కంటెంట్‌కు వెళ్లండి

Asaph

34 వచనాలు · 5 కుటుంబ సభ్యులు

Asaph ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది. ఒక ఆసాపు కీర్తన. ఒక గీతము. యూదాలో దేవుడు ప్రఖ్యాతి గాంచారు; ఇశ్రాయేలులో ఆయన నామం గొప్పది.

  2. సంగీత దర్శకుడైన యెదూతూనుకు. ఒక ఆసాపు కీర్తన. నేను సహాయం కోసం దేవునికి మొరపెట్టాను; ఆయన వింటాడని నేను దేవునికి మొరపెట్టాను.

  3. ఆసాపు ధ్యానకీర్తన. నా ప్రజలారా! నా ఉపదేశం వినండి; నా నోటి మాటలు వినండి.

  4. ఆసాపు కీర్తన. ఓ దేవా, పరదేశులు స్వాస్థ్యాన్ని ఆక్రమించుకున్నారు; అవి మీ పవిత్ర మందిరాన్ని అపవిత్రం చేశారు, యెరూషలేమును పాడు దిబ్బగా చేశారు.

  5. సంగీత దర్శకునికి. “నిబంధన కలువలు” అనే రాగము మీద పాడదగినది. ఆసాపు కీర్తన. ఇశ్రాయేలు ప్రజల కాపరీ, యోసేపును మందగా నడిపిస్తున్నవాడా, మమ్మల్ని ఆలకించండి. కెరూబుల మధ్య సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడా,

  6. సంగీత దర్శకునికి. గిత్తీతు అనే రాగం మీద పాడదగినది. ఆసాపు కీర్తన. మనకు బలంగా ఉన్న దేవునికి ఆనంద గానం చేయండి; యాకోబు దేవునికి బిగ్గరగా కేకలు వేయండి!

  7. ఆసాపు కీర్తన. దేవుడు గొప్ప సభలో నిలబడి ఉన్నారు; ఆయన దైవముల మధ్య తీర్పు ఇస్తారు:

  8. ఒక గీతము. ఆసాపు కీర్తన. ఓ దేవా! మౌనంగా ఉండకండి; ఓ దేవా, మమ్మల్ని పెడచెవిని పెట్టకండి, నిశ్చలంగా ఉండకండి.

  9. హిల్కీయా కుమారుడు రాజభవన నిర్వాహకుడైన ఎల్యాకీము, శాస్త్రి షెబ్నా, ఆసాపు కుమారుడు, రాజ్య లేఖికుడైన యోవాహు అతని దగ్గరకు వెళ్లారు.