కంటెంట్‌కు వెళ్లండి

Paul

179 వచనాలు

ఇలా కూడా పిలుస్తారు: Saul, Mercurius

Paul ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అందుకు పౌలు, “సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు; అయితే ‘మీ ప్రజల అధికారులను నిందించవద్దు అని’ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉంది” అన్నాడు.

  2. అక్కడ ఉన్నవారిలో కొందరు సద్దూకయ్యులు మరికొందరు పరిసయ్యులు ఉన్నారని పౌలు గ్రహించి, ఆ న్యాయసభలోని వారితో, “నా సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతానంగా పుట్టాను. నేను మృతులకు పునరుత్థానం ఉందనే నిరీక్షణను బట్టి ఈ విచారణ పాలయ్యాను” అని బిగ్గరగా చెప్పాడు.

  3. ఈ విభేదం మరింత హింసాత్మకంగా మారినందుకు పౌలును ముక్కలుగా చీల్చివేస్తారేమో అని ఆ అధిపతి భయపడ్డాడు. అతడు సైనికులను వెళ్లి వారి మధ్యలో నుండి పౌలును బలవంతంగా పట్టుకుని, సైనికుల కోటలోకి తీసుకుని రమ్మని ఆదేశించాడు.

  4. ఆ రాత్రి ప్రభువు పౌలు దగ్గర నిలబడి, “ధైర్యం తెచ్చుకో! యెరూషలేములో నా గురించి నీవు సాక్ష్యమిచ్చినట్టే రోమాలో కూడా నీవు సాక్ష్యమివ్వాలి” అని చెప్పారు.

  5. మరుసటిరోజు ఉదయం కొందరు యూదులు ఒక కుట్రపన్ని, తాము పౌలును చంపే అంతవరకు ఏమి తినకూడదు త్రాగకూడదని ఒట్టు పెట్టుకొన్నారు.

  6. వారు ముఖ్య యాజకులు యూదా పెద్దల దగ్గరకు వెళ్లి, “మేము పౌలును చంపే వరకు ఏమి తినకూడదని ఒట్టు పెట్టుకున్నాము.

  7. అయితే పౌలు అక్క కుమారుడు ఈ కుట్ర గురించి విన్నప్పుడు, సైనిక కోటలోనికి పోయి ఆ విషయం పౌలుతో చెప్పాడు.

  8. అప్పుడు పౌలు ఒక శతాధిపతిని పిలిచి, “ఈ యువకుడిని అధిపతి దగ్గరకు తీసుకెళ్లండి; ఇతడు అధిపతికి ఒక మాట చెప్పాలి” అని చెప్పాడు.

  9. కాబట్టి అతడు ఆ యువకుని అధిపతి దగ్గరకు తీసుకుని వెళ్లాడు. అప్పుడు శతాధిపతి, “ఈ యువకుడు నీకు ఒక మాట చెప్పాలి కాబట్టి ఇతన్ని మీ దగ్గరకు తీసుకెళ్లమని ఖైదీగా ఉన్న పౌలు నన్ను విన్నవించుకున్నాడు” అని అధిపతితో చెప్పాడు.

  10. అందుకు అతడు, “కొందరు యూదులు పౌలును మరింత వివరంగా విచారణ చేయాలనే వంకతో రేపు న్యాయసభకు అతన్ని పంపించమని మిమ్మల్ని విన్నవించుకొంటారు.

  11. అలాగే అధిపతియైన ఫెలిక్స్ దగ్గరకు పౌలును క్షేమంగా తీసుకెళ్లడానికి అతనికి గుర్రాన్ని ఇవ్వండి” అని ఆదేశించాడు.

  12. కాబట్టి సైనికులు, తమకు ఇచ్చిన ఆ దేశం ప్రకారం, రాత్రివేళ బయలుదేరి తమతో పౌలును యెరూషలేము నుండి అంతిపత్రి ప్రాంతానికి తీసుకెళ్లారు.

  13. ఆ గుర్రాల దండు కైసరయకు చేరిన తర్వాత, వారు ఆ ఉత్తరంతో పాటు పౌలును అధిపతికి అప్పగించారు.

  14. అయిదు రోజుల తర్వాత ప్రధాన యాజకుడైన అననీయా కొందరు యూదా నాయకులు, తెర్తుల్లు అనే ఒక న్యాయవాదితో కలిసి కైసరయ పట్టణానికి వచ్చి పౌలుకు వ్యతిరేకంగా తమ ఫిర్యాదులను అధిపతికి తెలియజేశారు.

  15. అధిపతి పౌలును మాట్లాడమని సైగ చేసినప్పుడు, అతడు ఈ విధంగా సమాధాన ఇచ్చాడు: “మీరు అనేక సంవత్సరాలుగా ఈ దేశానికి న్యాయాధికారిగా ఉన్నారని నాకు తెలుసు కాబట్టి నేను సంతోషంగా నా సమాధానాన్ని తెలియజేయగలను.

  16. అతడు పౌలును కాపలాలో ఉంచి, అతని అవసరాలను తీర్చడానికి అతని స్నేహితుల్లో ఎవరిని ఆటంకపరచవద్దు అని శతాధిపతిని ఆదేశించాడు.

  17. కొన్ని రోజుల తర్వాత ఫెలిక్స్ యూదురాలైన తన భార్య ద్రుసిల్లతో కలసి వచ్చాడు. అతడు పౌలును పిలిపించి యేసు క్రీస్తులోని విశ్వాసాన్ని గురించి అతడు బోధించిన మాటలను విన్నాడు.

  18. పౌలు తనకు లంచం ఇస్తాడేమోనని ఆశించి, తరచుగా అతన్ని పిలిపిస్తూ అతనితో మాట్లాడేవాడు.

  19. రెండు సంవత్సరాల తర్వాత, ఫెలిక్స్ స్థానంలో పోర్కియస్ ఫేస్తు అధిపతిగా నియమించబడ్డాడు. అయితే ఫెలిక్స్ యూదులకు ఉపకారం చేయాలని పౌలును చెరసాలలోనే ఉంచాడు.

  20. అక్కడ ముఖ్య యాజకులు యూదా నాయకులు అతన్ని కలిసి పౌలుకు వ్యతిరేకంగా తాము చేసిన ఫిర్యాదును తెలియజేశారు.

  21. అందుకు ఫేస్తు, “పౌలు కైసరయలో ఉన్నాడు, నేను త్వరలో అక్కడికి వెళ్తున్నాను.

  22. వారితో ఎనిమిది, పది రోజులు గడిపిన తర్వాత ఫేస్తు అధిపతి కైసరయకు వెళ్లాడు. మరుసటిరోజు అతడు న్యాయసభను ఏర్పాటు చేసి పౌలును తన ముందుకు తీసుకుని రమ్మని ఆదేశించాడు.

  23. పౌలు లోపలికి వచ్చినప్పుడు, యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలబడ్డారు. అతని మీద అనేక తీవ్ర ఆరోపణలు చేశారు, కాని వాటిని రుజువు చేయలేకపోయారు.

  24. ఫేస్తు యూదులకు అనుకూలంగా ఉండాలని భావిస్తూ పౌలుతో, “నీవు యెరూషలేముకు వచ్చి అక్కడ నా ముందు వీరు చేసిన ఫిర్యాదుల గురించిన విచారణకు రావడానికి సిద్ధంగా ఉన్నావా?” అని అడిగాడు.

  25. అందుకు పౌలు, “నేను ఇప్పుడు కైసరు న్యాయసభలో నిలబడి ఉన్నాను, నన్ను విచారణ చేయవలసిన స్థలం ఇదే. నేను యూదుల పట్ల ఏ తప్పు చేయలేదని మీకు బాగా తెలుసు.