Skip to content

Formalism గురించి బైబిల్ వచనాలు: General references

56 వచనాలు · 1 కోణం

General references గురించి వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మీ బలుల గురించి లేదా ఎప్పుడు నా ఎదుటే ఉండే మీ దహనబలుల గురించి, నేను మీకు వ్యతిరేకంగా ఎటువంటి ఆరోపణలు చేయను.

  2. మీ శాలలోనుండి మీరు తెచ్చే ఎద్దులు నాకవసరం లేదు. మీ దొడ్డిలోని మేకపోతులు నాకవసరం లేదు.

  3. అడవిలో ఉన్న ప్రతి జంతువు నాదే వేయి కొండలపై ఉన్న పశువులు నావే.

  4. పర్వతాల్లో ఉన్న ప్రతి పక్షి నాకు తెలుసు, పొలాల్లో ఉన్న జంతువులు నావే.

  5. నాకు ఆకలిగా ఉంటే నేను మీకు చెప్పను, లోకం నాది, అందులో ఉన్నవన్నీ నావి.

  6. ఎడ్ల మాంసం నేను తింటానా? మేకపోతుల రక్తం త్రాగుతానా?

  7. “దేవునికి కృతజ్ఞతార్పణలు అర్పించాలి మహోన్నతునికి మీ మ్రొక్కుబడులు చెల్లించండి.

  8. ఆపద్దినాన నన్ను పిలువండి; నేను మిమ్మల్ని విడిపిస్తాను, మీరు నన్ను ఘనపరుస్తారు.”

  9. మీరు బలులను బట్టి ఆనందించరు, లేకపోతే నేను తెచ్చేవాన్ని; మీరు దహనబలులను ఇష్టపడరు.

  10. విరిగిన ఆత్మ దేవునికి ఇష్టమైన బలి; పశ్చాత్తాపంతో విరిగిన హృదయాన్ని దేవా, మీరు నిరాకరించరు.

  11. నేను పాడుతూ దేవుని నామాన్ని స్తుతిస్తాను. కృతజ్ఞత చెల్లించి ఆయనను కీర్తిస్తాను.

  12. ఎద్దును, కొమ్ములు డెక్కలు కలిగిన కోడెను అర్పించడం కంటే, ఆయనను స్తుతించడం యెహోవాకు ఇష్టము.

  13. యెహోవా ఇలా అంటున్నారు, “విస్తారమైన మీ బలులు నాకెందుకు? దహనబలులుగా ఇచ్చిన పొట్టేళ్లు, బాగా క్రొవ్విన జంతువుల క్రొవ్వు నాకు వెగటు కలిగించాయి; ఎద్దుల, గొర్రెపిల్లల, మేకపోతుల రక్తంలో నాకు ఆనందం లేదు.

  14. మీరు నా సన్నిధికి వస్తున్నప్పుడు, నా ఆవరణాలను త్రొక్కడానికి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు?

  15. విలువలేని అర్పణలు తీసుకురావడం ఆపండి! మీ ధూపం నాకు అసహ్యం కలిగిస్తుంది. అమావాస్యలు, సబ్బాతులు, ప్రత్యేక సమావేశాలు మీ దుష్ట సమావేశాలు నేను భరించలేను.

  16. మీ అమావాస్య ఉత్సవాలు, నియమించబడిన పండుగలు నా పూర్ణాత్మతో నేను అసహ్యిస్తున్నాను. అవి నాకు భారంగా ఉన్నాయి; వాటిని భరించలేక అలిసిపోయాను.

  17. ప్రార్థనలో మీరు మీ చేతులు చాచినప్పుడు, మిమ్మల్ని చూడకుండ కళ్లు కప్పుకుంటాను; మీరు చాలా ప్రార్థనలు చేసినా నేను వినను. “మీ చేతులు రక్తంతో నిండిపోయాయి!

  18. ప్రభువు ఇలా అంటున్నారు: “ఈ ప్రజలు నోటి మాటతో నా దగ్గరకు వస్తున్నారు. పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, కాని వారి హృదయాలు నా నుండి దూరంగా ఉన్నాయి. వారికి బోధించబడిన మానవ నియమాల ప్రకారం మాత్రమే నా పట్ల భయభక్తులు చూపుతున్నారు.

  19. కాబట్టి నేను మరొకసారి ఈ ప్రజలను ఆశ్చర్యాలతో ఆశ్చర్యపరుస్తాను; జ్ఞానుల జ్ఞానం నశిస్తుంది వివేకుల వివేకం మాయమైపోతుంది.”

  20. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా దాచడానికి గొప్ప లోతుల్లోకి వెళ్లే వారికి శ్రమ. “మమ్మల్ని ఎవరు చూస్తారు? ఎవరు తెలుసుకుంటారు?” అని అనుకుని, చీకటిలో తమ పనులు చేసేవారికి శ్రమ.

  21. మీరు విషయాలను తలక్రిందులుగా చూస్తారు కుమ్మరిని మట్టితో సమానంగా చూస్తారు! చేయబడిన వస్తువు దానిని చేసినవానితో, “నీవు నన్ను చేయలేదు” అని అనవచ్చా? కుండ కుమ్మరితో, “నీకు ఏమి తెలియదు” అని అనవచ్చా?

  22. “మీ పండుగలంటే నాకు అసహ్యం, వాటిని నేను ద్వేషిస్తాను; మీ సమావేశాల్లో నేను సంతోషించను.

  23. మీరు నాకు దహనబలులు, భోజనార్పణలు సమర్పించినా, నేను వాటిని స్వీకరించను. మీరు క్రొవ్విన జంతువులను సమాధానబలులుగా సమర్పించినా, నేను వాటిని లెక్కచేయను.

  24. మీ పాటల ధ్వని నా నుండి తీసివేయండి! మీ సితారాల సంగీతం నేను వినను.

  25. ఏమి తీసుకుని నేను యెహోవా సన్నిధిలోకి రావాలి, మహోన్నతుడైన దేవుని ఎదుట నమస్కరించాలి? నేను దహనబలులను, ఏడాది దూడలను ఆయన సన్నిధికి తీసుకురావాలా?