీ తండ్రి మంచం ఎక్కావు, నా పడకను అపవిత్రం చేశావు.

  3. అప్పుడు మోషే అహరోనులను తిరిగి ఫరో దగ్గరకు తీసుకువచ్చినప్పుడు అతడు, “వెళ్లండి, మీ దేవుడైన యెహోవాను సేవించండి, కాని ఎవరు వెళ్తారో నాకు చెప్పండి” అని అన్నాడు.

  4. అందుకు మోషే, “మేము యెహోవాకు పండుగ జరుపుకోవాలి కాబట్టి మేము మాలో చిన్నవారిని పెద్దవారిని మా కుమారులను కుమార్తెలను మా గొర్రెలను పశువులను తీసుకెళ్తాము” అన్నాడు.

  5. అందుకు ఫరో, “యెహోవా మీతో ఉండును గాక! ఒకవేళ నేను మిమ్మల్ని మీ స్త్రీలు, పిల్లలతో సహా వెళ్లనిస్తే! మీ చెడు ఆలోచన నాకు తెలుసు.

  6. కాబట్టి కేవలం పురుషులు మాత్రమే వెళ్లి యెహోవాను సేవించండి; మీరు అడుగుతుంది ఇదే కదా” అని వారితో అన్నాడు. అప్పుడు వారు ఫరో ఎదుట నుండి తరిమివేయబడ్డారు.

  7. ఫరో వెంటనే మోషే అహరోనులను పిలిపించి వారితో, “మీ దేవుడైన యెహోవాకు మీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను.

  8. దయచేసి మరొకసారి నా పాపాన్ని క్షమించి మరణం కలిగించే ఈ తెగులును నా నుండి తొలగించమని మీ దేవుడైన యెహోవాకు ప్రార్థించండి” అని అన్నాడు.

  9. మోషే ఫరో దగ్గర నుండి వెళ్లి యెహోవాకు ప్రార్థన చేశాడు.

  10. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి బలమైన పడమటి గాలి వీచేలా చేసినప్పుడు ఆ గాలికి మిడతలు ఎర్ర సముద్రంలోకి కొట్టుకుపోయాయి. ఈజిప్టులో ఎక్కడ కూడా ఒక్క మిడత కూడా మిగల్లేదు.

  11. అయితే యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేశారు కాబట్టి అతడు ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వలేదు.

  12. నేను వారికి ఆజ్ఞాపించిన మార్గం నుండి చాలా త్వరగా తప్పిపోయి ఒక దూడ రూపంలో పోతపోసిన విగ్రహాన్ని తమ కోసం తయారుచేసుకుని దానికి సాష్టాంగపడి బలి అర్పించి, ‘ఇశ్రాయేలూ, ఈజిప్టులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుళ్ళు వీరే’ అని అన్నారు.

  13. “నేను ఈ ప్రజలను చూశాను” అని అంటూ యెహోవా మోషేతో ఇలా అన్నారు, “వారు మొండి ప్రజలు,

  14. నా కోపం వారి మీద రగులుకొని, నేను వారిని నాశనం చేస్తాను, నీవు నన్ను వదిలేయి. తర్వాత నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను.”

  15. ఇశ్రాయేలీయులు అప్పుడు కాని దేవుని మాట నమ్మలేదు. స్తుతిస్తూ పాటలు పాడారు.

  16. దేవుని క్రియలు వారు త్వరలోనే మరచిపోయారు. ఆయన సలహాలను వారు లక్ష్యపెట్టు వారు కారు.

  17. నా కుమారుడా, యెహోవాకు రాజుకు భయపడు, తిరుగుబాటు చేసే అధికారులతో జతకలవకు.

  18. ఎందుకంటే అవి రెండు వారి మీదికి హఠాత్ నాశనాన్ని పంపుతాయి, అవి ఎలాంటి ఆపదలు తెస్తాయో ఎవరికి తెలుసు?

  19. “ఎఫ్రాయిమూ, నిన్ను నేనేం చేయాలి? యూదా, నిన్ను నేనేం చేయాలి? మీ ప్రేమ ప్రొద్దున వచ్చే పొగమంచులా, ఉదయకాలపు మంచులా అదృశ్యమవుతుంది.

  20. కాబట్టి నా ప్రవక్తల ద్వారా మిమ్మల్ని ముక్కలు చేశాను, నా నోటిమాటల ద్వారా మిమ్మల్ని చంపాను, అప్పుడు నా తీర్పులు మెరుపులా ప్రకాశిస్తాయి.

  21. అప్పుడు ఒక ధర్మశాస్త్ర బోధకుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో, “బోధకుడా, నీవు ఎక్కడికి వెళ్లినా నేను నిన్ను వెంబడిస్తాను” అన్నాడు.

  22. అందుకు యేసు, “నక్కలకు గుంటలు, ఆకాశపక్షులకు గూళ్లు ఉన్నాయి గాని మనుష్యకుమారునికి కనీసం తలవాల్చుకోడానికి స్ధలం లేదు” అని అతనికి జవాబిచ్చారు.

  23. రాతి నేలలో పడిన విత్తనాలు అంటే, వాక్యాన్ని విని దానిని సంతోషంతో అంగీకరించేవారు.

  24. అయితే వారిలో వేరు లేకపోవడంతో కొంతకాలమే నిలబడతారు. వారికి వాక్యాన్ని బట్టి కష్టాలు హింసలు ఎదురైనప్పుడు వారు త్వరగా పడిపోతారు.

  25. రైతు వాక్యం విత్తుతున్నాడు.