- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa AD 30–62
The Early Church
Pentecost ignites a movement; Peter, Paul, and countless others carry the gospel from Jerusalem to the ends of the earth.
ఈ కాలపు వచనాలు
- అపొస్తలుల కార్యములు 23:15సుమారు క్రీ.శ. 60
కాబట్టి మీరు న్యాయసభతో కలిసి, పౌలును మరింత వివరంగా విచారణ చేయాలని అతన్ని మీ దగ్గరకు తీసుకురమ్మని అధిపతితో మనవి చేయండి. అతడు ఇక్కడకు రావడానికి ముందే అతన్ని చంపడానికి మేము సిద్ధంగా ఉంటాం” అని చెప్పుకొన్నారు.
- అపొస్తలుల కార్యములు 23:16సుమారు క్రీ.శ. 60
అయితే పౌలు అక్క కుమారుడు ఈ కుట్ర గురించి విన్నప్పుడు, సైనిక కోటలోనికి పోయి ఆ విషయం పౌలుతో చెప్పాడు.
- అపొస్తలుల కార్యములు 23:17సుమారు క్రీ.శ. 60
అప్పుడు పౌలు ఒక శతాధిపతిని పిలిచి, “ఈ యువకుడిని అధిపతి దగ్గరకు తీసుకెళ్లండి; ఇతడు అధిపతికి ఒక మాట చెప్పాలి” అని చెప్పాడు.
- అపొస్తలుల కార్యములు 23:18సుమారు క్రీ.శ. 60
కాబట్టి అతడు ఆ యువకుని అధిపతి దగ్గరకు తీసుకుని వెళ్లాడు. అప్పుడు శతాధిపతి, “ఈ యువకుడు నీకు ఒక మాట చెప్పాలి కాబట్టి ఇతన్ని మీ దగ్గరకు తీసుకెళ్లమని ఖైదీగా ఉన్న పౌలు నన్ను విన్నవించుకున్నాడు” అని అధిపతితో చెప్పాడు.
- అపొస్తలుల కార్యములు 23:19సుమారు క్రీ.శ. 60
అప్పుడు ఆ అధిపతి అతని చేతిని పట్టుకుని ప్రక్కకు తీసుకెళ్లి, “నీవు నాకు ఏమి చెప్పాలని అనుకున్నావు?” అని అడిగాడు.
- అపొస్తలుల కార్యములు 23:20సుమారు క్రీ.శ. 60
అందుకు అతడు, “కొందరు యూదులు పౌలును మరింత వివరంగా విచారణ చేయాలనే వంకతో రేపు న్యాయసభకు అతన్ని పంపించమని మిమ్మల్ని విన్నవించుకొంటారు.
- అపొస్తలుల కార్యములు 23:21సుమారు క్రీ.శ. 60
అయితే మీరు వారికి అనుమతి ఇవ్వకండి, ఎందుకంటే సుమారు నలభై కన్నా ఎక్కువ మంది అతని కోసం పొంచి ఉన్నారు. పౌలును చంపే వరకు ఏమి తినకూడదని వారు ఒట్టు పెట్టుకొన్నారు. ఇప్పుడు వారు మీ దగ్గర అనుమతి కోసం ఎదురుచూస్తూ, సిద్ధంగా ఉన్నారు” అని చెప్పాడు.
- అపొస్తలుల కార్యములు 23:22సుమారు క్రీ.శ. 60
ఆ అధిపతి, “ఈ సంగతిని నాకు చెప్పావని ఎవరికి చెప్పవద్దు” అని హెచ్చరించి ఆ యువకుడిని పంపించాడు.
- అపొస్తలుల కార్యములు 23:23సుమారు క్రీ.శ. 60
తర్వాత ఆ అధిపతి తన శతాధిపతులలో ఇద్దరిని పిలిచి, “రెండువందలమంది సైనికులు, డెబ్బైమంది గుర్రపురౌతులను రెండువందలమంది ఈటెల సైన్య పటాలంతో ఈ రాత్రి తొమ్మిది గంటలకు కైసరయకు వెళ్లడానికి సిద్ధపడండని ఆదేశించాడు.
- అపొస్తలుల కార్యములు 23:24సుమారు క్రీ.శ. 60
అలాగే అధిపతియైన ఫెలిక్స్ దగ్గరకు పౌలును క్షేమంగా తీసుకెళ్లడానికి అతనికి గుర్రాన్ని ఇవ్వండి” అని ఆదేశించాడు.
- అపొస్తలుల కార్యములు 23:25సుమారు క్రీ.శ. 60
అతడు ఈ విధంగా ఒక ఉత్తరం వ్రాశాడు:
- అపొస్తలుల కార్యములు 23:26సుమారు క్రీ.శ. 60
క్లౌదియ లూసియ, మహా గౌరవనీయులైన ఫెలిక్స్ అధిపతికి, నా వందనాలు.
- అపొస్తలుల కార్యములు 23:27సుమారు క్రీ.శ. 60
ఈ వ్యక్తిని యూదులు పట్టుకుని చంపబోతుంటే, ఇతడు రోమీయుడని తెలుసుకొని నేను సైనికులతో వెళ్లి రక్షించాను.
- అపొస్తలుల కార్యములు 23:28సుమారు క్రీ.శ. 60
వారు అతన్ని ఎందుకు నిందిస్తున్నారో తెలుసుకోవడానికి, వారి న్యాయసభ ముందు అతన్ని నిలబెట్టాను.
- అపొస్తలుల కార్యములు 23:29సుమారు క్రీ.శ. 60
వారు అతనిపై వారి ధర్మశాస్త్రానికి సంబంధించిన నిందలను మోపారు కాని, మరణశిక్ష వేయడానికి లేదా చెరసాలలో ఖైదీగా బంధించడానికి తగిన నేరమేదీ అతనిలో లేదు.
- అపొస్తలుల కార్యములు 23:30సుమారు క్రీ.శ. 60
అతన్ని చంపాలని కుట్ర పన్నుతున్నారని నాకు తెలియగానే, ఇతన్ని మీ దగ్గరకు పంపాను అతని మీద నిందమోపే వారిని వారి ఫిర్యాదులను మీ ముందు చెప్పుకోవాలి అని ఆదేశించాను.
- అపొస్తలుల కార్యములు 23:31సుమారు క్రీ.శ. 60
కాబట్టి సైనికులు, తమకు ఇచ్చిన ఆ దేశం ప్రకారం, రాత్రివేళ బయలుదేరి తమతో పౌలును యెరూషలేము నుండి అంతిపత్రి ప్రాంతానికి తీసుకెళ్లారు.
- అపొస్తలుల కార్యములు 23:32సుమారు క్రీ.శ. 60
మరుసటిరోజు గుర్రాల దండును పౌలుతో పాటు పంపి, వారు సైనికుల కోటకు తిరిగి వచ్చారు.
- అపొస్తలుల కార్యములు 23:33సుమారు క్రీ.శ. 60
ఆ గుర్రాల దండు కైసరయకు చేరిన తర్వాత, వారు ఆ ఉత్తరంతో పాటు పౌలును అధిపతికి అప్పగించారు.
- అపొస్తలుల కార్యములు 23:34సుమారు క్రీ.శ. 60
ఆ అధిపతి ఆ ఉత్తరం చదివి, అతడు ఏ ప్రాంతానికి చెందిన వాడు అని అడిగాడు. అతడు కిలికియకు చెందినవాడని తెలుసుకొని,
- అపొస్తలుల కార్యములు 23:35సుమారు క్రీ.శ. 60
“నీ మీద నేరం మోపిన వారు కూడా ఇక్కడకు వచ్చినప్పుడు నీ విషయాన్ని నేను విచారిస్తాను” అని చెప్పి, అతన్ని హేరోదు రాజగృహంలో కాపలా మధ్యలో ఉంచాలని ఆదేశించాడు.
- అపొస్తలుల కార్యములు 24:1సుమారు క్రీ.శ. 60
అయిదు రోజుల తర్వాత ప్రధాన యాజకుడైన అననీయా కొందరు యూదా నాయకులు, తెర్తుల్లు అనే ఒక న్యాయవాదితో కలిసి కైసరయ పట్టణానికి వచ్చి పౌలుకు వ్యతిరేకంగా తమ ఫిర్యాదులను అధిపతికి తెలియజేశారు.
- అపొస్తలుల కార్యములు 24:2సుమారు క్రీ.శ. 60
పౌలును ఫెలిక్స్ ముందు నిలబెట్టిన తర్వాత, తెర్తుల్లు తన ఫిర్యాదులను అధిపతికి ఇలా తెలియజేశాడు: “ఘనత వహించిన ఫెలిక్స్ అధిపతి, మీ పాలనలో మీరు ముందు చూపుతో ఎన్నో సంస్కరణలు ఈ దేశానికి తెచ్చినందుకు మేము చాలా కాలం నుండి శాంతి కలిగి సంతోషంగా ఉన్నాము.
- అపొస్తలుల కార్యములు 24:3సుమారు క్రీ.శ. 60
ఈ విషయాన్ని ప్రతిచోట అన్ని విధాలుగా పూర్ణ కృతజ్ఞతతో మేము అంగీకరిస్తున్నాము.
- అపొస్తలుల కార్యములు 24:4సుమారు క్రీ.శ. 60
మిమ్మల్ని మరింత ఇబ్బందికి గురిచేయకుండా, మేము క్లుప్తంగా చెప్పేదానిని దయచేసి వినండని ప్రాధేయపడుతున్నాను.