కంటెంట్‌కు వెళ్లండి

Amusements and Worldly Pleasures గురించి బైబిల్ వచనాలు

18 వచనాలు · 16 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. ఫిలిష్తీయుల నాయకులు, “మన దేవుడు మన శత్రువైన సంసోనును మన చేతికప్పగించాడు” అని చెప్పుకుంటూ తమ దేవుడైన దాగోనుకు గొప్ప బలిగా అర్పించి పండుగ చేసుకోడానికి ఒకచోట చేరారు.

  2. ఆ ప్రజలు అతన్ని చూసి, “మన దేవుడు మన శత్రువును మన చేతులకు అప్పగించాడు, మన దేశాన్ని పాడు చేసినవాన్ని, మన వారినెంతో మందిని చంపినవాన్ని మనకప్పగించాడు” తమ దేవున్ని పొగిడారు,

  3. వారి హృదయాలు సంతోషంతో నిండిపోయి, “మనకు వినోదం కలిగించడానికి సంసోనును బయటకు తీసుకురండి!” అని కేకలు వేశారు. వారు సంసోనును చెరసాల నుండి పిలిపించి వారి ముందు నిలబెట్టినప్పుడు అతడు వారికి వినోదం కలిగించాడు. వారు అతన్ని స్తంభాల మధ్య నిలబెట్టినప్పుడు,

  4. కంజర తంతి వాయిద్యాలు మోగిస్తూ పాడతారు; పిల్లనగ్రోవి ఊదుతూ ఆనందిస్తారు.

  5. వారు తమ సంవత్సరాలు శ్రేయస్సులో గడుపుతారు సమాధానంతో సమాధికి వెళ్తారు.

  6. అయినప్పటికీ వారు దేవునితో, ‘మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి! మీ మార్గాల గురించి తెలుసుకోవాలని మాకు ఆశ లేదు.

  7. మేము ఆయనను సేవించడానికి సర్వశక్తిమంతుడు ఎవరు? మేము ఆయనకు ప్రార్థిస్తే మాకే లాభం కలుగుతుంది?’ అంటారు.

  8. మద్యం త్రాగడానికి ఉదయాన్నే లేచి మత్తెక్కే వరకు చాలా రాత్రివరకు త్రాగే వారికి శ్రమ.

  9. వారు సితారాలు, తంతి వాయిద్యాలు, కంజరలు, పిల్లనగ్రోవులు వాయిస్తూ ద్రాక్షరసం త్రాగుతూ విందు చేసుకుంటారు, కాని యెహోవా చేస్తున్న దానిని వారు గుర్తించరు ఆయన చేతిపనిని గౌరవించరు.

  10. సీయోనులో సంతృప్తిగా ఉన్నవారికి శ్రమ, సమరయ పర్వతం మీద ఆధారపడి ఉన్న మీకు శ్రమ, ఇశ్రాయేలు ప్రజలకు సలహాదారులుగా ఉన్న, గొప్ప దేశాల్లో ప్రముఖులైన మీకు శ్రమ!

  11. మీరు కల్నేకు వెళ్లి చూడండి; అక్కడినుండి హమాతుకు వెళ్లండి, తర్వాత ఫిలిష్తీయలోని గాతుకు వెళ్లండి. మీ రెండు రాజ్యాల కంటే అవి గొప్పవా? వాటి నేల మీకంటే పెద్దది కాదా?

  12. ఆపద్దినం దూరంగా ఉందనుకుని, దౌర్జన్య పరిపాలనను త్వరగా రప్పిస్తున్నారు.

  13. మీరు దంతపు మంచాల మీద పడుకుంటారు, పరుపులపై ఆనుకుంటారు. శ్రేష్ఠమైన గొర్రెపిల్లలను, శాలలోని క్రొవ్విన దూడలను మీరు తింటారు.

  14. మీరు దావీదులా సితారా వాయిస్తూ వాయిద్యాలు మెరుగుపరుస్తారు.

  15. మీరు ద్రాక్షరసం పాత్ర నిండా నింపుకొని త్రాగుతారు, పరిమళ తైలాలు పూసుకుంటారు, కాని మీరు యోసేపు నాశనం గురించి విచారపడరు.

  16. అయితే హేరోదు పుట్టిన రోజున, హేరోదియ కుమార్తె అతిథుల మధ్య నాట్యంచేసి హేరోదును సంతోషపరిచింది.

  17. కాబట్టి ఆమె ఏమి అడిగినా ఇస్తాను అని అతడు ఒట్టు పెట్టుకుని ప్రమాణం చేశాడు.

  18. ఆమె తన తల్లి ప్రేరేపణతో, “బాప్తిస్మమిచ్చే యోహాను తలను పళ్లెంలో పెట్టి నాకు ఇప్పించు” అని అడిగింది.