God
God ను ప్రస్తావించే వచనాలు
యెదూతూను కుమారుల నుండి: గెదల్యా, జెరీ, యెషయా, షిమ్యా, హషబ్యా, మత్తిత్యా, మొత్తం ఆరుగురు, వీరు స్తుతి పాటలు పాడుతూ యెహోవాను స్తుతించడానికి వీణ వాయిస్తూ ప్రవచించే తమ తండ్రియైన యెదూతూను పర్యవేక్షణలో ఉన్నవారు.
(వీరంతా రాజుకు దీర్ఘదర్శిగా ఉన్న హేమాను కుమారులు. తన వాగ్దానాల ప్రకారం హేమానును గొప్ప చేయడానికి దేవుడు హేమానుకు పద్నాలుగు మంది కుమారులను, ముగ్గురు కుమార్తెలను ఇచ్చారు.)
వీరందరు తమ తండ్రుల పర్యవేక్షణలో ఉండి, యెహోవా మందిరంలో తాళాలు, వీణలు, సితారాలు వాయిస్తూ, పాటలు పాడుతూ దేవుని మందిరం దగ్గర సేవ చేసేవారు. ఆసాపు, యెదూతూను, హేమానులు రాజు పర్యవేక్షణలో ఉండేవారు.
యెహోవాకు పాటలు పాడడంలో నైపుణ్యం ఉన్న వీరి బంధువులందరితో కలిపి వీరి సంఖ్య 288.
అమ్మీయేలు ఆరవవాడు, ఇశ్శాఖారు ఏడవవాడు, పెయుల్లెతై ఎనిమిదవ వాడు. (దేవుడు ఓబేద్-ఎదోమును ఆశీర్వదించారు.)
వారి నాయకులకు అనుగుణంగా, ఇలా ఏర్పాటైన ద్వారపాలకుల విభాగాలకు తమ బంధువులు చేసినట్లే యెహోవా మందిరంలో సేవ చేయడానికి బాధ్యతలు అప్పగించారు.
అహీయా నాయకత్వంలో నడిపించబడిన ఇతర లేవీయులు, దేవుని మందిరంలోని ఖజానాలకు యెహోవాకు సమర్పించబడిన కానుకల ఖజానాలకు బాధ్యత వహించారు.
యెహీయేలీ కుమారులు, జేతాము అతని సోదరుడైన యోవేలు. వీరికి యెహోవా ఆలయ ఖజానాల బాధ్యత అప్పగించబడింది.
వారు యుద్ధంలో స్వాధీనం చేసుకున్న సొమ్ములో కొంత భాగాన్ని యెహోవా ఆలయ మరమత్తు కోసం ప్రతిష్ఠించారు.
హెబ్రోనీయుల నుండి: హషబ్యా, అతని బంధువులు పదిహేడు వందల మంది సమర్థులైన వారికి యొర్దాను నదికి పడమర వైపున ఉన్న ఇశ్రాయేలు ప్రాంతంలో యెహోవాకు చేసే మొత్తం సేవ రాజుకు చేసే సేవ బాధ్యత అప్పగించబడింది.
కుటుంబ పెద్దలుగా ఉన్న సమర్థులైన యెరీయా బంధువులు రెండువేల ఏడువందలమంది. రాజైన దావీదు వారిని దేవుని విషయాలన్నిటిలో, రాజ వ్యవహారాలలో రూబేనీయులమీద, గాదీయులమీద, మనష్షే అర్థగోత్రం వారిమీద నియమించాడు.)
ఇశ్రాయేలును ఆకాశ నక్షత్రాలంత విస్తారంగా చేస్తానని యెహోవా వాగ్దానం చేశారు, కాబట్టి ఇరవై సంవత్సరాలు, అంతకన్నా తక్కువ వయస్సున్న వారిని దావీదు లెక్కించలేదు.
రాజైన దావీదు లేచి నిలబడి ఇలా అన్నాడు: “నా తోటి ఇశ్రాయేలీయులారా, నా ప్రజలారా, వినండి. మన దేవునికి పాదపీఠంగా యెహోవా నిబంధన మందసాన్ని ఉంచే మందిరాన్ని నేను నిర్మించాలని నా హృదయంలో అనుకున్నాను, దాన్ని కట్టడానికి సన్నాహాలు చేశాను.
అయితే దేవుడు నాతో, ‘నీవు యుద్ధాలు చేసి రక్తం చిందించావు కాబట్టి, నీవు నా పేరిట మందిరాన్ని కట్టించకూడదు’ అని చెప్పారు.
“అయినా, ఇశ్రాయేలీయుల మీద ఎప్పుడు రాజుగా ఉండడానికి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నన్ను, నా కుటుంబమంతటి నుండి ఎన్నుకున్నారు. ఆయన యూదా గోత్రాన్ని, యూదా గోత్రంలో నా తండ్రి కుటుంబాన్ని ఎన్నుకుని, నా తండ్రి కుమారులలో నుండి నన్ను ఇశ్రాయేలు అంతటి మీద రాజుగా చేయడానికి ఇష్టపడ్డారు.
యెహోవా నాకు అనేక కుమారులను ఇచ్చారు. వారందరి నుండి, ఇశ్రాయేలీయులపై యెహోవా రాజ్యసింహాసనం మీద కూర్చోడానికి ఆయన నా కుమారుడైన సొలొమోనును ఎన్నుకున్నారు.
ఆయన నాతో ఇలా అన్నారు: ‘నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఎన్నుకున్నాను, నేను అతనికి తండ్రిగా ఉంటాను కాబట్టి అతడు నా మందిరాన్ని, ఆవరణాలను కట్టిస్తాడు.
ఈ రోజుల్లో జరుగుతున్నట్లుగానే, అతడు నా ఆజ్ఞలను న్యాయాన్ని స్థిరంగా అనుసరిస్తే, నేనతని రాజ్యాన్ని శాశ్వతంగా స్థిరపరుస్తాను.’
“కాబట్టి ఇప్పుడు యెహోవా సమాజంగా చేరిన ఇశ్రాయేలీయులందరు చూస్తుండగా, మన దేవుడు వింటుండగా, నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఈ మంచి దేశాన్ని స్వాధీనపరచుకుని, మీ తర్వాత మీ వారసులకు దానిని శాశ్వతమైన వారసత్వంగా అందించేలా మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలన్నిటిని జాగ్రత్తగా పాటించండి.
“సొలొమోనూ, నా కుమారుడా! నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశోధిస్తారు, ఆలోచనల ఉద్దేశాలన్నిటిని గ్రహిస్తారు కాబట్టి నీవు ఆయనను తెలుసుకుని పూర్ణహృదయంతో చిత్తశుద్ధితో ఆయనను సేవించు. నీవు ఆయనను వెదికితే, ఆయన నీకు దొరుకుతారు; అయితే నీవు ఆయనను విడిచిపెడితే, ఆయన నిన్ను శాశ్వతంగా తిరస్కరిస్తారు.
పరిశుద్ధాలయంగా ఉండేలా ఒక ఇల్లు కట్టడానికి యెహోవా నిన్ను ఎన్నుకున్నారు అనే సంగతిని గ్రహించి ధైర్యంగా ఉండి పని చేయి.”
దేవుని ఆత్మ దావీదు హృదయంలో పెట్టిన నమూనాలను అతడు సొలొమోనుకు ఇచ్చాడు. యెహోవా మందిర ఆవరణాలకు, చుట్టూ ఉండే గదులకు, దేవుని ఆలయ ఖజానాలకు, సమర్పించబడిన వస్తువుల ఖజానాలకు నమూనాలు అతడు ఇచ్చాడు.
యాజకుల లేవీయుల విభాగాల గురించి, యెహోవా మందిరంలో జరగాల్సిన సేవలన్నిటి గురించి, అలాగే దాని సేవలో ఉపయోగించబడే పాత్రల గురించి కూడా దావీదు అతనికి నియమాలు తెలియజేశాడు.
ధూపవేదికకు కావలసిన స్వచ్ఛమైన బంగారాన్ని దావీదు అతనికి ఇచ్చాడు. తమ రెక్కలు విప్పి యెహోవా నిబంధన మందసాన్ని కప్పివుంచే బంగారు కెరూబుల రథం యొక్క నమూనాను కూడా దావీదు అతనికిచ్చాడు.
అప్పుడు దావీదు, “ఇదంతా యెహోవా తన చేతిని నా మీద ఉంచడం వలన నేను వీటన్నిటిని వ్రాశాను, ఈ నమూనా వివరాలన్ని నేను గ్రహించగలిగేలా ఆయన చేశారు” అని చెప్పాడు.