కంటెంట్‌కు వెళ్లండి

Jesus

3,872 వచనాలు · 6 కుటుంబ సభ్యులు

ఇలా కూడా పిలుస్తారు: Jesus Christ, Immanuel, Emmanuel, Christ

Jesus ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మీరు కూడా సత్య వాక్యాన్ని అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తులో విశ్వాసం ఉంచినప్పుడు వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మచేత ముద్రించబడి ఉన్నారు.

  2. దేవుని మహిమను స్తుతించడానికి ఆయన స్వాస్థ్యమైన వారికి విడుదల కలిగే వరకు ఈ ఆత్మ మన వారసత్వానికి హామీగా ఉన్నాడు.

  3. ఈ కారణాన్ని బట్టి, ప్రభువైన యేసులో మీ విశ్వాసం గురించి, దేవుని ప్రజలందరి పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ గురించి నేను విన్నప్పటి నుండి,

  4. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియైన తండ్రిని మీరు తెలుసుకోవడానికి జ్ఞానం ప్రత్యక్షతగల ఆత్మను మీకు ఇవ్వాలని నా ప్రార్థనలలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను.

  5. మిమ్మల్ని పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణలో, ఆయన పరిశుద్ధ ప్రజల్లో ఆయన వారసత్వం యొక్క మహిమైశ్వర్యం ఎలాంటిదో, మనం నమ్మిన ఆయన శక్తి యొక్క అపరిమితమైన ప్రభావం ఎంత గొప్పదో మీరు తెలుసుకోవడానికి మీ మనోనేత్రాలు వెలిగించబడాలని ప్రార్థిస్తున్నాను.

  6. And what is the exceeding greatness of his power to us-ward who believe, according to the working of his mighty power,

  7. ఆయన ప్రభావవంతమైన శక్తితోనే క్రీస్తును మృతులలో నుండి లేపి, సమస్త ఆధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే, ఈ యుగంలోను రాబోవు యుగాల్లోను పేరుగాంచిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకంలో తన కుడి వైపున ఆయనను కూర్చోబెట్టుకున్నారు.

  8. దేవుడు సమస్తాన్ని క్రీస్తు పాదాల క్రింద ఉంచి, సమస్తానికి పైన సంఘానికి ఆయనను శిరస్సుగా నియమించారు.

  9. సంఘం అనగా ఆయన శరీరం; సమస్తాన్ని పూర్తిగా నింపుతున్న ఆయన యొక్క పరిపూర్ణత.

  10. మీరైతే, మీ అతిక్రమాలలో పాపాల్లో చచ్చినవారిగా ఉండి,

  11. మనం మన అతిక్రమాలలో పాపాల్లో చచ్చినవారిగా ఉండగా, క్రీస్తుతో పాటు మనల్ని బ్రతికించారు. ఆయన కృప చేత మీరు రక్షించబడ్డారు.

  12. దేవుడు క్రీస్తుతో పాటు మనల్ని కూడా లేపి, పరలోకం మండలాల్లో క్రీస్తు యేసుతో పాటు కూర్చోబెట్టారు.

  13. రాబోయే యుగాలలో ఆయన తన కృప యొక్క సాటిలేని ఐశ్వర్యాన్ని చూపించటానికి, క్రీస్తు యేసునందు మన పట్ల ఆయన దయలో వ్యక్తపరిచారు.

  14. ఎందుకంటే దేవుడు మన కోసం ముందుగా సిద్ధపరచిన మంచి క్రియలు చేయడానికి క్రీస్తు యేసునందు సృష్టింపబడిన మనం దేవుని చేతిపనియై ఉన్నాము.

  15. ఆ సమయంలో మీరు క్రీస్తు నుండి వేరుగా ఉన్నారు, ఇశ్రాయేలులో పౌరసత్వం లేనివారిగా, వాగ్దాన నిబంధనలకు విదేశీయులుగా, నిరీక్షణ లేనివారిగా, లోకంలో దేవుడు లేనివారిగా ఉండేవారు.

  16. ఒకప్పుడు దూరంగా ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తు యేసు రక్తాన్ని బట్టి దేవునికి దగ్గరయ్యారు.

  17. రెండు సమూహాలను ఒకటిగా చేసి, శత్రుత్వం యొక్క అడ్డు గోడను నాశనం చేసిన ఆయనే మన సమాధానం.

  18. అంటే, యేసు క్రీస్తు తన శరీరంలో మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను నియమాలను కొట్టివేసారు. ఈ ఇద్దరిని కలిపి తనలో ఒక నూతన మానవున్ని సృజించి ఆ విధంగా సమాధానపరచడం ఆయన ఉద్దేశము.

  19. ఈ ఇరువురిని తన సిలువ ద్వారా ఏక శరీరులుగా దేవునితో సమాధానపరచి, వారి మధ్య ఉన్న శత్రుత్వాన్ని చంపేశారు.

  20. ఆయన ద్వారానే మనం ఇద్దరం ఒక్క ఆత్మలో తండ్రి సన్నిధికి చేరగలుగుతున్నాము.

  21. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడియున్నారు.

  22. ఆ కట్టడమంతా ఆయనలో ఒకటిగా అమర్చబడి ప్రభువులో పరిశుద్ధాలయంగా వృద్ధిపొందుతూ ఉంది.

  23. ఈ కారణంచేత, యూదేతరులైన మీరు రక్షింపబడాలని, పౌలు అనే నేను క్రీస్తు యేసు సువార్త విషయంలో ఖైదీనై ఉన్నాను.

  24. అదేమిటంటే, ఇంతకుముందే మీకు క్లుప్తంగా వ్రాసినట్లు, క్రీస్తు గురించిన మర్మం నాకు ప్రత్యక్షపరచబడింది.

  25. మీరు దానిని చదివినట్లైతే ఆ క్రీస్తు మర్మాన్ని గురించి నాకున్న పరిజ్ఞానాన్ని మీరు తెలుసుకోగలరు.