కంటెంట్‌కు వెళ్లండి

Gilgal

35 verses

31.8600, 35.5100 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Gilgal ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి సైనికులు దోచుకున్న గొర్రెలలో పశువుల్లో మంచివి, దేవుని కోసం ప్రతిష్ఠించబడిన వాటిని తీసుకువచ్చారు” అని చెప్పాడు.

  2. అయితే సమూయేలు, “నీ కత్తి స్త్రీలకు సంతానం లేకుండా చేసినట్లు, స్త్రీల మధ్యలో నీ తల్లికి సంతానం లేకుండా పోతుంది” అని చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిలో అగగును ముక్కలుగా నరికాడు.

  3. రాజు తిరిగి రావడానికి బయలుదేరి యొర్దాను ఒడ్డుకు చేరుకున్నాడు. యూదా వారు రాజును కలవడానికి, రాజును నది ఇవతలికి తీసుకురావడానికి గిల్గాలుకు వచ్చారు.

  4. రాజు గిల్గాలు వెళ్లినప్పుడు రాజుతో పాటు కింహాము కూడా వెళ్లాడు. యూదా సైన్యమంతా ఇశ్రాయేలు సైన్యంలో సగం మంది రాజుతో పాటు వచ్చారు.

  5. “ఇశ్రాయేలూ, నీవు వ్యభిచారం చేసినా సరే, యూదా అపరాధం చేయకూడదు. “గిల్గాలుకు వెళ్లవద్దు; బేత్-ఆవెనుకు వెళ్లవద్దు. ‘యెహోవా జీవం తోడు’ అని ఒట్టు పెట్టుకోవద్దు.

  6. “గిల్గాలులో వారి చెడుతనం అంతటిని బట్టి, అక్కడ వారిని ద్వేషిస్తున్నాను. వారు పాప క్రియలనుబట్టి, నేను వారిని నా మందిరంలో నుండి వెళ్లగొడతాను. నేను ఇక ఎన్నడూ వారిని ప్రేమించను; వారి నాయకులంతా తిరుగుబాటుదారులు.

  7. గిలాదు చెడ్డదా? దాని ప్రజలు వ్యర్థమైన వారు! వారు గిల్గాలులో కోడెలను బలి అర్పిస్తున్నారా? వారి బలిపీఠాలు దున్నబడిన పొలంలోని రాళ్ల కుప్పల్లా ఉన్నాయి.

  8. “బేతేలుకు వెళ్లి పాపం చేయండి; గిల్గాలుకు వెళ్లి ఇంకా ఎక్కువ పాపం చేయండి. ప్రతి ఉదయం మీ బలులు తీసుకరండి, మూడు సంవత్సరాలకు ఒకసారి మీ దశమ భాగాల్ని తీసుకురండి.

  9. బేతేలును ఆశ్రయించకండి; గిల్గాలు క్షేత్రాలకు వెళ్లకండి, బెయేర్షేబకు ప్రయాణించకండి. గిల్గాలు ప్రజలు ఖచ్చితంగా బందీలుగా వెళ్తారు, విపత్తులతో బేతేలు శూన్యంగా మారుతుంది.”

  10. నా ప్రజలారా! మోయాబు రాజైన బాలాకు ఎలా కుట్ర చేశాడో, బెయోరు కుమారుడైన బిలాము అతనికి ఎలా జవాబిచ్చాడో జ్ఞాపకం చేసుకోండి. యెహోవా నీతి క్రియలు మీరు గ్రహించేలా షిత్తీము నుండి గిల్గాలు వరకు జరిగిన మీ ప్రయాణం జ్ఞాపకం చేసుకోండి.”