కంటెంట్‌కు వెళ్లండి

Jesus

3,872 వచనాలు · 6 కుటుంబ సభ్యులు

ఇలా కూడా పిలుస్తారు: Jesus Christ, Immanuel, Emmanuel, Christ

Jesus ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఈ మర్మం, ఆత్మ వలన ఇప్పుడు దేవుని పరిశుద్ధ అపొస్తలులకు ప్రవక్తలకు తెలియపరచబడినట్లుగా ఇతర తరాలలోని వారికి తెలియపరచబడలేదు.

  2. ఈ రహస్యం ఏంటంటే, సువార్త ద్వారా యూదేతరులు ఇశ్రాయేలుతో కలిసి వారసులు, ఒకే శరీరంలోని సభ్యులు, క్రీస్తు యేసులోని వాగ్దానంలో భాగస్వాములు.

  3. పరిశుద్ధులలో నేను అత్యంత అల్పున్ని కానీ లెక్కించలేని ఆశీర్వాదాలు క్రీస్తు యేసులో ఉన్నాయని యూదేతరులకు ప్రకటించడానికి దేవుడు తన దయతో నన్ను ఏర్పరచుకున్నారు.

  4. సమస్తాన్ని సృజించిన దేవుడు అనాది నుండి దాచబడి ఉన్న ఆ మర్మాన్ని, ప్రజలందరికి తెలియజేయడానికి ఆ కృపను నాకు అనుగ్రహించారు.

  5. అందుకని దేవుడు తన నిత్య సంకల్పాన్ని మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నెరవేర్చారు.

  6. ఈ విధంగా ఇప్పుడు ఆయనలో ఉంచిన విశ్వాసం ద్వారా స్వేచ్ఛగా ధైర్యంగా దేవుని సమీపించగలము.

  7. ఈ కారణాన్ని బట్టి, తండ్రి ఎదుట నేను మోకరిస్తున్నాను,

  8. తన మహిమ సమృద్ధి నుండి ఆయన మిమ్మల్ని మీ అంతరంగంలో తన ఆత్మ ద్వారా శక్తితో బలపరచాలని,

  9. అప్పుడు విశ్వాసం ద్వారా మీ హృదయాల్లో క్రీస్తు నివసించాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు ప్రేమలో వేరుపారి స్థిరపడాలని,

  10. సమస్త జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటూ దేవుని పరిపూర్ణతతో మీరు పూర్తిగా నింపబడాలని నేను ప్రార్థిస్తున్నాను.

  11. మనలో పని చేసి తన శక్తినిబట్టి మనం అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే కొలవలేనంత అత్యధికంగా చేయడానికి శక్తిగల దేవునికి,

  12. సంఘంలోనూ క్రీస్తు యేసులోనూ తరతరములు మహిమ నిరంతరం కలుగును గాక ఆమేన్.

  13. మీరు పిలువబడిన పిలుపుకు యోగ్యులుగా నడుచుకోవాలని ప్రభువు యొక్క ఖైదీనైన నేను మిమ్మల్ని కోరుతున్నాను.

  14. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే;

  15. అయితే అందరికి క్రీస్తు నిర్ణయించిన పరిమాణం చొప్పున కృప ఇవ్వబడింది.

  16. అందుకే, ఈ విధంగా చెప్పబడింది: “ఆయన ఆరోహణమైనప్పుడు, ఆయన అనేకమందిని చెరపట్టి తీసుకెళ్లి, తన ప్రజలకు బహుమానాలను అనుగ్రహించారు.”

  17. ఆయన ఆరోహణం అయ్యారంటే ఆయన క్రిందకు, భూమి మీదకు దిగివచ్చారని దాని అర్థం కాదా?

  18. క్రిందకు దిగివచ్చినవాడే, సమస్త ప్రపంచాన్ని నింపడానికి ఆకాశ మండలాలన్నింటి కంటే పైగా ఆరోహణమయ్యారు.

  19. మనం విశ్వాసంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఐక్యతను పొందేవరకు, క్రీస్తు యొక్క పరిపూర్ణతకు సమానమైన పరిపూర్ణత గల వారం అయ్యేవరకు క్రీస్తు శరీరమైన సంఘం కట్టబడేలా తన ప్రజలను పరిచర్య కోసం సిద్ధపరచడానికి, క్రీస్తే అపొస్తలులను, ప్రవక్తలను, సువార్తికులను, కాపరులను, బోధకులను అనుగ్రహించారు.

  20. For the perfecting of the saints, for the work of the ministry, for the edifying of the body of Christ:

  21. Till we all come in the unity of the faith, and of the knowledge of the Son of God, unto a perfect man, unto the measure of the stature of the fulness of Christ:

  22. ప్రేమ కలిగి సత్యం మాట్లాడుతూ క్రీస్తును శిరస్సుగా కలిగిన పరిపూర్ణ శరీరంలా ఉండడానికి మనం అన్ని విషయాల్లో ఎదుగుదాము.

  23. కాబట్టి మీరు, ఇకమీదట దేవుని భయంలేని యూదేతరులు నడుచుకొనునట్లు వ్యర్థమైన ఆలోచనలతో నడుచుకొనకూడదని ప్రభువు ఇచ్చిన అధికారంతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.

  24. అయితే మీరు క్రీస్తు గురించి విన్నప్పుడు యేసులో ఉన్న సత్యానికి అనుగుణంగా ఆయనలో బోధించబడినప్పుడు మీరు నేర్చుకున్న జీవన విధానం ఇది కాదు.

  25. If so be that ye have heard him, and have been taught by him, as the truth is in Jesus: