Afflicted Saints గురించి బైబిల్ వచనాలు: Should be resigned
Should be resigned గురించి వచనాలు
కాబట్టి సమూయేలు ఏ విషయం దాచిపెట్టకుండా అంతా అతనితో చెప్పాడు. అది విని ఏలీ, “అది చెప్పింది యెహోవాయే; ఆయన దృష్టికి ఏది మంచిదో ఆయన అదే చేస్తారు” అన్నాడు.
హిజ్కియా యెషయాతో, “నీవు చెప్పిన యెహోవా వాక్కు మంచిదే” అని అన్నాడు. ఎందుకంటే అతడు, “నా జీవితకాలంలో సమాధానం సత్యం ఉంటాయి కదా” అని అనుకున్నాడు.
ఇలా అన్నాడు: “నేను తల్లి గర్భంలోనుండి దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే వెళ్తాను. యెహోవాయే ఇచ్చారు యెహోవాయే తీసుకున్నారు; యెహోవా నామం స్తుతింపబడును గాక.”
ఇదంతా చేసింది మీరే కాబట్టి నేను నోరు తెరవకుండ మౌనంగా ఉన్నాను.