Skip to content
2 పేతురు 2:7-8

2 పేతురు 2:7-8

7
దుష్టుల కామ వికార ప్రవర్తన వలన బాధపడిన నీతిమంతుడైన లోతును ఆయన రక్షించారు.
8
ఎందుకంటే, ఈ నీతిమంతుడు దినదినం వారి మధ్య జీవిస్తూ వారి చెడు కార్యాలను చూసి, వారి మాటలు విని తన నీతిగల మనస్సులో వేదన చెందాడు.

ఈ భాగాన్ని అధ్యయనం చేయండి

ఈ మొత్తం భాగంపై వ్యాఖ్యానం

లేఖనాల్లో ఇది ఇంకెక్కడ ఉందో

  • ఆదికాండము 19:16

    లోతు సంశయిస్తుండగా ఆ మనుష్యులు లోతును, అతని భార్యను, ఇద్దరు కుమార్తెలను చేయి పట్టుకుని పట్టణం బయటకు తీసుకువచ్చారు, ఎందుకంటే యెహోవా వారిపై కనికరం చూపారు.
    వచనం 7 నుండి
  • ఆదికాండము 19:29

    దేవుడు మైదానంలోని పట్టణాలను నాశనం చేసినప్పుడు, ఆయన అబ్రాహామును జ్ఞాపకం చేసుకున్నారు, లోతును, తాను నివసించిన ఆ పట్టణాలను పడగొట్టిన విపత్తు నుండి అతన్ని తప్పించారు.
    వచనం 7 నుండి
  • కీర్తనలు 119:158

    నేను ద్రోహులను అసహ్యంగా చూస్తాను, ఎందుకంటే వారు మీ వాక్కుకు లోబడరు.
    వచనం 8 నుండి
  • యెహెజ్కేలు 9:4

    యెహోవా అతనితో, “నీవు వెళ్లి యెరూషలేము పట్టణమంతా తిరిగి అక్కడ జరుగుతున్న అసహ్యకరమైన పనులన్నిటిని బట్టి దుఃఖించి విలపించే వారి నుదిటిపై ఒక గుర్తు పెట్టు” అన్నారు.
    వచనం 8 నుండి
  • కీర్తనలు 119:136

    ప్రజలు మీ ధర్మశాస్త్రానికి లోబడకపోవడం చూసి, నా కళ్ల నుండి కన్నీరు ప్రవహిస్తుంది.
    వచనం 8 నుండి
  • 1 కొరింథీయులకు 10:13

    సాధారణంగా మనష్యులకు కలిగే శోధనలు తప్ప మరి ఏ ఇతర శోధనలు మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహించగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధించబడనివ్వడు. కాని మీరు శోధించబడినప్పుడు దానిని సహించడానికి తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే అందిస్తాడు.
    వచనం 7 నుండి
  • 2 పేతురు 3:17

    కాబట్టి, ప్రియ స్నేహితుల్లారా, మీరు ముందుగా హెచ్చరించబడిన ప్రకారం మీ సుస్థిర స్థానం నుండి భ్రష్టులు కాకుండా, అన్యాయస్థుల తప్పిదాల వల్ల పెడత్రోవ పట్టి దుర్మార్గులు కాకుండా ఉండడానికి జాగ్రత్తగా ఉండండి.
    వచనం 7 నుండి
  • ఆదికాండము 13:13

    అయితే, సొదొమ ప్రజలు దుర్మార్గులు, యెహోవాకు విరోధంగా ఘోరంగా పాపం చేస్తూ ఉండేవారు.
    వచనం 7 నుండి
  • ఆదికాండము 19:7

    వారితో, “సోదరులారా వద్దు, ఈ దుర్మార్గపు పని చేయవద్దు.
    వచనం 7 నుండి
  • ఆదికాండము 19:8

    ఇదిగో! నాకు పురుషులతో లైంగిక సంబంధం పెట్టుకొనని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిని మీ దగ్గరకు తెస్తాను వారితో మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. కానీ ఈ మనుష్యులు అతిథులుగా నా ఇంటికి వచ్చారు, వీరిని మీరేమి చేయవద్దు” అని బ్రతిమాలుకున్నాడు.
    వచనం 7 నుండి
  • యిర్మీయా 9:1

    అయ్యో, నా తల నీటి బావి నా కళ్లు కన్నీటి ఊట అయి ఉంటే బాగుండేది! చంపబడిన నా ప్రజల కోసం నేను పగలు రాత్రి ఏడ్చే వాన్ని.
    వచనం 7 నుండి
  • యిర్మీయా 9:6

    నీవు మోసం మధ్య జీవిస్తున్నావు; వారి మోసాన్ని బట్టి వారు నన్ను తెలుసుకోవడానికి నిరాకరిస్తున్నారు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
    వచనం 7 నుండి
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options