Skip to content

Death గురించి బైబిల్ వచనాలు

177 వచనాలు · 6 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఒకవేళ మానవ ఆత్మ పైకి లేస్తుందో లేదో, జంతువుల ప్రాణం భూమిలోకి దిగిపోతుందో లేదో ఎవరికి తెలుసు?”

  2. చక్కని పరిమళం కంటే మంచి పేరు మంచిది, జన్మదినం కంటే మరణ దినం మంచిది.

  3. విందు జరిగే వారి ఇళ్ళకు వెళ్లే కంటే ఏడ్చేవారి ఇళ్ళకు వెళ్లడం మంచిది. ఎందుకంటే మరణం ప్రతి ఒక్కరికీ వస్తుంది; జీవించి ఉన్నవారు దీనిని హృదయపూర్వకంగా స్వీకరించాలి.

  4. బ్రతికి ఉన్నవారికి తాము చనిపోతామని తెలుసు, కాని చనిపోయినవారికి ఏమి తెలియదు; వారికి ఏ బహుమతి లేదు, వారి పేరు కూడా మర్చిపోతారు.

  5. వారి ప్రేమ, వారి ద్వేషం వారి అసూయ చాలా కాలం క్రితమే అంతరించిపోయాయి; సూర్యుని క్రింద జరిగే ఏ విషయంలో వారికిక ఏ భాగం ఉండదు.

  6. వెలుగు ఆహ్లాదకరమైనది, సూర్యుని చూడడం కళ్లకు సంతోషాన్ని ఇస్తుంది.

  7. ఎవరు ఎన్ని సంవత్సరాలు బ్రతికితే, అన్ని సంవత్సరాలు వారు ఆనందంగా ఉండాలి. అయితే చీకటి రోజులు చాలా రాబోతున్నాయని వారు జ్ఞాపకముంచుకోవాలి. రాబోయేదంతా అర్థరహితమే.

  8. నేను, “నా జీవిత సగభాగంలో నేను మరణ ద్వారం గుండా వెళ్లాలా, నా మిగిలిన జీవితకాలమంతా పొగొట్టుకున్నానా?”

  9. నేను, “సజీవుల దేశంలో నేనిక యెహోవాను చూడలేను; నా తోటి మనుష్యులను చూడలేను ఈ లోకంలో ఇప్పుడు నివసించే వారితో ఉండలేను.

  10. గొర్రెల కాపరి గుడారంలా నా ఇల్లు పడవేయబడి నా నుండి తీసివేయబడింది. నేతపనివాడు వస్త్రం చుట్టినట్లు నా జీవితాన్ని ముగిస్తున్నాను, ఆయన నన్ను మగ్గం నుండి వేరుచేశారు. ఒక్క రోజులోనే మీరు నాకు ముగింపు తెచ్చారు.

  11. ఉదయం వరకు ఓపికగా ఉన్నాను, కాని సింహం విరిచినట్లు ఆయన నా ఎముకలన్నీ విరిచారు; పగలు రాత్రి మీరు నా ముగింపు తెచ్చారు.

  12. ఎందుకంటే, సమాధి మిమ్మల్ని స్తుతించలేదు, మరణం మీకు స్తుతులు పాడలేదు. సమాధిలోనికి వెళ్లేవారు మీ నమ్మకత్వం కోసం నిరీక్షించలేరు.

  13. నేను ఈ రోజు స్తుతిస్తున్నట్లు, సజీవులు, సజీవులే కదా మిమ్మల్ని స్తుతిస్తారు; తల్లిదండ్రులు తమ పిల్లలకు మీ నమ్మకత్వాన్ని తెలియజేస్తారు.

  14. నీతిమంతులు నశిస్తారు, ఎవరూ ఆ విషయాన్ని పట్టించుకోరు; భక్తులు మాయమైపోతారు, కీడు చూడకుండ నీతిమంతులు కొనిపోబడడం ఎవరూ గ్రహించరు.

  15. యథార్థంగా జీవించేవారు సమాధానంలో ప్రవేశిస్తారు; వారు చనిపోయినప్పుడు వారికి విశ్రాంతి కలుగుతుంది.

  16. ఈ దేశంలో పుట్టిన కుమారులు కుమార్తెల గురించి వారి తల్లుల గురించి వారి తండ్రుల గురించి యెహోవా ఇలా అంటున్నారు:

  17. “వారు ప్రాణాంతకమైన వ్యాధులతో చనిపోతారు. వారి కోసం ఎవరు దుఃఖించరు, వారిని పాతిపెట్టరు, వారి శవాలు నేలమీద పడి ఉన్న పెంటలా ఉంటాయి. వారు ఖడ్గంతో, కరువుతో నశిస్తారు, వారి శవాలు పక్షులకు అడవి జంతువులకు ఆహారంగా ఉంటాయి.”

  18. “సేవ కోసం మీ నడుము కట్టుకోండి, మీ దీపాలను వెలుగుతూ ఉండనివ్వండి,

  19. తమ యజమాని పెండ్లి విందునుండి ఎప్పుడు తిరిగి వస్తాడా అని ఎదురుచూస్తూ, అతడు వచ్చి తలుపు తట్టినప్పుడు వెంటనే తలుపు తీయడానికి మెలకువతో సిద్ధంగా ఉన్న సేవకుల్లా ఉండండి.

  20. యజమాని వచ్చినప్పుడు ఏ సేవకులు మెలకువగా ఉండడం చూస్తాడో ఆ సేవకులకు మేలు. నేను చెప్పేది నిజం, సేవ చేయడానికి అతడు తన నడుము కట్టుకుని, ఆ సేవకులను భోజనానికి కూర్చోబెట్టి, అతడు అక్కడే వేచి ఉంటాడు.

  21. “ఆ పేదవాడు చనిపోయినప్పుడు దేవదూతలు వానిని అబ్రాహాము రొమ్మున ఆనుకోడానికి తీసుకెళ్లారు. అలాగే ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడ్డాడు.

  22. ధనవంతుడు నరకంలో యాతనపడుతు, దూరం నుండి అబ్రాహాము రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూశాడు.

  23. వెంటనే అతడు, ‘తండ్రీ అబ్రాహామూ, నేను అగ్నిలో అల్లాడి పోతున్నాను. నా మీద కనికరం చూపించి, తన చేతివ్రేలికొన నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి లాజరును పంపించవా’ అని కేక వేశాడు.

  24. “అందుకు అబ్రాహాము, ‘కుమారుడా, జ్ఞాపకం చేసుకో, లాజరు కష్టాలను అనుభవిస్తున్నప్పుడు నీ జీవితంలో నీవు మేళ్ళను అనుభవించావు, కానీ ఇప్పుడు ఇక్కడ అతడు ఆదరణ పొందుతున్నాడు, కానీ నీవు యాతనపడుతున్నావు.

  25. వీటన్నిటితో పాటు, నీకు మాకు మధ్య పెద్ద అగాధం ఉంది కాబట్టి ఇక్కడి వారు అక్కడికి గాని అక్కడి వారు ఇక్కడకు గాని రాలేరు’ అన్నాడు.