Widows గురించి బైబిల్ వచనాలు: Intermarrying with, of kings considered treason
Intermarrying with, of kings considered treason గురించి వచనాలు
అప్పుడు ఆమె, “షూనేమీయురాలైన అబీషగును నీ సోదరుడైన అదోనియాను పెళ్ళి చేసుకోనివ్వు” అన్నది.
అందుకు రాజైన సొలొమోను తన తల్లితో, “అదోనియా కోసం షూనేమీయురాలైన అబీషగును ఎందుకు అడుగుతున్నావు? ఎంతైనా అతడు నాకు అన్న కాబట్టి అతని కోసం యాజకుడైన అబ్యాతారు కోసం సెరూయా కుమారుడైన యోవాబు కోసం రాజ్యాన్ని కూడా అడగవచ్చు కదా” అన్నాడు.
అప్పుడు రాజైన సొలొమోను యెహోవా పేరిట ఇలా ప్రమాణం చేశాడు: “ఈ మనవి కోసం అదోనియా తన ప్రాణం చెల్లించకపోతే యెహోవా నన్ను తీవ్రంగా శిక్షించును గాక!
నన్ను స్థిరపరచి, నా తండ్రియైన దావీదు సింహాసనం మీద నన్ను ఆసీనుడిగా చేసి, తన వాగ్దానం ప్రకారం నా కోసం రాజవంశాన్ని స్థాపించిన సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, అదోనియా ఈ రోజు చనిపోవలసిందే!”