Afflicted Saints గురించి బైబిల్ వచనాలు: Apostles
Apostles గురించి వచనాలు
మమ్మల్ని దూషించినప్పుడు, దయతో సమాధానం చెప్తున్నాము. ఇప్పటివరకు మేము భూమి మీద నీచులుగా, లోకంలో పెంటకుప్పగా ఉన్నాము.
కాని, మేము దేవుని సేవకులంగా మాకు మేమే అన్ని విధాలుగా మెప్పించుకుంటున్నాము: సహనంలో సమస్యల్లో కష్టాల్లో దుఃఖాల్లో;
దెబ్బల్లో చెరసాలల్లో అల్లర్లలో కష్టమైన పనిలో నిద్రలేని రాత్రుల్లో ఆకలిలో;
పవిత్రతలో జ్ఞానంలో ఓర్పులో దయలో; పరిశుద్ధాత్మలో నిజమైన ప్రేమలో;
సత్యంగా మాట్లాడంలో దేవుని శక్తిలో; కుడిచేతిలో ఎడమ చేతిలో నీతి అనే ఆయుధాలను కలిగి;
ఘనతలో అవమానంలో నిందల్లో మెప్పుల్లో; యథార్థవంతులం అయినప్పటికి మోసం చేసేవారమనే నింద మామీద వేయబడింది;
తెలిసినవారమైనా తెలియనివారిగా ఎంచబడ్డాము; మరణిస్తున్నా జీవిస్తూనే ఉన్నాం; కొట్టబడ్డాం కాని చంపబడలేదు;
దుఃఖపడినా ఎల్లప్పుడు సంతోషిస్తూనే ఉన్నాం; మేము పేదలం కాని అనేకమందిని ధనవంతులుగా చేస్తున్నాము; ఏమి లేదు కాని సమస్తాన్ని కలిగి ఉన్నాము.