కంటెంట్‌కు వెళ్లండి

Beersheba

32 verses · 2 known names

ఇలా కూడా పిలుస్తారు: Beer-sheba

31.2400, 34.8400 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Beersheba ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. కాబట్టి దావీదు యోవాబుతో, సైన్యాధిపతులతో, “మీరు వెళ్లి బెయేర్షేబ నుండి దాను వరకు ఉన్న ఇశ్రాయేలీయులను లెక్కించండి. వారి సంఖ్య నాకు తెలిసేలా ఆ వివరాలు నా దగ్గరకు తీసుకురండి” అని చెప్పాడు.

  2. యెహోషాపాతు యెరూషలేములో ఉంటూ, బెయేర్షేబ నుండి ఎఫ్రాయిం కొండసీమవరకు ప్రజల మధ్యకు వెళ్లి వారిని మరల వారి పూర్వికుల దేవుడైన యెహోవా వైపుకు త్రిప్పాడు.

  3. యోవాషు రాజైనప్పుడు అతని వయస్సు ఏడు సంవత్సరాలు. అతడు యెరూషలేములో నలభై సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు జిబ్యా; ఆమె బెయేర్షేబకు చెందినది.

  4. ప్రజలంతా యెరూషలేముకు వచ్చి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరుపుకోవాలని బెయేర్షేబ నుండి దాను వరకు ఇశ్రాయేలు అంతటా ప్రకటించాలని వారు నిర్ణయించుకున్నారు. చాలాకాలంగా వ్రాయబడిన ప్రకారం పెద్ద సంఖ్యలో ప్రజలు పండుగ జరుపుకోలేదు.

  5. హజర్-షువలులో, బెయేర్షేబలో వాటి చుట్టుప్రక్కల గ్రామాల్లో,

  6. జానోహలో, అదుల్లాములో వాటి గ్రామాల్లో, లాకీషులో దానికి పొలాల్లో అజేకాలో దాని చుట్టుప్రక్కల గ్రామాల్లో నివసించారు. వారు బెయేర్షేబ నుండి హిన్నోము లోయవరకు నివసించారు.

  7. బేతేలును ఆశ్రయించకండి; గిల్గాలు క్షేత్రాలకు వెళ్లకండి, బెయేర్షేబకు ప్రయాణించకండి. గిల్గాలు ప్రజలు ఖచ్చితంగా బందీలుగా వెళ్తారు, విపత్తులతో బేతేలు శూన్యంగా మారుతుంది.”