కంటెంట్‌కు వెళ్లండి

Depravity of Man గురించి బైబిల్ వచనాలు: General references

94 వచనాలు · 1 కోణం

General references గురించి వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహోవా భూమిపై నరుల దుష్టత్వం చాలా విస్తరించిందని, నరుల హృదయంలోని ప్రతీ ఊహ కేవలం చెడు అని చూశారు.

  2. యెహోవా భూమిపై నరులను చేసినందుకు చింతించి, హృదయంలో చాలా బాధపడ్డారు.

  3. అప్పుడు యెహోవా, “నేను సృజించిన నరులను, వారితో పాటు జంతువులను, పక్షులను, నేలపై ప్రాకే జీవులను భూమి మీద నుండి తుడిచివేస్తాను, వాటిని చేసినందుకు నేను బాధపడుతున్నాను” అని అనుకున్నారు.

  4. దేవుని దృష్టిలో భూమి అవినీతితో హింసతో నిండిపోయింది.

  5. దేవుడు ఈ భూమి ఎంతో అవినీతితో ఉందని చూశారు, ఎందుకంటే భూమిపై ఉన్న ప్రజలంతా తమ జీవిత విధానాలను పాడుచేసుకున్నారు.

  6. కాబట్టి దేవుడు నోవహుతో ఇలా అన్నారు, “నేను ప్రజలందరినీ నాశనం చేయబోతున్నాను, ఎందుకంటే వారిని బట్టి భూమి హింసతో నిండిపోయింది. నేను ఖచ్చితంగా వారిని, భూమిని నాశనం చేయబోతున్నాను.

  7. ‘మానవుడు దేవుని కన్నా నీతిమంతుడు అవుతాడా? మానవుడు తన సృష్టికర్త కన్నా పవిత్రుడు కాగలడా?

  8. దేవుడు తన సేవకులనే నమ్మనప్పుడు, తన దూతల్లోనే లోపాలను కనుగొన్నప్పుడు,

  9. మట్టి ఇళ్ళలో నివసిస్తూ, దుమ్ములో పునాదులు గలవారిని, చిమ్మెట కన్నా సులువుగా చితికిపోయేవారిని ఇంకెలా చూస్తారో!

  10. “అవును, ఇదంతా నిజమని నాకు తెలుసు. అయితే నశించే మానవులు దేవుని ఎదుట తమ నిర్దోషత్వాన్ని ఎలా నిరూపించుకోగలరు?

  11. వారు ఆయనతో వాదించాలనుకుంటే, వేయి ప్రశ్నలలో ఒక్కదానికైనా వారు ఆయనకు జవాబు చెప్పలేరు.

  12. నేను దోషినని తేలినప్పుడు, నాకెందుకు ఈ వృధా ప్రయాస?

  13. సబ్బుతో నన్ను నేను కడుక్కున్నా, శుభ్రం చేసే పొడితో నా చేతులు కడుక్కున్నా,

  14. మీరు నన్ను బురద గుంటలో ముంచుతారు, అప్పుడు నా బట్టలే నన్ను అసహ్యించుకుంటాయి.

  15. “పవిత్రులుగా ఉండడానికి మనుష్యులు ఏపాటివారు? నీతిమంతులుగా ఉండడానికి స్త్రీకి పుట్టిన వారు ఏపాటివారు?

  16. దేవుడు తన పవిత్రులను కూడా నమ్మకపోతే, ఆయన దృష్టిలో ఆకాశాలు కూడా పవిత్రం కాకపోతే,

  17. ఇక చెడును నీటిలా త్రాగే నీచులు, అవినీతిపరులు, ఆయన దృష్టికి ఇంకెంత అల్పులు!

  18. అలాంటప్పుడు దేవుని ఎదుట ఎలా నీతిమంతుడు కాగలడు? అలాంటప్పుడు స్త్రీకి పుట్టిన ఒకడు ఎలా పవిత్రుడు కాగలడు?

  19. ఒకవేళ దేవుని దృష్టిలో చంద్రుడు కాంతివంతుడు కానప్పుడు; నక్షత్రాలు పవిత్రమైనవి కానప్పుడు.

  20. పురుగువంటి మనుష్యుడు క్రిమివంటి మనుష్యుడు ఆయన దృష్టిలో పవిత్రుడు కాలేడు కదా!”

  21. సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. “దేవుడు లేడు” అని మూర్ఖులు తమ హృదయంలో అనుకుంటారు. వారు అవినీతిపరులు, వారి క్రియలు నీచమైనవి; మంచి చేసేవారు ఒక్కరు లేరు.

  22. వివేకం కలిగి దేవున్ని వెదకేవారు ఎవరైనా ఉన్నారా అని యెహోవా పరలోకం నుండి మనుష్యులందరిని పరిశీలించి చూస్తున్నారు.

  23. అందరు దారి తప్పి చెడిపోయారు; మంచి చేసేవారు ఎవరూ లేరు. ఒక్కరు కూడా లేరు.

  24. సంగీత దర్శకునికి. మహలతు అనే రాగం మీద పాడదగినది. దావీదు ధ్యానకీర్తన. “దేవుడు లేడు” అని బుద్ధిహీనులు తమ హృదయాల్లో అనుకుంటారు. వారు అవినీతిపరులు, వారి మార్గాలు నీచమైనవి; మంచి చేసేవారు ఒక్కరు లేరు.

  25. అర్థం చేసుకునేవారు, దేవున్ని వెదకేవారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు పరలోకం నుండి మనుష్యులందరిని పరిశీలించి చూస్తున్నారు