Skip to content

Truth గురించి బైబిల్ వచనాలు: Unclassified scriptures relating to truth

37 వచనాలు · 73 కోణాలు

Unclassified scriptures relating to truth గురించి వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మోషే ఎదుట నుండి ఆయన దాటి వెళ్తూ, “యెహోవా, దేవుడైన యెహోవా కనికరం దయ కలిగినవారు, త్వరగా కోప్పడరు, ప్రేమ నమ్మకత్వాలతో నిండియున్నవారు,

  2. ఆయన మనకు ఆశ్రయదుర్గం, ఆయన పనులు పరిపూర్ణం, ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి. ఆయన తప్పుచేయని నమ్మదగిన దేవుడు, ఆయన యథార్థవంతుడు న్యాయవంతుడు.

  3. మీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. యెహోవా నా నమ్మకమైన దేవా, నన్ను విడిపించండి.

  4. యెహోవా వాక్కు న్యాయమైనది; ఆయన చేసే ప్రతిదీ నమ్మకమైనది.

  5. మీ నీతిని నా హృదయంలో నేనేమి దాచుకోను; మీ విశ్వసనీయతను మీ రక్షణ సహాయాన్ని గురించి నేను మాట్లాడతాను. మీ మారని ప్రేమను, మీ నమ్మకత్వాన్ని గురించి మహా సమాజానికి చెప్పకుండ దాచిపెట్టను.

  6. మీరు అంతరంగంలో నిజాయితీ కోరతారు; ఆ రహస్య ప్రదేశంలో మీరు నాకు జ్ఞానం బోధించారు.

  7. పరలోకం నుండి సాయం పంపి నన్ను విడిపిస్తారు, నన్ను దిగమ్రింగాలని చూస్తూ నా మీద చాడీలు పలికే వారి బారి నుండి నన్ను తప్పిస్తారు. సెలా దేవుడు తన మారని ప్రేమను, నమ్మకత్వాన్ని పంపుతారు.

  8. ఎందుకంటే మీ మారని ప్రేమ, ఆకాశాలను అంటుతుంది; మీ నమ్మకత్వం మేఘాలంటుతుంది.

  9. మారని ప్రేమ నమ్మకత్వం కలుసుకుంటాయి; నీతి సమాధానం పరస్పరం ముద్దు పెట్టుకుంటాయి.

  10. నమ్మకత్వం భూమిలో నుండి మొలుస్తుంది, నీతి ఆకాశం నుండి తొంగి చూస్తుంది.

  11. కాని ప్రభువా, మీరు కనికరం, కరుణ గల దేవుడు, త్వరగా కోప్పడరు, మారని ప్రేమ, నమ్మకత్వం కలిగి ఉన్నారు.

  12. నీతి న్యాయం మీ సింహాసనానికి పునాదులు; మారని ప్రేమ, నమ్మకత్వం మీ ఎదుట నడుస్తాయి.

  13. యెహోవా రాబోతున్నారు. భూలోకానికి తీర్పు తీరుస్తారు. నీతిని బట్టి లోకానికి, తన నమ్మకత్వాన్ని బట్టి ప్రజలకు తీర్పు తీరుస్తారు.

  14. ఇశ్రాయేలుకు తన ప్రేమను నమ్మకత్వాన్ని చూపాలని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు; మన దేవుని రక్షణ భూమ్యంతాల వరకు కనపడింది.

  15. యెహోవా మంచివారు ఆయన మారని ప్రేమ శాశ్వతమైనది; ఆయన నమ్మకత్వం తరతరాలకు ఉంటుంది.

  16. ఎందుకంటే మీ మారని ప్రేమ గొప్పది, అది ఆకాశాల కంటే ఎత్తైనది; మీ నమ్మకత్వం మేఘాలంటుతుంది.

  17. నిజాయితీగల పెదవులు శాశ్వతంగా ఉంటాయి, అబద్ధాలు మాట్లాడే నాలుక క్షణికమే ఉంటుంది.

  18. రాజులు నిజాయితీగల పెదవులను ఇష్టపడతారు, యథార్థంగా మాట్లాడేవారికి వారు విలువనిస్తారు.

  19. యెహోవా, మీరే నా దేవుడు; నేను మిమ్మల్ని ఘనపరచి మీ నామాన్ని స్తుతిస్తాను, పరిపూర్ణ నమ్మకత్వంతో మీరు ఎంతో కాలం క్రితం ఆలోచించిన అద్భుతాలను మీరు చేశారు.

  20. కాబట్టి న్యాయం వెనుకకు నెట్టబడింది, నీతి దూరంగా నిలబడింది. సత్యం వీధుల్లో పడి ఉంది. నిజాయితీ లోపలికి రాలేకపోతుంది.

  21. సత్యం ఎక్కడా కనిపించడం లేదు, చెడును విడిచిపెట్టేవాడు దోచుకోబడుతున్నాడు. న్యాయం జరగకపోవడం చూసి యెహోవా అసంతృప్తి చెందారు.

  22. దేశంలో ఆశీర్వాదం ఉండాలని కోరుకునేవారు ఖచ్చితంగా ఏకైక నిజ దేవుని పేరిట ఆశీర్వదించబడాలని కోరుకుంటారు; దేశంలో ప్రమాణం చేసేవారు, ఖచ్చితంగా ఏకైక నిజ దేవుని పేరిట ప్రమాణం చేస్తారు. గతకాలపు సమస్యలన్నీ మరచిపోయాను. అవి నా కళ్ల నుండి దాచబడ్డాయి.

  23. యెహోవా, మీ కళ్లు నమ్మకత్వాన్ని వెదకడం లేదా? మీరు వారిని మొత్తారు కాని వారికి నొప్పి కలగలేదు; మీరు వారిని చితకబాదారు, కానీ వారు దిద్దుబాటును నిరాకరించారు. వారు తమ ముఖాలను రాయి కంటే కఠినంగా చేసుకున్నారు పశ్చాత్తాపపడడానికి నిరాకరించారు.

  24. ఇప్పుడు నెబుకద్నెజరు అనే నేను పరలోక రాజును స్తుతిస్తూ, కీర్తిస్తూ, కొనియాడుతున్నాను, ఎందుకంటే ఆయన చేసే ప్రతిదీ సత్యమైనది, ఆయన విధానాలన్నీ న్యాయమైనవి. గర్వంతో జీవించేవారిని ఆయన అణచివేయగలడు.

  25. అయితే ముందు సత్య గ్రంథంలో వ్రాయబడింది ఏంటో నీకు చెప్తాను. (వాళ్ళను ఎదిరించడానికి మీ అధిపతియైన మిఖాయేలు తప్ప ఎవరూ నా పక్షంగా నిలువరు.