కంటెంట్‌కు వెళ్లండి

Daughter గురించి బైబిల్ వచనాలు

36 వచనాలు · 5 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సెలోఫెహాదు కుమార్తెలైన మహ్లా, తిర్సా, హొగ్లా, మిల్కా, నోవా తమ తండ్రి సహోదరుల కుమారులను పెళ్ళి చేసుకున్నారు.

  2. వీరు యోసేపు కుమారుడైన మనష్షే సంతతివారిని పెళ్ళి చేసుకున్నారు వారి వారసత్వం వారి తండ్రి గోత్రం లోనే, వంశం లోనే నిలిచింది.

  3. ఇవి మోయాబు సమతల మైదానంలో, యెరికోకు ఎదురుగా యొర్దాను అవతలి వైపు ప్రాంతంలో యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞలు, నియమాలు ఇచ్చారు.

  4. మనష్షే కుమారుడైన మాకీరుకు పుట్టిన గిలాదు కుమారుడైన హెఫెరుకు పుట్టిన సెలోఫెహాదుకు కుమారులు లేరు, కుమార్తెలు మాత్రమే ఉన్నారు. వారి పేర్లు మహ్లా, నోవా, హొగ్లా, మిల్కా, తిర్సా.

  5. వారు యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడైన యెహోషువ, నాయకుల దగ్గరకు వెళ్లి, “మా బంధువుల మధ్య మాకు వారసత్వం ఇవ్వాలని మోషేకు యెహోవా ఆజ్ఞాపించారు” అని చెప్పారు. కాబట్టి యెహోషువ యెహోవా ఆజ్ఞ ప్రకారం వారి తండ్రి సోదరుల మధ్య వారికి వారసత్వమిచ్చాడు.

  6. యొర్దాను నదికి అవతల ఉన్న గిలాదు, బాషానుతో పాటు మనష్షేకు అధనంగా పది వాటాల భూమి వచ్చింది.

  7. ఎందుకంటే మనష్షే గోత్రపు కుమారులతో పాటు వారి కుమార్తెలు కూడా వారసత్వాన్ని పొందారు. గిలాదు దేశం మిగతా మనష్షే సంతతివారికి ఇవ్వబడింది.

  8. కాలేబు, “కిర్యత్-సెఫెరు మీద దాడి చేసి స్వాధీనపరచుకున్న వ్యక్తికి నా కుమార్తె అక్సాను ఇచ్చి పెళ్ళి చేస్తాను” అని అన్నాడు.

  9. కాలేబు సోదరుడూ కెనజు కుమారుడైన ఒత్నీయేలు దానిని స్వాధీనపరచుకున్నాడు; కాబట్టి కాలేబు తన కుమార్తె అక్సాను అతనికిచ్చి పెళ్ళి చేశాడు.

  10. అయితే తన కుమార్తె మీకాలు దావీదును ప్రేమించింది. ఆ విషయం తనకు తెలిసినప్పుడు సౌలు సంతోషించాడు.

  11. “ఆమెను అతనికి ఇచ్చి పెళ్ళి చేస్తాను అప్పుడు ఆమె అతనికి ఉరిగా మారి ఫిలిష్తీయుల చేయి అతని మీద పడుతుంది” అనుకుని సౌలు దావీదుతో, “నీవు నా అల్లుడు అవ్వడానికి నీకు మరో అవకాశం ఉంది” అన్నాడు.