కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దావీదు తన కుమారుడైన సొలొమోనుతో ఇంకా మాట్లాడుతూ ఇలా చెప్పాడు, “దృఢంగా, ధైర్యంగా ఉంటూ పని చేయి. నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉంటారు కాబట్టి భయపడకు దిగులుపడకు. యెహోవా ఆలయ సేవకు సంబంధించిన పనులన్నీ ముగిసేవరకు ఆయన నిన్ను ఏమాత్రం విడిచిపెట్టరు.

  2. దేవుని ఆలయ సేవ అంతటి కోసం యాజకులు, లేవీయుల విభాగాల ప్రకారం ఏర్పాటయ్యారు. ఈ పనులన్నీ చేయడానికి రకరకాల పనులలో నైపుణ్యం గలవారు మనస్పూర్తిగా నీకు సహాయం చేస్తారు. అధిపతులు, ప్రజలందరూ నీ ప్రతి ఆజ్ఞకు లోబడతారు.”

  3. అప్పుడు రాజైన దావీదు సమావేశంలో ఉన్నవారందరితో ఇలా అన్నాడు: “దేవుడు ఎన్నుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకా చిన్నవాడు, అనుభవం లేనివాడు. మందిరం నిర్మించేది మనుష్యునికి కాదు, దేవుడైన యెహోవా కోసం, కాబట్టి పని చాలా గొప్పది.

  4. నాకున్న శక్తికొలది నా దేవుని మందిరానికి కావలసిన బంగారు పనికి బంగారాన్ని, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, చెక్క పనికి చెక్కను, పెద్ద మొత్తంలో గోమేధికపురాళ్లను, వైడూర్యాలను, రకరకాల రంగుల రాళ్లను, అన్ని రకాల జాతి మేలిమి రాళ్లను, పాలరాతిని సమృద్ధిగా సమకూర్చి పెట్టాను.

  5. పరిశుద్ధ మందిరం కోసం నేను సమకూర్చినవన్నీ కాకుండా, ఇప్పుడు నా దేవుని మందిరం పట్ల నాకున్న నిబద్ధతను చూపించడానికి నా సొంత ఖజానాలో ఉన్న బంగారాన్ని, వెండిని, నా దేవుని మందిరానికి ఇస్తున్నవి:

  6. The gold for things of gold, and the silver for things of silver, and for all manner of work to be made by the hands of artificers. And who then is willing to consecrate his service this day unto the LORD?

  7. వారు దేవుని మందిరం పనికి అయిదువేల తలాంతుల బంగారాన్ని, పదివేల డారిక్కుల బంగారాన్ని, పదివేల తలాంతుల వెండిని, పద్దెనిమిది వేల తలాంతుల ఇత్తడిని, లక్ష తలాంతుల ఇనుమును ఇచ్చారు.

  8. ప్రశస్తమైన రాళ్లు ఉన్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిర ఖజానాకు అధికారిగా ఉన్న గెర్షోనీయుడైన యెహీయేలుకు ఇచ్చారు.

  9. తమ నాయకులు హృదయమంతటితో స్వేచ్ఛగా యెహోవాకు సమర్పించడం చూసి ప్రజలు వారిని బట్టి సంతోషించారు. రాజైన దావీదు కూడా చాలా సంతోషించాడు.

  10. దావీదు, అక్కడ సమావేశమైన వారందరి ఎదుట యెహోవాను ఇలా స్తుతించాడు: “యెహోవా, మా తండ్రియైన ఇశ్రాయేలు దేవా! యుగయుగాల వరకు మీకు స్తుతి కలుగును గాక.

  11. యెహోవా! మహాత్మ్యం, ప్రభావం, వైభవం, తేజస్సు, మహిమ మీకే చెందుతాయి. ఎందుకంటే భూమ్యాకాశాల్లో ఉన్నవన్నీ మీవే. యెహోవా రాజ్యం మీదే; మీరు అందరి మీద అధిపతిగా హెచ్చింపబడ్డారు.

  12. ఐశ్వర్యం, ఘనత మీ మూలంగా వస్తాయి; మీరు సమస్తానికి పాలకులు. అందరిని హెచ్చించి, బలపరచడానికి మీ చేతిలో బలం, శక్తి ఉన్నాయి.

  13. మా దేవా! మేము మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తున్నాము.

  14. “అయితే, ఇంత ధారాళంగా ఇచ్చే సామర్థ్యం కలిగి ఉండడానికి నేను ఏపాటివాన్ని? నా ప్రజలు ఏపాటివారు? అన్నీ మీ నుండే వస్తాయి. మీ చేతి నుండి వచ్చిన దానిలో నుండే మేము మీకు ఇచ్చాము.

  15. మా పూర్వికుల్లా మేము మీ దృష్టిలో విదేశీయులం, అపరిచితులము. భూమిమీద మా జీవితకాలం నిరీక్షణలేని నీడలాంటిది.

  16. యెహోవా, మా దేవా, నీ పరిశుద్ధ నామం కోసం మందిరాన్ని కట్టించడానికి మేము సమకూర్చిన ఈ సంపదంతా మీ చేతి నుండి వచ్చేదే, దానిలో సమస్తం మీకు చెందినదే.

  17. నా దేవా! మీరు హృదయాన్ని పరిశోధిస్తారని, నిజాయితీ అంటే మీకు ఇష్టమని నాకు తెలుసు. నేను ఇవన్నీ ఇష్టపూర్వకంగా నిజాయితితో ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీ ప్రజలు కూడా మీకు ఇష్టపూర్వకంగా ఇవ్వడం చూసి నేను సంతోషిస్తున్నాను.

  18. యెహోవా! మా పూర్వికులైన అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఈ ఆశలు, తలంపులు మీ ప్రజల హృదయాల్లో ఎప్పుడూ ఉండేలా, వారి హృదయాలు మీ పట్ల నమ్మకంగా ఉండేలా చేయండి.

  19. నా కుమారుడైన సొలొమోను మీ ఆజ్ఞలను, శాసనాలను, నియమాలను పాటిస్తూ, నేను ఆలయ నిర్మాణం కోసం సమకూర్చిన వాటితో అతడు కట్టించడానికి అతడు పూర్ణహృదయంతో భక్తి కలిగి ఉండునట్లు చేయండి.”

  20. తర్వాత దావీదు సమావేశమైన వారందరితో, “మీ దేవుడైన యెహోవాను స్తుతించండి” అని చెప్పాడు. అప్పుడు వారందరూ తమ పూర్వికుల దేవుడైన యెహోవాను స్తుతించి, యెహోవా ఎదుట, రాజు ఎదుట తలలు వంచి, సాగిలపడ్డారు.

  21. మరుసటిరోజు వారు యెహోవాకు అర్పణలు ఇచ్చి దహనబలులు అర్పించారు: వెయ్యి ఎద్దులు, వెయ్యి పొట్టేళ్లు, వెయ్యి మగ గొర్రెపిల్లలు, వాటితో పాటు పానార్పణలను ఇశ్రాయేలీయులందరి పక్షాన సరిపడా ఇతర బలులు అర్పించారు.

  22. ఆ రోజు వారు యెహోవా సన్నిధిలో చాలా ఆనందంతో విందు చేసుకున్నారు. అప్పుడు వారు దావీదు కుమారుడైన సొలొమోనుకు రెండవసారి పట్టాభిషేకం చేసి, యెహోవా సన్నిధిలో అతన్ని పాలకునిగా, సాదోకును యాజకునిగా అభిషేకించారు.

  23. కాబట్టి సొలొమోను రాజుగా తన తండ్రియైన దావీదు స్థానంలో యెహోవా రాజ్యసింహాసనం మీద కూర్చున్నాడు. అతడు అన్నిటిలో వృద్ధి చెందాడు, ఇశ్రాయేలీయులందరు అతనికి విధేయులయ్యారు.

  24. యెహోవా సొలొమోనును ఇశ్రాయేలీయులందరి ఎదుట ఎంతో ఉన్నతంగా చేసి, అతనికి ముందున్న ఇశ్రాయేలీయుల రాజులలో ఏ రాజుకు కలగని రాజ వైభవాన్ని అతనికి ప్రసాదించారు.

  25. దావీదు కుమారుడు సొలొమోను తన రాజ్యంలో రాజుగా స్థిరపడ్డాడు, అతని దేవుడైన యెహోవా అతనికి తోడుగా ఉండి అతన్ని గొప్పగా హెచ్చించాడు.