circa 6 BC – AD 30
The Life of Jesus
The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.
ఈ కాలపు వచనాలు
- మార్కు 6:38సుమారు క్రీ.శ. 28
అందుకు ఆయన, “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? వెళ్లి చూడండి” అని అడిగారు. వారు వెళ్లి చూసి, “అయిదు రొట్టెలు, రెండు చేపలు ఉన్నాయి” అన్నారు.
- మార్కు 6:39సుమారు క్రీ.శ. 28
అప్పుడు ఆయన వారందరిని గుంపులుగా పచ్చగడ్డి మీద కూర్చోపెట్టమని శిష్యులతో చెప్పారు.
- మార్కు 6:40సుమారు క్రీ.శ. 28
వారు వంద యాభైల చొప్పున గుంపులుగా కూర్చున్నారు.
- మార్కు 6:41సుమారు క్రీ.శ. 28
అప్పుడు ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను చేతిలో పట్టుకుని ఆకాశం వైపు కళ్ళెత్తి, కృతజ్ఞత చెల్లించి ఆ రొట్టెలను విరిచారు. తర్వాత ప్రజలకు పంచిపెట్టడానికి తన శిష్యులకు ఇచ్చారు. ఆయన ఆ రెండు చేపలను కూడా వారందరికి విభజించారు.
- మార్కు 6:42సుమారు క్రీ.శ. 28
వారందరు తిని తృప్తి పొందారు.
- మార్కు 6:43సుమారు క్రీ.శ. 28
తర్వాత శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను చేప ముక్కలను పన్నెండు గంపల నిండా నింపారు.
- మార్కు 6:44సుమారు క్రీ.శ. 28
తిన్న వారి సంఖ్య అయిదు వేలమంది పురుషులు.
- మార్కు 6:45సుమారు క్రీ.శ. 28
వెంటనే యేసు జనసమూహాన్ని పంపివేస్తూ తన శిష్యులు తనకన్న ముందుగా బేత్సయిదా గ్రామానికి వెళ్లేలా వారిని పడవ ఎక్కించారు.
- మార్కు 6:46సుమారు క్రీ.శ. 28
వారిని పంపివేసిన తర్వాత, ఆయన ప్రార్థన చేసుకోవడానికి కొండపైకి వెళ్లారు.
- మార్కు 6:47సుమారు క్రీ.శ. 28
ఆ రాత్రి సమయాన, ఆ పడవ సరస్సు మధ్యలో ఉంది, ఆయన ఒంటరిగా నేలపైన ఉన్నారు.
- మార్కు 6:48సుమారు క్రీ.శ. 28
ఎదురుగాలి వీస్తుండడంతో, శిష్యులు పడవను చాలా కష్టపడుతూ నడపడం యేసు చూశారు. రాత్రి నాల్గవ జామున ఆయన సరస్సు మీద నడుస్తూ, వారి దగ్గరకు వెళ్లారు.
- మార్కు 6:49సుమారు క్రీ.శ. 28
కాని ఆయన నీళ్ల మీద నడవటం వారు చూసినప్పుడు, భూతం అనుకుని వారు కేకలు వేశారు,
- మార్కు 6:50సుమారు క్రీ.శ. 28
ఎందుకంటే వారందరు ఆయనను చూసి భయపడ్డారు. వెంటనే ఆయన వారితో, “ధైర్యం తెచ్చుకోండి! నేనే, భయపడకండి!” అన్నారు.
- మార్కు 6:51సుమారు క్రీ.శ. 28
అప్పుడు ఆయన వారితో పడవలోనికి ఎక్కారు, అప్పుడు గాలి అణగిపోయింది. వారు ఎంతో ఆశ్చర్యపడ్డారు.
- మార్కు 6:52సుమారు క్రీ.శ. 28
రొట్టెల అద్భుతం యొక్క ప్రాముఖ్యతను వారు ఇంకా అర్థం చేసుకోలేదు; వారి హృదయాలు కఠినమయ్యాయి.
- మార్కు 6:53సుమారు క్రీ.శ. 28
వారు అవతలకు వెళ్లి, గెన్నేసరెతు అనే ప్రాంతంలో దిగారు, అక్కడ లంగరు వేశారు.
- మార్కు 6:54సుమారు క్రీ.శ. 28
వారు పడవ దిగగానే, ప్రజలు యేసును గుర్తుపట్టారు.
- మార్కు 6:55సుమారు క్రీ.శ. 28
వారు ఆ ప్రాంతమంతా పరుగెత్తుకొనిపోయి, ఆయన ఎక్కడ ఉన్నాడని విన్నారో అక్కడికి రోగులను పరుపుల మీద మోసుకొచ్చారు.
- మార్కు 6:56సుమారు క్రీ.శ. 28
యేసు గ్రామాలకు, పట్టణాలకు, పల్లెటూళ్ళకు, ఎక్కడికి వెళ్లినా వారు రోగులను తెచ్చి సంత వీధుల్లో ఉంచారు. ఆయన వస్త్రపు అంచునైనా ముట్టనివ్వండని వారు ఆయనను బ్రతిమాలారు. ఆయనను ముట్టిన వారందరు స్వస్థత పొందారు.
- మార్కు 7:1సుమారు క్రీ.శ. 32
యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు యేసు చుట్టూ చేరారు.
- మార్కు 7:2సుమారు క్రీ.శ. 32
ఆయన శిష్యులలో కొందరు మురికి చేతులతో, అనగా చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తుండడం చూశారు.
- మార్కు 7:3సుమారు క్రీ.శ. 32
పెద్దల సాంప్రదాయం ప్రకారం, పరిసయ్యులు యూదులందరు తమ చేతులు కడుక్కోకుండా భోజనం చేయరు.
- మార్కు 7:4సుమారు క్రీ.శ. 32
వారు సంతవీధులలో నుండి వచ్చిన తర్వాత స్నానం చేయకుండా భోజనం చేయరు. ఇంకా గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను, భోజనబల్లను నీళ్లతో కడగటం లాంటి అనేక ఆచారాలను వారు పాటిస్తారు.
- మార్కు 7:5సుమారు క్రీ.శ. 32
అందుకు పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, “నీ శిష్యులు ఎందుకు పెద్దల సాంప్రదాయాన్ని పాటించకుండా అపవిత్రమైన చేతులతో భోజనం చేస్తున్నారు?” అని యేసును అడిగారు.
- మార్కు 7:6సుమారు క్రీ.శ. 32
అందుకు ఆయన వారితో, “వేషధారులారా, మీ గురించి ఇలా యెషయా ప్రవచించింది నిజమే; అక్కడ వ్రాయబడి ఉన్నట్లు: “ ‘ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తారు కాని వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి.