Death గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
అందుకు యోనాతాను, “నీవలా ఎప్పుడూ మాట్లాడకు! నా తండ్రి చిన్న పనైనా పెద్ద పనైనా నాకు చెప్పకుండా చేయడు. నా తండ్రి ఈ విషయం నా దగ్గర ఎందుకు దాస్తాడు?” అన్నాడు.
అప్పుడు దావీదు, “నేను నీ దయ పొందానని నీ తండ్రికి ఖచ్చితంగా తెలుసు కాబట్టి అతడు ‘యోనాతాను బాధపడతాడు కాబట్టి అతనికి తెలియకూడదు’ అని అనుకుని ఉంటాడు. అయితే సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నిజంగా నాకు మరణానికి మధ్య ఒక్క అడుగు మాత్రమే ఉంది” అని ప్రమాణం చేసి చెప్పాడు.
వారు శపించబడి నాశనమవుతారని ఈ స్థలం గురించి ఈ ప్రజల గురించి నే చెప్పిన మాటలు విని నీ హృదయం స్పందించి నీవు యెహోవా ఎదుట తగ్గించుకొని నీ బట్టలు చింపుకొని నా సన్నిధిలో ఏడ్చావు కాబట్టి, నేను కూడా నీ మనవి విన్నానని యెహోవా చెప్తున్నారు.
కాబట్టి నేను నిన్ను నీ పూర్వికుల దగ్గరకు చేరుస్తాను, సమాధానంతో నీవు సమాధి చేయబడతావు. నేను ఈ స్థలం మీదికి రప్పించే విపత్తును నీ కళ్లు చూడవు’ ” అని చెప్పింది. అప్పుడు వారు ఆమె జవాబును రాజు దగ్గరకు తీసుకెళ్లారు.
చెరలో ఉన్నవారు కూడా అక్కడ నెమ్మది అనుభవిస్తారు, యాజమానుల స్వరాలు వారికిక వినబడవు.
పేదవారు గొప్పవారు అక్కడ ఉన్నారు, దాసులు తమ యాజమానుల నుండి విముక్తి పొందుతారు.
ఇప్పుడు నన్ను చూస్తున్నవారి కన్ను ఇకమీదట నన్ను చూడదు; మీరు నా కోసం చూసినా నేను ఇక ఉండను.
మేఘం విడిపోయి మాయమైపోయిట్లు, సమాధిలోనికి దిగిపోయినవాడు మరలా తిరిగి రాడు.
అతడు తన ఇంటికి మరలా తిరిగి రాడు; అతని స్వస్థలం అతన్ని మరచిపోతుంది.
తిరిగి రాలేని స్థలానికి నేను వెళ్లక ముందు, చీకటి, అంధకారం గల దేశానికి వెళ్లక ముందు నన్ను వదిలేయండి.
అంధకారం గల చిమ్మచీకటి గందరగోళంగా ఉండే స్థలానికి నన్ను వెళ్లనివ్వండి, అక్కడ వెలుగు కూడా చీకటిలా ఉంటుంది.”
“కనీసం చెట్టుకైనా నిరీక్షణ ఉంది: దాన్ని నరికివేసినా అది మరలా చిగురిస్తుంది, దానికి లేత కొమ్మలు ఖచ్చితంగా వస్తాయి.
దాని వేర్లు భూమిలో ఎండిపోయినా దాని మోడు మట్టిలో చనిపోయినా,
నీటి వాసన తగిలితే చాలు అది చిగురిస్తుంది. లేత మొక్కలా కొమ్మలు వేస్తుంది.
కాని నరులు చనిపోయి కదలకుండ పడి ఉంటారు; చివరి శ్వాస విడిచిన తర్వాత వారు ఇక ఉండరు.
సముద్రంలోని నీరు ఆవిరైపోయినట్లుగా, నదీ తీరం హరించి ఎండిపోయినట్లుగా,
మానవులు నిద్రిస్తారు, తిరిగి లేవరు; ఆకాశం గతించేవరకు వారు మేలుకోరు వారి నిద్ర నుండి తిరిగి లేవరు.
నీళ్లు రాళ్లను అరగదీసినట్లుగా ప్రవాహాలు మట్టిని కడిగివేసినట్లు, మీరు మనిషి యొక్క నిరీక్షణను నాశనం చేస్తారు.
మీరు వారిని ఒకేసారి జయిస్తారు, వారు గతించిపోతారు; మీరు వారి ముఖం తీరు మార్చివేసి వారిని వెళ్లగొడతారు.
ఒకవేళ వారి పిల్లలు గౌరవించబడినా అది వారికి తెలియదు; వారి సంతానం అణచివేయబడినా వారు గ్రహించలేరు.
నాకున్న ఆశ ఏంటంటే సమాధి నాకు ఇల్లు అవ్వాలి, చీకటిలో నా పరుపు పరచుకోవాలి.
నేను అవినీతితో, ‘నీవే నా తండ్రివి’ అని, పురుగుతో, ‘నా తల్లివి’ లేదా ‘నా సోదరివి’ అని అంటే,
“అనాది కాలం నుండి ఎలా ఉందో నీకు తెలుసు, భూమి మీద నరుడు ఉంచబడినప్పటి నుండి ఏమి జరుగుతున్నది నీకు తెలుసు.
దుర్మార్గుల ఉల్లాసం కొద్దిసేపే అని, భక్తిహీనుల సంతోషం ఒక క్షణమే ఉంటుందని నీకు తెలుసు.
“అయినా ఎంత తరచుగా దుర్మార్గుల దీపం ఆరిపోతుంది? దేవుడు తన కోపంలో కేటాయించిన, విపత్తు ఎంత తరచుగా వారి మీదికి వస్తుంది?