కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. కాని నీవు జాగ్రత్తగా దేవుని వెదికితే, సర్వశక్తిమంతుడైన దేవుని వేడుకుంటే,

  2. నీవు పవిత్రంగా యథార్థంగా ఉంటే, ఇప్పుడే ఆయన నీ పక్షాన లేస్తారు, నీ సంపన్న స్థితిని తిరిగి ఇస్తారు.

  3. దేవుడిని మరచిపోయే వారందరి గతి ఇలాగే ఉంటుంది; భక్తిహీనుల ఆశ అడుగంటిపోతుంది.

  4. “దేవుడు నిర్దోషిని త్రోసివేయరు దుర్మార్గుల చేతులను బలపరచరు.

  5. ఆయన నీ నోటిని నవ్వుతో, నీ పెదవులను ఆనంద ధ్వనులతో నింపుతారు.

  6. “అవును, ఇదంతా నిజమని నాకు తెలుసు. అయితే నశించే మానవులు దేవుని ఎదుట తమ నిర్దోషత్వాన్ని ఎలా నిరూపించుకోగలరు?

  7. వారు ఆయనతో వాదించాలనుకుంటే, వేయి ప్రశ్నలలో ఒక్కదానికైనా వారు ఆయనకు జవాబు చెప్పలేరు.

  8. ఆయన అత్యంత జ్ఞానవంతుడు మహాబలవంతుడు. ఆయనతో పోరాడి సురక్షితంగా వచ్చినవారు ఎవరు?

  9. ఆయన పర్వతాలను వాటికి తెలియకుండానే కదిలిస్తారు, కోపంతో వాటిని తలక్రిందులు చేస్తారు.

  10. ఆయన నా ప్రక్కన నుండే వెళ్తారు కాని నేను ఆయనను చూడలేను, ఆయన వెళ్తున్నప్పుడు ఆయనను గమనించలేను.

  11. ఆయన లాక్కుంటే ఎవరు ఆయనను ఆపగలరు? ‘మీరు ఏమి చేస్తున్నారు?’ అని ఆయనను ఎవరు అడగగలరు?

  12. దేవుడు తన కోపాన్ని అణచుకోరు; రాహాబు సహాయకులు ఆయన పాదాల దగ్గర లొంగిపోయారు.

  13. “కాబట్టి దేవునికి నేను ఎలా జవాబివ్వగలను? ఆయనతో వాదించడానికి ఎలాంటి పదాలను నేను ఉపయోగించగలను?

  14. నేను పిలిచినప్పుడు ఆయన సమాధానం ఇచ్చిన కూడా, ఆయన నా మాట వింటారని నేను నమ్మలేను.

  15. తుఫానుతో ఆయన నన్ను నలుగగొడతారు, ఏ కారణం లేకుండా నా గాయాలను ఎక్కువ చేస్తారు.

  16. బలం విషయానికొస్తే, ఆయన మహాబలవంతుడు! న్యాయం విషయానికొస్తే, ఆయనకు ప్రతివాదిగా ఎవరు ఉండగలరు?

  17. ఉపద్రవం అకస్మాత్తుగా వచ్చి నాశనం చేస్తే, నిర్దోషుల దురవస్థను చూసి దేవుడు వెక్కిరిస్తారు.

  18. భూమి దుష్టుల చేతికి ఇవ్వబడినప్పుడు, ఆయన దాని న్యాయాధిపతుల కళ్లను మూసివేస్తారు. ఆయన కాక ఈ పని ఇంకెవరు చేస్తారు?

  19. నా బాధలన్నిటికి భయపడతాను ఎందుకంటే మీరు నన్ను నిర్దోషిగా ప్రకటించరని నాకు తెలుసు.

  20. మీరు నన్ను బురద గుంటలో ముంచుతారు, అప్పుడు నా బట్టలే నన్ను అసహ్యించుకుంటాయి.

  21. “నేను జవాబివ్వడానికి, ఒకరిపై ఒకరం న్యాయస్థానంలో పోరాడడానికి దేవుడు నాలాంటి మనిషి కాదు.

  22. దేవుని దండాన్ని నా మీద నుండి తీసివేయగలిగిన వారు ఉంటే బాగుండేది, అప్పుడు ఆయన భయం నన్ను ఇక బెదిరించదు.

  23. అప్పుడు నిర్భయంగా నేను ఆయనతో మాట్లాడగలను, కాని ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నేను అలా చేయలేను.

  24. నేను దేవునితో ఇలా అంటాను: నన్ను దోషిగా భావించకండి, కాని నా మీద మీకున్న ఆరోపణలు నాకు చెప్పండి.

  25. నన్ను హింసించడం, మీ చేతిపనిని త్రోసివేయడం, దుర్మార్గుల ప్రణాళికలను చూసి సంతోషించడం మీకు ఇష్టమా?