కంటెంట్‌కు వెళ్లండి

Aaron

331 వచనాలు · 9 కుటుంబ సభ్యులు

Aaron ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఏలీయాబు కుమారులు నెమూయేలు, దాతాను, అబీరాము. ఈ దాతాను, అబీరాములే మోషే అహరోనులకు ఎదురు తిరిగినవారు, కోరహు అనుచరులు యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు వారి మధ్య ఉన్న అధికారులు.

  2. అమ్రాము భార్యపేరు యోకెబెదు, ఈమె లేవీ సంతానం, లేవీయులకు ఈజిప్టులో ఉన్నప్పుడు జన్మించింది. అమ్రాము వల్ల అహరోనును, మోషేను, వారి సహోదరి మిర్యామును కన్నది.

  3. అహరోను నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారుల తండ్రి.

  4. వీరిలో ఏ ఒక్కరైన మోషే, యాజకుడైన అహరోను సీనాయి ఎడారిలో ఇశ్రాయేలీయుల జనాభా లెక్క తీసుకున్నప్పుడు ఉన్నవారు కారు.

  5. చూసిన తర్వాత, నీవును నీ అన్న అహరోను లాగే చనిపోయి స్వజనుల దగ్గరకు చేరతావు.

  6. ఇశ్రాయేలీయులు మోషే అహరోనుల నాయకత్వంలో సేనలుగా ఏర్పడి ఈజిప్టు నుండి బయలుదేరి చేసిన ప్రయాణాలు.

  7. యెహోవా ఆజ్ఞ ప్రకారం యాజకుడైన అహరోను హోరు పర్వతం మీద చనిపోయాడు, ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి వచ్చిన నలభైయవ సంవత్సరం, అయిదవ నెల, మొదటి రోజున అతడు చనిపోయాడు.

  8. హోరు పర్వతం మీద అహరోను చనిపోయినప్పుడు అతని వయస్సు నూట యిరవై మూడు సంవత్సరాలు.

  9. అహరోనును కూడా నాశనం చేసేంతగా యెహోవా అతనిపై కోప్పడ్డారు, కాని నేను అప్పుడు అహరోను కోసం కూడా ప్రార్థన చేశాను.

  10. ఇశ్రాయేలీయులు బెనె యహకాను బావులనుండి మొసేరాకు ప్రయాణించారు. అక్కడ అహరోను చనిపోయి పాతిపెట్టబడ్డాడు, అతని కుమారుడైన ఎలియాజరు అతనికి బదులుగా యాజకుడయ్యాడు.

  11. నీ సహోదరుడు అహరోను హోరు కొండపై చనిపోయి తన ప్రజల దగ్గరకు చేరుకున్నట్టు, నీవు ఎక్కిన కొండమీద నీవు చనిపోయి నీ ప్రజల దగ్గరకు చేరుతావు.

  12. కహాతీయులకు వారి వంశాల ప్రకారం మొదటి చీటి వచ్చింది. యాజకుడైన అహరోను సంతతివారైన లేవీయులకు యూదా, షిమ్యోను, బెన్యామీను గోత్రాల నుండి పదమూడు పట్టణాలు కేటాయించారు.

  13. లేవీయులైన కహాతీయుల వంశాల్లోని అహరోను సంతతివారికి ఈ క్రింది పట్టణాలు కేటాయించారు, ఎందుకంటే మొదటి చీటి వారికి పడింది:

  14. కాబట్టి యాజకుడైన అహరోను సంతతివారికి హెబ్రోను (హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణం), లిబ్నా,

  15. అహరోను సంతతివారైన యాజకులకు పచ్చికబయళ్లతో పాటు ఇచ్చిన పట్టణాలు మొత్తం పదమూడు.

  16. “ ‘నేను మోషే అహరోనులను పంపి, అక్కడ నేను చేసిన కార్యాలతో ఈజిప్టువారిని బాధపెట్టి, మిమ్మల్ని బయటకు రప్పించాను.

  17. అహరోను కుమారుడైన ఎలియాజరు చనిపోయినప్పుడు ఎఫ్రాయిం కొండసీమల్లో అతని కుమారుడైన ఫీనెహాసుకు ఇచ్చిన గిబియాలో వారతన్ని పాతిపెట్టారు.

  18. అహరోను కుమారుడు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు దాని ముందు నిలబడి సేవ చేసేవాడు.) వారు అడిగారు, “మేము వెళ్లి మా తోటి ఇశ్రాయేలీయులైన బెన్యామీనీయుల మీద యుద్ధానికి వెళ్లాల వద్దా?” యెహోవా జవాబిస్తూ, “వెళ్లండి, రేపు వారిని మీ చేతికి అప్పగిస్తాను” అన్నారు.

  19. అప్పుడు సమూయేలు ప్రజలతో ఇలా అన్నాడు, “మోషేను అహరోనును నియమించి మీ పూర్వికులను ఈజిప్టు దేశంలో నుండి తీసుకువచ్చింది యెహోవాయే గదా.

  20. “యాకోబు ఈజిప్టుకు వచ్చిన తర్వాత, వారు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టగా యెహోవా మోషే అహరోనులను పంపారు. వారు మీ పూర్వికులను ఈజిప్టు నుండి తీసుకువచ్చి ఈ స్థలంలో స్థిరపరిచారు.

  21. అమ్రాము పిల్లలు: అహరోను, మోషే, మిర్యాము. అహరోను కుమారులు: నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు.

  22. అయితే అహరోను అతని సంతానం దహనబలిపీఠం మీద ధూపవేదిక మీద అర్పణలు అర్పించడానికి, అతి పరిశుద్ధ స్థలంలో చేయవలసిన వాటన్నిటిని చేయడానికి, దేవుని సేవకుడైన మోషే ఆదేశించిన ప్రకారం ఇశ్రాయేలు కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి నియమించబడ్డారు.

  23. వీరు అహరోను సంతానం: అహరోను కుమారుడు ఎలియాజరు, అతని కుమారుడు ఫీనెహాసు, అతని కుమారుడు అబీషూవ,

  24. అహరోను సంతతివారైన కహాతీయులకు మొదటి చీటి పడింది, కాబట్టి సరిహద్దులతో వారికి కేటాయించబడిన నివాసస్థలాలు ఇవి:

  25. అహరోను సంతానానికి ఇవ్వబడిన పట్టణాలు ఆశ్రయ పట్టణమైన హెబ్రోను, లిబ్నా, యత్తీరు, ఎష్తెమోవా,